05 July 2021 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

July 4, 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

“మధురమైన పిల్లలూ - మీరు తండ్రి సమానంగా సత్యాతి-సత్యమైన సందేశకులుగా లేక మెసెంజర్లుగా అవ్వాలి, అందరికీ ఇంటికి వెళ్ళాలనే మెసేజ్ ను ఇవ్వాలి”

ప్రశ్న: -

ఈ రోజుల్లో మనుష్యుల బుద్ధి రోజంతా ఎటువైపు భ్రమిస్తూ ఉంటుంది?

జవాబు:-

ఫ్యాషన్ల వైపు. మనుష్యులను ఆకర్షించేందుకు అనేక రకాల ఫ్యాషన్లు చేసుకుంటారు. ఈ ఫ్యాషన్లను సినిమాల నుండే నేర్చుకున్నారు. పార్వతి దేవి కూడా ఇలా ఫ్యాషన్ చేసుకునేవారని, కేశాలంకరణ చేసుకునేవారని భావిస్తారు. తండ్రి అంటారు – పిల్లలైన మీరు ఈ పతిత ప్రపంచంలో ఫ్యాషన్లు చేసుకోకూడదు. నేను మిమ్మల్ని ఎటువంటి ప్రపంచంలోకి తీసుకువెళ్తానంటే, అక్కడ సహజ సౌందర్యం ఉంటుంది. ఫ్యాషన్ల అవసరముండదు.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

నీవే తల్లివి, తండ్రివి….. (తుమ్ హీ హో మాత-పిత…..)

ఓంశాంతి. పిల్లలు పాటను విన్నారు. మహిమను పాడేటప్పుడు బుద్ధి పైకి వెళ్ళిపోతుంది. వారే నావికుడు, పతితపావనుడు మరియు సత్యాతి-సత్యమైన మెసెంజర్ అని ఆత్మయే తండ్రి గురించి అంటుంది. తండ్రి వచ్చి ఆత్మలకు మెసేజ్ ఇస్తారు మరియు ఎవరినైతే మెసెంజర్ లేక సందేశకులని అంటారో, వారిలో కొంతమంది చిన్నవారిగా, కొంతమంది పెద్దవారిగా ఉంటారు. వాస్తవానికి వారు మెసేజ్ లేక సందేశాన్ని ఇవ్వరు. వారికి అసత్యపు మహిమను చేసారు. ఒక్కరికి తప్ప ఈ మనుష్య సృష్టిలో ఇంకెవ్వరికీ మహిమ లేదని పిల్లలు అర్థం చేసుకున్నారు. అందరికన్నా ఎక్కువ మహిమ ఈ లక్ష్మీనారాయణులది, ఎందుకంటే వీరు కొత్త ప్రపంచానికి యజమానులు. ఇది కూడా భారతవాసులకు తెలుసు. ప్రపంచంలోని వారికి భారత్ ప్రాచీన దేశమని మాత్రమే తెలుసు. భారత్ లోనే దేవీ-దేవతల రాజ్యముండేది. కృష్ణుడిని కూడా గాడ్ అని అంటారు. భారతవాసులు వీరిని భగవాన్-భగవతి అని అంటారు. కానీ ఈ భగవాన్-భగవతిలు సత్యయుగంలో రాజ్యం చేస్తారని ఎవరికీ తెలియదు. భగవంతుడు దేవీ-దేవతల రాజ్యాన్ని స్థాపన చేసారు. మేము భగవంతుని పిల్లలము కనుక మేము కూడా భగవాన్-భగవతిగా ఉండాలని బుద్ధి కూడా చెప్తుంది. అందరూ ఒక్కరి సంతానమే కదా! కానీ భగవాన్-భగవతి అని అనలేము. వారిని దేవీ-దేవతలని అంటారు. ఈ విషయాలన్నింటినీ తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. భారతవాసులైన మేము ముందు కొత్త ప్రపంచంలో ఉండేవారమని భారతవాసులు అంటారు. కొత్త ప్రపంచాన్ని అయితే అందరూ కోరుకుంటారు. బాపూజీ కూడా కొత్త ప్రపంచాన్ని, కొత్త రామ రాజ్యాన్ని కోరుకునేవారు. కానీ రామ రాజ్యమంటే అర్థమేమిటో ఏ మాత్రం తెలియదు. ఈ రోజుల్లో మనుష్యులకు ఎంత అహంకారం ఉంది. కలియుగంలో రాతిబుద్ధి కలవారు, సత్యయుగంలో పారసబుద్ధి కలవారు ఉంటారు. కానీ ఈ వివేకం ఎవరికీ లేదు. భారత్ యే సత్యయుగంలో పారసబుద్ధి కలదిగా ఉండేది, ఇప్పుడు భారత్ కలియుగంలో రాతిబుద్ధి కలదిగా ఉంది. మనుష్యులైతే దీనినే స్వర్గమని భావిస్తారు. స్వర్గంలో విమానాలుండేవి, పెద్ద పెద్ద మహళ్ళు ఉండేవి, అవన్నీ ఇప్పుడు కూడా ఉన్నాయి కదా అని అంటారు. సైన్సు ఎంత వృద్ధి చెందింది, ఎంత సుఖముంది, ఫ్యాషన్లు మొదలైనవి ఎన్ని ఉన్నాయి. రోజంతా బుద్ధి ఫ్యాషన్ల వెనుకే ఉంటుంది. కృత్రిమ సౌందర్యం కోసం కేశాలంకరణను ఎలా చేసుకుంటారు. ఎంత ఖర్చు చేస్తారు. ఈ ఫ్యాషన్లన్నీ సినిమాల నుండి వచ్చాయి. మేము పార్వతి దేవి వలె కేశాలంకరణ చేసుకుంటున్నామని భావిస్తారు. ఇవన్నీ ఆకర్షించేందుకే చేసుకుంటారు. ఇంతకుముందు పారసీ స్త్రీలు ఎవరూ వారిని చూసి ఆకర్షితులవ్వకూడదని ముఖంపై నల్లటి ముసుగు ధరించేవారు. దీనిని పతిత ప్రపంచమని అంటారు.

