06 April 2022 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

April 5, 2022

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

‘‘మధురమైన పిల్లలూ - జ్ఞానం యొక్క గుహ్యమైన విషయాలను ఋజువు చేసేందుకు విశాల బుద్ధి కలవారిగా అయి చాలా యుక్తిగా అర్థం చేయించాలి, పాము చావాలి, కర్ర విరగకూడదు అని అంటారు’’

ప్రశ్న: -

హాహాకారాల సమయంలో పాస్ అయ్యేందుకు ఏ ముఖ్యమైన గుణం తప్పకుండా కావాలి?

జవాబు:-

ఓర్పు యొక్క గుణము. యుద్ధ సమయంలోనే మీ ప్రత్యక్షత జరుగుతుంది. ఎవరైతే శక్తివంతంగా ఉంటారో, వారే పాస్ అవ్వగలరు, భయపడేవారు ఫెయిల్ అయిపోతారు. చివర్లో పిల్లలైన మీ ప్రభావం వెలువడుతుంది, అప్పుడు ఓహో ప్రభూ మీ లీల… అని అంటారు. గుప్త వేషంలో ప్రభువు వచ్చారని అందరూ తెలుసుకుంటారు.

ప్రశ్న: -

అన్నింటికన్నా గొప్ప సౌభాగ్యం ఏమిటి?

జవాబు:-

స్వర్గంలోకి రావడం కూడా అన్నింటికన్నా గొప్ప సౌభాగ్యము. స్వర్గ సుఖాలను పిల్లలైన మీరే చూస్తారు. అక్కడ ఆది మధ్యాంతాలు దుఃఖం ఉండదు. ఈ విషయాలు మనుష్యుల బుద్ధిలో కష్టం మీద కూర్చుంటాయి.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

కొత్తగా పూసిన మొగ్గలు… (నయీ ఉమర్ కీ కలియా…)

