04 May 2021 TELUGU Murli Today – Brahma Kumaris

3 May 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Malayalam. This is the Official Murli blog to read and listen daily murlis.

“మధురమైన పిల్లలూ - నేను తండ్రి స్మృతిలో ఎంత సమయం ఉంటున్నాను, దేహీ-అభిమానీ స్థితి ఎంత సమయం ఉంటుంది అని తమను తాము ప్రశ్నించుకోండి”

ప్రశ్న: -

తండ్రి యొక్క ఏ డైరెక్షన్ ను భాగ్యశాలీ పిల్లలు మాత్రమే పాలన చేస్తారు?

జవాబు:-

తండ్రి డైరెక్షన్ ఏమిటంటే- మధురమైన పిల్లలూ, ఆత్మాభిమానీ భవ. ఆత్మలైన మీరంతా మేల్ (పురుష్). ఫీమేల్ (స్త్రీ) కాదు. ఆత్మలైన మీలోనే పాత్ర అంతా నిండి ఉంది. మేము దేహీ-అభిమానులుగా ఎలా ఉండాలి అన్న శ్రమను మరియు అభ్యాసమునే ఇప్పుడు చేయండి. ఇదే ఉన్నతమైన గమ్యము.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

భాగ్యాన్ని మేల్కొలుపుకొని వచ్చాను….. (తక్దీర్ జగాకర్ ఆయీ హూ…..)

ఓంశాంతి. మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలు పాటను విన్నారు. మేము కొత్త ప్రపంచపు భాగ్యాన్ని అనగా స్వర్గ భాగ్యాన్ని తయారుచేసుకొని, ఆత్మిక తండ్రి వద్ద కూర్చున్నామని, ఆత్మిక పిల్లలు అనగా జీవాత్మలు అన్నారు. ఇప్పుడు పిల్లలు ఆత్మిక-అభిమానులుగా అనగా ఆత్మాభిమానులుగా అవ్వాలి. ఇదే అన్నింటికన్నా పెద్ద శ్రమ. స్వయాన్ని ఆత్మగా భావించండి మరియు ఆత్మనైన నేను 84 జన్మలు తీసుకున్నాను అని భావించండి. ఒకసారి బ్యారిస్టరుగా, ఒకసారి ఒకలా, మరొకసారి మరోలా అయ్యాను. ఆత్మ మేల్ (పురుష్), పరస్పరంలో అందరూ సోదరులు. సోదరీలు కాదు. ఇది నా శరీరము అని ఆత్మ అంటుంది, మరి ఆ లెక్కలో ఆత్మ మేల్ (పురుష్), ఈ శరీరము ఫీమేల్ (స్త్రీ) అయినట్లు. ప్రతి విషయాన్ని మంచి రీతిగా అర్థం చేసుకోవాలి. బాబా చాలా విశాలబుద్ధి కలవారిగా, సూక్ష్మబుద్ధి కలవారిగా తయారుచేస్తారు. ఆత్మనైన నేను 84 జన్మలు తీసుకున్నానని ఇప్పుడు మీకు తెలుసు. మంచి లేక చెడు సంస్కారాలు ఆత్మలోనే ఉంటాయి. ఆ సంస్కారాల అనుసారంగా శరీరం కూడా అటువంటిదే లభిస్తుంది. అంతా ఆత్మపైనే ఆధారపడి ఉంటుంది. ఇది చాలా పెద్ద శ్రమ. జన్మ-జన్మలుగా లౌకిక తండ్రిని స్మృతి చేసారు, ఇప్పుడు పారలౌకిక తండ్రిని స్మృతి చేయాలి. పదే-పదే స్వయాన్ని ఆత్మగా భావించాలి. ఆత్మనైన నేను ఈ శరీరాన్ని తీసుకుంటాను. ఇప్పుడు ఆత్మలైన మనల్ని తండ్రి చదివిస్తారు. ఇది ఆత్మిక జ్ఞానము, దీనిని ఆత్మిక తండ్రి ఇస్తారు. పిల్లలు దేహీ-అభిమానులుగా అయి ఉండాలి – ఇదే మొట్టమొదటి ముఖ్యమైన విషయము. దేహీ-అభిమానులుగా అయి ఉండడము అనేది చాలా ఉన్నతమైన గమ్యము. జ్ఞానము ఉన్నతమైనది కాదు, జ్ఞానంలో శ్రమ ఏమీ లేదు. సృష్టి చక్రాన్ని తెలుసుకోవడమే చరిత్ర-భూగోళము. ఉన్నతాతి-ఉన్నతమైనవారు తండ్రి, తర్వాత సూక్ష్మవతనములోని దేవతలు. ప్రపంచ చరిత్ర-భూగోళాలైతే మనుష్య సృష్టిలో ఉంటాయి. మూలవతనము, సూక్ష్మవతనాలలో చరిత్ర-భూగోళాలు ఏవీ ఉండవు. అది శాంతిధామము. సత్యయుగము సుఖధామము, కలియుగము దుఃఖధామము. ఇక్కడ రావణ రాజ్యంలో ఎవరికీ శాంతి లభించజాలదు. ఆత్మనైన నేను శాంతిధామ నివాసిని అన్న జ్ఞానము ఇప్పుడు పిల్లలైన మీకు లభించింది. ఈ కర్మేంద్రియాలు కర్మలు చేసేందుకు ఉన్నాయి. కర్మలు చేయవచ్చు, చేయకపోవచ్చు. నేను ఒక ఆత్మను, నా స్వధర్మము శాంతి. మనం కర్మయోగులము కదా. కర్మలు కూడా తప్పకుండా చేయాలి. కర్మ-సన్యాసులుగా ఎప్పుడూ అవ్వలేరు. ఇది ఈ సన్యాసుల పాత్ర. వారు ఇళ్ళు-వాకిళ్ళను వదలి వెళ్తారు, భోజనం వండుకోరు, గృహస్థులను భిక్షం యాచిస్తారు, ఎంతైనా ఆ గృహస్థుల వద్దనే తింటారు కదా. ఇళ్ళు-వాకిళ్ళను వదిలేసినా, కర్మలనైతే చేస్తారు. కర్మ-సన్యాసులుగా అవ్వలేరు. ఆత్మ శాంతిధామంలో ఉన్నప్పుడు, కర్మ సన్యాసం ఉంటుంది. అక్కడ కర్మేంద్రియాలే ఉండవు కనుక కర్మలు ఎలా చేస్తారు. దీనిని కర్మక్షేత్రమని అంటారు. కర్మక్షేత్రముపైకి అందరూ రావలసి ఉంటుంది. అది శాంతిధామము లేక మూలవతనము. బ్రహ్మతత్వంలో ఆత్మ లీనమవుతుందని కాదు. ఆత్మలు శాంతిధామములో నివసిస్తాయి, మళ్ళీ పాత్రను అభినయించేందుకు ఇక్కడకు కర్మక్షేత్రముపైకి వస్తాయి. ఇవి విస్తారమైన విషయాలు. స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోండి మరియు తండ్రిని స్మృతి చేయండి, అప్పుడు వికర్మలు వినాశనమవుతాయని క్లుప్తంగా చెప్తారు. దీనినే భారత్ యొక్క ప్రాచీన యోగమని అంటారు. వాస్తవానికి దీనిని యోగమని కూడా అనకూడదు, స్మృతి అని అనాలి, ఇందులో శ్రమ ఉంది. చాలా తక్కువ మంది యోగులుగా అవుతారు. ముందు యోగం యొక్క శిక్షణ అవసరము, తర్వాతే జ్ఞానము. మొట్టమొదటిది తండ్రి స్మృతి.