నీవే తల్లివి, తండ్రివి నీవే…… అని పాడుతారు. కానీ ఇలా ఎవరిని పిలవాలి? తల్లి-తండ్రులు ఎవరు అనేది కూడా తెలియదు. తల్లి-తండ్రులు తప్పకుండా వారసత్వాన్ని ఇచ్చి ఉంటారు. తండ్రి పిల్లలైన మీకు సుఖ వారసత్వాన్ని ఇచ్చారు. బాబా, మేమైతే మీ నుండి తప్ప ఇతరులెవ్వరి నుండి వినమని అంటారు కూడా. శివబాబా మహిమ గాయనం చేయడం జరుగుతుందని ఇప్పుడు మీకు తెలుసు. నేను పావనంగా ఉండేవాడను, ఇప్పుడు పతితంగా అయ్యానని బ్రహ్మా ఆత్మ కూడా స్వయంగా అంటుంది. బ్రహ్మా పిల్లలు కూడా ఇలాగే అంటారు – బ్రహ్మాకుమార-కుమారీలైన మేమే దేవీ-దేవతలుగా ఉండేవారము, తర్వాత 84 జన్మల అంతిమంలో పతితంగా అయ్యాము. ఎవరైతే నంబరువన్ పావనంగా ఉండేవారో, వారే నంబరువన్ పతితంగా అయ్యారు. తండ్రి ఎలా ఉంటారో పిల్లలు కూడా అలాగే ఉంటారు. స్వయంగా వీరు కూడా అంటారు, శివబాబా కూడా అంటారు – వీరి అనేక జన్మల అంతిమంలో నేను వస్తాను అని. మొదటి నంబరు పూజ్యులుగా ఉన్న లక్ష్మీ-నారాయణుల వంశానికి చెందిన వీరిలోకి వస్తాను. ఇప్పుడిది సంగమము, మీరు కలియుగంలో ఉండేవారు, ఇప్పుడు సంగమయుగం వారిగా అయ్యారు. తండ్రి సంగమంలోనే వస్తారు. డ్రామానుసారంగా పిల్లలు కూడా వృద్ధి చెందుతారు. ఇప్పుడు పిల్లలకు జ్ఞానమైతే లభించింది. మేమే దేవతలుగా ఉండేవారము, తర్వాత క్షత్రియ, వైశ్య, శూద్రులుగా అయ్యాము. మీకు చక్రమంతా మంచి రీతిగా తెలుసు. ఇది చాలా సహజము. మనమే 84 జన్మలు తీసుకున్నాము. ఈ విషయం కూడా చాలా మంది బుద్ధిలో కూర్చోదు. విద్యార్థుల్లో నంబరువారుగా అయితే ఉంటారు. కుడి నుండి ప్రారంభిస్తారు – ఫస్ట్ క్లాస్, సెకెండ్ క్లాస్, థర్డ్ క్లాస్. కుమార్తెలు స్వయం కూడా అంటారు – మాది థర్డ్ క్లాస్ బుద్ధి, మేము ఎవరికీ అర్థం చేయించలేము, అర్థం చేయించాలని మనస్సుకు చాలా అనిపిస్తుంది కానీ మాట్లాడలేమని అంటారు. బాబా ఏమి చేయగలరు? ఇది మీ కర్మల లెక్కాచారము. నేను మీకు కర్మ-అకర్మ-వికర్మల గతుల జ్ఞానాన్ని వినిపిస్తానని ఇప్పుడు తండ్రి అంటారు. కర్మలు చేయాలని పిల్లలైన మీకు తెలుసు. థర్డ్ క్లాస్ బుద్ధి కలవారు ఈ విషయాలను అర్థం చేసుకోలేరు. ఇది రావణ రాజ్యము