ఓంశాంతి. భగవానువాచ. ఇంతకుముందు శ్రీకృష్ణ భగవానువాచ అని అనేవారు. శ్రీకృష్ణ భగవానువాచ కాదు అని ఇప్పుడు పిల్లలైన మీకు నిశ్చయం కలిగింది. శ్రీకృష్ణుడు త్రికాలదర్శి కాదు అనగా స్వదర్శన చక్రధారి కాదు. ఇప్పుడు ఒకవేళ భక్తులు ఈ విషయాన్ని వింటే డిస్టర్బ్ అవుతారు. మీరు వీరిపై ఉన్న నమ్మకాన్ని ఎందుకు తగ్గిస్తారు అని అంటారు. కృష్ణుడు స్వదర్శన చక్రధారి అని వారికి నిశ్చయముంది, స్వదర్శన చక్రాన్ని సదా విష్ణువుకు లేక కృష్ణుడికే చూపిస్తారు. శ్రీకృష్ణుడికి మరియు విష్ణువుకు మధ్యన ఏం సంబంధం ఉంది అనేది ప్రపంచానికైతే తెలియనే తెలియదు, వారు కేవలం విష్ణువును లేక కృష్ణుడిని స్వదర్శన చక్రధారి అని అంటారు. స్వదర్శన చక్రం యొక్క అర్థం కూడా ఎవరికీ తెలియదు. కేవలం సంహరించేందుకు చక్రాన్ని చూపించారు. దానిని ఒక హింసాత్మక ఆయుధంగా చూపించారు. వాస్తవానికి వారి వద్ద హింసాత్మక చక్రమూ లేదు, అహింసాత్మక చక్రమూ లేదు. జ్ఞానం కూడా రాధే-కృష్ణులు లేక విష్ణువు వద్ద లేదు. ఏ జ్ఞానము? ఈ సృష్టి చక్రం తిరగడానికి సంబంధించిన జ్ఞానము. అది కేవలం మీలో ఉంది. ఇప్పుడు ఇవి చాలా గుహ్యమైన విషయాలు. ఈ విషయాలన్నింటినీ వారు అర్థం చేసుకునేలా మరియు ప్రీతి కూడా స్థిరంగా నిలిచి ఉండేలా, యుక్తిగా ఎలా అర్థం చేయించాలి? డైరెక్టుగా అర్థం చేయిస్తే డిస్టర్బ్ అవుతారు. మీరు దేవతలను నిందిస్తున్నారని అంటారు ఎందుకంటే బ్రాహ్మణులైన మీరు తప్ప వారందరూ ఒకటే. మీరు ఎంత చిన్న-చిన్న కుమార్తెలు. బాబా అంటారు, చిన్న-చిన్న కుమార్తెలను, ప్రదర్శనీలో అర్థం చేయించేందుకు యోగ్యులుగా అయ్యేలా తెలివైనవారిగా తయారుచేయాలి. ఎవరిలోనైతే జ్ఞానం ఉంటుందో, వారు వారంతట వారే – మేము ప్రదర్శనీ అర్థం చేయించగలము అని ఆఫర్ చేసుకుంటారు. బ్రాహ్మణీలకు చాలా విశాల బుద్ధి ఉండాలి. ప్రదర్శనీలో అర్థం చేయించేందుకు సర్వీసబుల్ (సేవా యోగ్యులు) ను పంపించాలి. అంతేకానీ, వారికి కేవలం చూసే అభిరుచి ఉండడం కాదు. మొట్టమొదట అయితే ఈ నిశ్చయం కావాలి, గీతా భగవంతుడు నిరాకార పరమపిత పరమాత్మ శివ్, శ్రీకృష్ణుడిని భగవంతుడని అనరు, అందుకే, వారు వినిపించే ఆ గీత కూడా రాంగ్. ఇది ప్రపంచానికి పూర్తిగా కొత్త విషయము. ప్రపంచంలో అందరూ కృష్ణుడు గీతను వినిపించారని అంటారు. ఇక్కడ, కృష్ణుడు గీతను వినిపించలేరని అర్థం చేయించడం జరుగుతుంది. నెమలి కిరీటధారి, డబల్ కిరీటధారులు మరియు సింగిల్ కిరీటధారులు, సూర్యవంశీయులు, చంద్రవంశీయులు మరియు వైశ్య, శూద్ర వంశీయులు, ఎవ్వరికీ గీతా జ్ఞానం గురించి తెలియదు. ఆ జ్ఞానాన్ని భగవంతుడే వినిపించి భారత్ ను స్వర్గంగా తయారుచేసారు. మరి ప్రపంచంలో సత్యమైన గీతా జ్ఞానం ఎక్కడ నుండి వచ్చింది? వీరంతా భక్తి యొక్క లైన్ లోకి వస్తారు. వేద శాస్త్రాలు మొదలైనవి చదువుతూ-చదువుతూ ఫలితం ఏం లభించింది? పడిపోతూనే వచ్చారు, కళలు తగ్గిపోతూనే వచ్చాయి. ఎంతటి తీవ్రమైన తపస్య చేసినా సరే, శిరస్సు ఖండించి సమర్పించినా సరే, లాభమేమీ ఉండజాలదు. మనుష్యమాత్రులు ప్రతి ఒక్కరూ తమోప్రధానంగా తప్పకుండా అవ్వాల్సిందే. అందులోనూ, ముఖ్యంగా భారతవాసీ దేవీ-దేవతా ధర్మం వారే అందరికన్నా కింద పడిపోయారు. మొదట అందరికన్నా సతోప్రధానంగా ఉండేవారు, ఇప్పుడు తమోప్రధానంగా అయిపోయారు. ఎవరైతే అత్యంత ఉన్నతమైన స్వర్గానికి యజమానులుగా ఉండేవారో, వారిప్పుడు నరకానికి యజమానులుగా అయ్యారు. ఈ శరీరం పాత చెప్పు అని, దీని ద్వారా చదువుకుంటున్నామని పిల్లలైన మీ బుద్ధిలో ఉండాలి. దేవీ-దేవతా ధర్మం వారిది అన్నింటికన్నా ఎక్కువ పురాతనమైన