కానీ ఇది ఎవరికీ తెలియదు. రావణ రాజ్యంలో మనుష్యులు వికర్మలే చేస్తారు కనుక కిందకు దిగజారిపోతూనే ఉంటారు. దుఃఖపు ప్రపంచంలోనే గురువులను ఆశ్రయించడం జరుగుతుంది. సద్గతి కోసమే గురువులను ఆశ్రయిస్తారు, వారు ముక్తిలోకి తీసుకువెళ్తారని భావిస్తారు. అది నిర్వాణధామము – వాణి నుండి అతీతమైన స్థానము. మనుష్యులు స్వయాన్ని వానప్రస్థులని చెప్పుకుంటారు. అలా పేరుకు మాత్రమే అంటారు. వానప్రస్థుల సభ కూడా ఉంటుంది. ఆస్తి మొదలైనవన్నీ పిల్లలకిచ్చేసి గురువు వద్దకు వెళ్ళి కూర్చుంటారు. ఆహార పానీయాలు మొదలైనవైతే తప్పకుండా పిల్లలే ఇస్తారు. కానీ వానప్రస్థం యొక్క అర్థం ఎవరికీ తెలియదు. మేము నిర్వాణధామానికి వెళ్ళాలి, మా ఇంటికి వెళ్ళాలి అని ఎవరి బుద్ధిలోకి రాదు. దానిని ఇల్లు అని కూడా అర్థం చేసుకోరు. జ్యోతి జ్యోతిలో కలిసిపోతుందని భావిస్తారు. నిర్వాణధామము నివసించే స్థానము. ఇంతకుముందు 60 సంవత్సరాల తర్వాత వానప్రస్థం స్వీకరించేవారు. అది ఒక నియమం వలె ఉండేది. ఇప్పటికీ అలా చేస్తారు. ఎవరూ వాణి నుండి అతీతంగా వెళ్ళలేరని ఇప్పుడు మీరు అర్థం చేయించగలరు. అందుకే, ఓ పతితపావన బాబా రండి, మమ్మల్ని పావనంగా చేసి ఇంటికి తీసుకువెళ్ళండి అని తండ్రినే పిలుస్తారు. ముక్తిధామం ఆత్మల ఇల్లు. పిల్లలైన మీకు, సత్యయుగంలో ఎవరుంటారు, అక్కడ వృద్ధి ఎలా జరుగుతుంది అని సత్యయుగం గురించి కూడా అర్థం చేయించారు. జనాభా గురించి కూడా ఎవరికీ తెలియదు. రామ రాజ్యంలో జనాభా ఎంత ఉంటుంది, పిల్లలు ఎలా జన్మిస్తారు అనేది ఏమీ అర్థం చేసుకోరు. ఈ డ్రామా చక్రం గురించి అర్థం చేయించగలిగే విద్వాంసులు గాని, ఆచార్యులు గాని, పండితులు గాని, ఎవరూ లేరు. 84 లక్షల జన్మల చక్రం ఎలా ఉంటుంది. ఇవి ఎన్ని రాంగ్ విషయాలు. దారం పూర్తిగా చిక్కులు పడి ఉంది. తండ్రి అర్థం చేయిస్తారు – తండ్రి కర్మ-అకర్మ-వికర్మల రహస్యాలన్నింటినీ అర్థం చేయించారని మీకిప్పుడు తెలుసు. సత్యయుగంలో మీ కర్మలు అకర్మలుగా ఉంటాయి. అక్కడ చెడు కర్మలేవీ జరగవు. అందుకే కర్మలు అకర్మలుగా ఉంటాయి. ఇక్కడ మనుష్యులు చేసే కర్మలన్నీ వికర్మలుగా అవుతాయి.

చిన్న-పెద్దలైన మనందరిది, మొత్తం ప్రపంచానిది వానప్రస్థ అవస్థ అని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. అందరూ వాణి నుండి అతీతంగా వెళ్ళేవారు. ఓ పతితపావనా రండి, వచ్చి మమ్మల్ని పతితుల నుండి పావనంగా చేయండి అని అంటారు. కానీ ఎప్పటివరకైతే పావనమైన కొత్త ప్రపంచం ఉండదో, అప్పటివరకు ఇక్కడ పతిత ప్రపంచంలో పావనమైనవారు ఎవరూ ఉండలేరు. ఈ పతిత ప్రపంచమంతా సమాప్తమవ్వనున్నది. మనం మళ్ళీ కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలని మీకు తెలుసు. ఎలా వెళ్తారు అనే నాలెడ్జ్ అంతా మీకు ఉంది. ఇది కొత్త ప్రపంచమైన అమరలోకం లేక పావన ప్రపంచం కోసం కొత్త నాలెడ్జ్. ఇప్పుడు మీరు సంగమంలో కూర్చున్నారు. బ్రాహ్మణులుగా లేని ఇతర మనుష్యులందరూ కలియుగంలో ఉన్నారని కూడా మీకు తెలుసు. మనమంతా సంగమంలో ఉన్నాము, సత్యయుగంలోకి వెళ్తున్నాము, తప్పకుండా ఇది సంగమయుగము. అది స్వర్గము. దానిని సంగమము అని అనరు. ఇప్పుడిది సంగమము. ఈ సంగమయుగము అన్నింటికన్నా చిన్నది. దీనిని లీప్ యుగమని అంటారు. ఇందులో మనుష్యులు పాపాత్ముల నుండి ధర్మాత్ములుగా అవుతారు. అందుకే దీనిని ధార్మిక యుగం అని అంటారు. కలియుగంలో మనుష్యులందరూ అధర్మయుక్తంగా ఉంటారు. అక్కడైతే అందరూ ధర్మాత్ములుగా ఉంటారు. భక్తి మార్గం యొక్క ప్రభావం ఎంత ఎక్కువగా ఉంది. రాతితో మూర్తులను తయారుచేస్తారు, వాటిని చూడడంతోనే మనుసు సంతోషిస్తుంది. ఇది రాతి పూజ. శివుని మందిరాలలో పూజ చేసేందుకు ఎంత దూర-దూరాలకు వెళ్తారు. శివుని చిత్రాన్ని అయితే ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. మరి అంత దూర-దూరాల వరకు ఎందుకు భ్రమించాలి. ఈ జ్ఞానం ఇప్పుడు బుద్ధిలోకి వచ్చింది. ఇప్పుడు మీ కళ్ళు తెరుచుకున్నాయి, బుద్ధి ద్వారం తెరుచుకుంది. తండ్రి నాలెడ్జ్ ఇచ్చారు. పరమపిత పరమాత్మ ఈ మనుష్య సృష్టికి బీజ రూపుడు, జ్ఞాన సాగరుడు, నాలెడ్జ్ ఫుల్. ఆత్మ కూడా ఈ నాలెడ్జ్ ను ధారణ చేస్తుంది. ఆత్మయే ప్రెసిడెంట్ మొదలైనవారిగా అవుతుంది. మనుష్యులు దేహాభిమానులుగా ఉన్న కారణంగా దేహమునే మహిమ చేస్తూ ఉంటారు. ఆత్మయే అంతా చేస్తుందని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఆత్మలైన మీరు 84 జన్మల చక్రాన్ని తిరిగి, పూర్తిగా దుర్గతి పాలయ్యారు. ఇప్పుడు ఆత్మలైన మనం తండ్రిని గుర్తించాము. తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాము. ఆత్మ అయితే శరీరాన్ని తప్పకుండా ధారణ చేయవలసి ఉంటుంది. శరీరం లేకుండా ఆత్మలు ఎలా మాట్లాడతాయి! ఎలా వింటాయి! తండ్రి అంటారు – నేను నిరాకారుడను, నేను కూడా శరీరాన్ని ఆధారంగా తీసుకుంటాను. శివబాబా ఈ బ్రహ్మా తనువు ద్వారా మనకు వినిపిస్తున్నారని మీకు తెలుసు. ఈ విషయాలను బ్రహ్మాకుమార-కుమారీలైన మీరు మాత్రమే అర్థం చేయిస్తారు. ఇప్పుడు మీకు జ్ఞానం లభించింది. బ్రహ్మా ద్వారా ఆది సనాతన దేవీ దేవతా ధర్మ స్థాపన జరుగుతుంది. ఆ తండ్రియే రాజయోగాన్ని నేర్పిస్తున్నారు, ఇందులో తికమకపడే విషయమే లేదు. శివబాబా మనకు అర్థం చేయిస్తారు, మనం మళ్ళీ ఇతరులకు అర్థం చేయిస్తాము. మనకు కూడా వినిపించేవారు శివబాబానే. మేము పతితుల నుండి పావనంగా అవుతున్నామని ఇప్పుడు మీరంటారు. ఇది పతిత ప్రపంచమని తండ్రి అర్థం చేయిస్తారు. ఇది రావణ రాజ్యము కదా! రావణుడు పాపాత్ములుగా చేస్తాడు. ఇది ఇతరులెవ్వరికీ తెలియదు. రావణుడి దిష్టి బొమ్మను కాలుస్తారు కానీ కొంచెం కూడా అర్థం చేసుకోరు. సీతను రావణుడు తీసుకువెళ్ళాడు, ఇది చేసాడు….. ఎన్ని కథలను కూర్చొని రాసారు. వాటిని కూర్చుని వింటున్నప్పుడు ఏడుస్తూ ఉంటారు. ఇవన్నీ కట్టుకథలు. బాబా మనల్ని వికర్మాజీతులుగా చేసేందుకు అర్థం చేయిస్తారు. నన్నొక్కడినే స్మృతి చేయండి, బుద్ధిని ఎక్కడా జోడింపజేయకండి అని అంటారు. మనకు శివబాబా తమ పరిచయాన్నిచ్చారు. పతితపావనుడైన తండ్రి వచ్చి తమ పరిచయాన్నిస్తారు. మనల్ని స్వర్గానికి యజమానులుగా తయారుచేస్తున్న బాబా ఎంత మధురమైనవారు అనేది మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. కర్మ, అకర్మ మరియు వికర్మల గతిని తెలుసుకొని శ్రేష్ఠ కర్మలే చేయాలి. జ్ఞానాన్ని దానం చేసి ధర్మాత్ములుగా అవ్వాలి.