చెప్పు. భారత్ శివాలయంగా ఉండేది, దేవతల రాజ్యం ఉండేది. వజ్ర-వైఢూర్యాల మహళ్ళు ఉండేవి. ఇప్పుడు వేశ్యాలయంలో అసురుల, వికారుల రాజ్యం ఉంది. డ్రామానుసారంగా మళ్ళీ ఇది వేశ్యాలయం నుండి శివాలయంగా అవ్వాల్సిందే. తండ్రి అర్థం చేయిస్తారు, అందరికన్నా ఎక్కువగా భారతవాసులే కింద పడిపోయారు. అర్ధకల్పము మీరే విషయ వికారాల్లో ఉండేవారు. అజామిళ్ వంటి పాపాత్ములు కూడా భారత్ లోనే ఉండేవారు. అన్నింటికన్నా పెద్ద పాపం వికారాల్లోకి వెళ్ళడము. ఒకప్పుడు సంపూర్ణ నిర్వికారులుగా ఉన్న దేవతలే ఇప్పుడు వికారులుగా అయ్యారు. తెల్లగా ఉన్నవారి నుండి నల్లగా అయ్యారు. అందరికన్నా ఉన్నతమైనవారే అందరికన్నా నీచంగా అయ్యారు. తండ్రి అంటారు, ఎప్పుడైతే సంపూర్ణ తమోప్రధానులుగా అవుతారో, అప్పుడు నేను వచ్చి వారిని సంపూర్ణ సతోప్రధానులుగా చేస్తాను. ఇప్పుడైతే ఎవ్వరినీ సంపూర్ణ నిర్వికారీ అని అనలేము, చాలా తేడా ఉంది. ఈ జన్మ కొంత బాగుండి ఉండవచ్చు కానీ మరుసటి జన్మ అయితే అజామిళ్ వంటిదిగా ఉంటుంది. తండ్రి అంటారు, నేను పతిత ప్రపంచం మరియు పతిత శరీరంలోనే ప్రవేశిస్తాను, వీరు పూర్తి 84 జన్మలను అనుభవించి తమోప్రధానంగా అయ్యారు. ఈ సమయంలో వీరి జన్మ మంచి ఇంట్లో జరిగింది ఎందుకంటే ఎంతైనా బాబా రథంగా అయ్యేది ఉంది. డ్రామా కూడా నియమానుసారంగా తయారై ఉంది, అందుకే సాధారణ రథాన్ని తీసుకున్నారు. ఇవి కూడా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. పిల్లలైన మీకు సేవ అంటే చాలా అభిరుచి ఉండాలి, బాబాను చూడండి, వారికి ఎంత అభిరుచి ఉంది. తండ్రి అయితే పతిత-పావనుడు, సర్వులకు అవినాశీ సర్జన్. మీకు ఎంత మంచి మందునిస్తారు. వారంటారు, నన్ను స్మృతి చేసినట్లయితే మీరెప్పుడూ రోగులుగా అవ్వరు. మీకు ఏ మందూ అవసరం పడదు. ఇది శ్రీమతము, అంతేకానీ, ఎవరో గురువు యొక్క మంత్రం కాదు. తండ్రి అంటారు, నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి, అప్పుడిక మాయ విఘ్నాలు రావు. మీరు మహావీరులుగా పిలువబడతారు. స్కూల్లో రిజల్టు చివర్లోనే వెలువడుతుంది. ఇక్కడ కూడా అంతిమంలో తెలుస్తుంది. ఎప్పుడైతే యుద్ధం ప్రారంభమవుతుందో, అప్పుడు మీ ప్రత్యక్షత కూడా జరుగుతుంది. మీరు ఎంత భయం లేనివారిగా, నిర్భయులుగా అయ్యారు అనేది అందరూ చూస్తారు. తండ్రి కూడా నిర్భయులు కదా. హాహాకారాలు ఎంతగా వ్యాపించినా కానీ ఓపిగ్గా అర్థం చేయించాలి – మనమందరమూ వెళ్ళాల్సిందే, పదండి, మన గమ్యమైన మౌంట్ ఆబుకు వెళ్దాము, బాబా వద్దకు వెళ్దాము అని చెప్పాలి. భయపడకూడదు. భయపడడం వలన కూడా ఫెయిల్ అయిపోతారు, అంత శక్తివంతులుగా అవ్వాలి. మొట్టమొదటగా కరువు వలన ఆపదలు వస్తాయి. బయటి నుండి ధాన్యం రాలేదు, కొట్లాటలు జరుగుతాయి. ఆ సమయంలో ఎంత నిర్భయులుగా ఉండాల్సి ఉంటుంది. యుద్ధంలో ఎంత బలశాలులు ఉంటారు, చావాలి మరియు చంపాలి అని అంటారు. వారికి ప్రాణ భయం కూడా ఉండదు. ఈ శరీరాన్ని విడిచి మరొకటి తీసుకుంటాము అన్న జ్ఞానం కూడా వారికి ఉండదు. వారు కేవలం సేవ చేస్తారు. వారు, గురునానక్ కు జై… హనుమాన్ కు జై… అని చెప్పమని నేర్పిస్తారు. మీకిచ్చే శిక్షణ ఏమిటంటే – శివబాబాను స్మృతి చేయండి. ఆ ఉద్యోగమైతే చేయాల్సిందే అనగా దేశ సేవ అయితే చేయాల్సిందే. శివబాబాను మీరు ఏ విధంగా స్మృతి చేస్తారో, ఆ విధంగా ఇంకెవ్వరూ స్మృతి చేయరు. శివుని భక్తులైతే అనేకమంది ఉన్నారు. కానీ శివబాబాను స్మృతి చేయమని మీకు డైరెక్షన్ లభిస్తుంది. తిరిగి వెళ్ళాలి, మళ్ళీ స్వర్గంలోకి రావాలి. ఇప్పుడు సూర్యవంశీయులది మరియు చంద్రవంశీయులది – ఈ రెండు రాజ్యాలు