2. ఇది వానప్రస్థ అవస్థ – ఈ అంతిమ ఘడియలలో పావనంగా అయి, పావన ప్రపంచంలోకి వెళ్ళాలి. పావనంగా అవ్వాలనే మెసేజ్ ను అందరికీ ఇవ్వాలి.

వరదానము:-

ఏ పిల్లలైతే మాస్టర్ నాలెడ్జ్ ఫుల్ గా ఉంటారో, వారెప్పుడూ భయపడే డ్యాన్స్ చేయలేరు. సెకండులో మెట్లు కిందకు దిగడం, సెకండులో పైకి ఎక్కడం – ఇప్పుడు ఈ సంస్కారాన్ని మార్చుకుంటే చాలా వేగంగా ముందుకు వెళ్తారు. కేవలం లభించి ఉన్న అథారిటీని, నాలెడ్జ్ ను, పరివారం యొక్క సహయోగాన్ని ఉపయోగించండి. తండ్రి చేతికి చేతినిచ్చి నడుస్తూ ఉన్నట్లయితే, సంతోషపు డ్యాన్స్ చేస్తూ ఉంటారు, భయపడే డ్యాన్స్ జరగదు. కానీ మాయ చేతిని పట్టుకున్నప్పుడు భయపడే డ్యాన్స్ జరుగుతుంది.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top