స్థాపన అవుతున్నాయి. ఈ జ్ఞానం అందరికీ లభిస్తుంది. ఎవరైతే ప్రజలుగా అయ్యేందుకు యోగ్యులో, వారు అంతే అర్థం చేసుకుంటారు. అంతిమంలో మీ ప్రభావం చాలా వెలువడుతుంది, అప్పుడు ఓహో ప్రభూ మీ లీల… అని అంటారు. ప్రభువు గుప్త వేషంలో వచ్చారని తెలుసుకుంటారు. కొందరు పరమాత్మ సాక్షాత్కారం లేక ఆత్మ సాక్షాత్కారం కలగాలని అని అంటారు కానీ సాక్షాత్కారం వలన లాభమేమీ ఉండదు. కేవలం ఒక నిప్పు రవ్వను చూసారనుకోండి, అది ఎవరు అనేదేమీ అర్థం చేసుకోరు. ఎవరిదైనా ఆత్మనా లేక పరమాత్మనా. దేవతల సాక్షాత్కారాలలో ఎంతో కొంత ఆర్భాటం ఉంటుంది, సంతోషం కలుగుతుంది. ఇక్కడైతే పరమాత్మ రూపమేమిటో కూడా తెలియదు. చివరి సమయం దగ్గరకు వచ్చే కొలది బాబా బుద్ధి తాళాన్ని తెరుస్తూ వెళ్తారు. స్వర్గంలోకి రావడం కూడా సౌభాగ్యము. స్వర్గ సుఖాలను ఇంకెవ్వరూ చూడలేరు. స్వర్గంలో యథా రాజా రాణి, తథా ప్రజలు అన్నట్లు ఉంటారు. ఇప్పుడు న్యూ ఢిల్లీ అన్న పేరు పెట్టారు. కానీ న్యూ భారత్ ఎప్పుడుండేది? ఇదైతే పురాతన భారత్. కొత్త భారత్ లో కేవలం దేవతా ధర్మం ఉండేది. చాలా కొద్దిమందే ఉండేవారు. ఇప్పుడైతే చాలామంది ఉన్నారు. ఎంతగా రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. వార్తాపత్రికల ద్వారా కూడా అర్థం చేయించవచ్చు, ఏమనంటే – మీరు న్యూ ఢిల్లీ, న్యూ భారత్ అని అంటారు కానీ నవ భారత్, న్యూ ఢిల్లీ అయితే కొత్త ప్రపంచంలోనే ఉంటాయి. అది స్వర్గంగా ఉంటుంది, దానిని మీరు ఆ విధంగా ఎలా తయారుచేయగలరు. ఇక్కడైతే అనేక ధర్మాలున్నాయి. అక్కడ ఒకటే ధర్మముంటుంది. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. మనమందరము మూలవతనం నుండి వచ్చాము. ఆత్మలైన మనమంతా జ్యోతిర్బిందువులము, నక్షత్రాల వలె ఉంటాము. ఏ విధంగా నక్షత్రాలు ఆకాశంలో నిలిచి ఉన్నాయే, కింద పడకుండా ఉన్నాయో, అలా ఆత్మలమైన మనము బ్రహ్మాండంలో ఉంటాము. పిల్లలైన మీకిప్పుడు తెలుసు, నిర్వాణధామంలో ఆత్మలు మాట్లాడలేవు ఎందుకంటే అక్కడ శరీరము ఉండదు. ఆత్మలమైన మనమంతా పరంధామంలో ఉండేవారమని మీరు చెప్పవచ్చు. ఇది కొత్త విషయము. శాస్త్రాలలో, ఆత్మ నీటి బుడగ వంటిదని, సాగరంలో ఇమిడిపోతుందని రాసేసారు. మీకు ఇప్పుడు తెలుసు, పతితపావనుడైన తండ్రి అందరినీ తీసుకువెళ్ళేందుకు వచ్చారు. 5000 సంవత్సరాల తర్వాతనే భారత్ స్వర్గంగా అవుతుంది. ఈ జ్ఞానం ఎవరి బుద్ధిలోనూ లేదు. తండ్రే వచ్చి అర్థం చేయిస్తారు – మనమే రాజ్యాన్ని తీసుకుంటాము, మనమే రాజ్యాన్ని పోగొట్టుకుంటాము. దీనికి అంతము లేదు. డ్రామా నుండి ఎవరూ తప్పించుకోలేరు. ఇవి ఎంత సహజమైన విషయాలు కానీ ఎవరి బుద్ధిలోనూ నిలవవు. ఇప్పుడు ఆత్మకు తన 84 జన్మల చక్రము గురించి తెలిసింది. దీని ద్వారా చక్రవర్తి మహారాజా, మహారాణిగా అవుతారు. ఇదంతా సమాప్తమవ్వనున్నది. వినాశనం ఎదురుగా నిలబడి ఉంది కావున ఎక్కువ ధనాన్ని కూడబెట్టాలి అన్న లోభమెందుకు? సర్వీసబుల్ (సేవా యోగ్యులైన) పిల్లలైతే, వారి పాలన యజ్ఞము నుండి జరుగుతుంది. సేవ చేయకపోతే ఉన్నత పదవి కూడా లభించదు. మేము ఉన్నత పదవిని పొందేంత సేవ చేస్తున్నామా అని బాబాను అడగవచ్చు. బాబా అంటారు – నీవు ప్రజల్లోకి వెళ్ళే లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇక్కడే తెలిసిపోతుంది. చిన్న-చిన్న పిల్లలకు కూడా నేర్పించి ఎంత తెలివైనవారిగా తయారుచేయాలంటే, వారు ప్రదర్శనీలో సేవ చేసి షో చేయగలగాలి. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. తండ్రి సమానంగా నిర్భయులుగా, భయం లేనివారిగా అవ్వాలి. ఓర్పుతో పని చేయాలి, భయపడకూడదు.

2. వినాశనం మీ ఎదురుగా ఉంది, అందుకే ఎక్కువ ధనం కూడబెట్టాలనే లోభముండకూడదు. ఉన్నత పదవి కోసం ఈశ్వరీయ సేవ చేసి సంపాదనను జమ చేసుకోవాలి.

వరదానము:-

పిల్లలందరికీ బాప్ దాదా ద్వారా తరగని ఖజానాలు లభించాయి. తమ వద్ద ఎవరు ఎన్ని ఖజానాలు జమ చేసుకున్నారో, అంతగా వారి నడవడిక మరియు ముఖంలో ఆత్మిక నషా కనిపిస్తుంది, వారికి జమ చేసుకున్న ఆత్మిక నషా అనుభవమవుతుంది. ఎవరికి ఎంత ఆత్మిక నషా ఉంటుందో, అంతగా వారి ప్రతి కర్మలో నిశ్చింత చక్రవర్తి యొక్క మెరుపు కనిపిస్తుంది ఎందుకంటే ఎక్కడైతే నషా ఉంటుందో, అక్కడ చింత ఉండదు. ఎవరైతే ఇలాంటి నిశ్చింత చక్రవర్తులుగా ఉంటారో, వారు సదా ప్రసన్నచిత్తులుగా ఉంటారు.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top