తండ్రి అంటారు – దేహీ-అభిమానీ భవ, ఇదే ఆత్మిక స్మృతి యాత్ర, జ్ఞాన యాత్ర కాదు, ఇందులో చాలా శ్రమించవలసి ఉంటుంది. కొందరు బి.కె. లుగా చెప్పుకుంటారు కానీ తండ్రిని స్మృతి చేయరు. తండ్రి వచ్చి, బ్రహ్మా ద్వారా పిల్లలైన మిమ్మల్ని దేహీ-అభిమానులుగా తయారుచేస్తారు. ఇతను (బ్రహ్మా) దేహాభిమానిగా ఉండేవారు. ఇప్పుడు వీరిది దేహీ-అభిమానిగా అయ్యే పురుషార్థం నడుస్తుంది. బ్రహ్మా భగవంతుడేమీ కారు. ఇక్కడ మనుష్యమాత్రులందరూ పతితులుగా ఉన్నారు. పావనమైన శ్రేష్ఠాచారులు ఒక్కరు కూడా లేరు. పుణ్యాత్మ, పాపాత్మ అని ఆత్మ గురించే చెప్పడం జరుగుతుంది. నా ఆత్మను విసిగించవద్దు అని మనుష్యులు కూడా అంటారు. కానీ నేను ఎవరు అన్నది అర్థం చేసుకోరు. హే జీవాత్మ, నీవు ఏమి పని చేస్తున్నావు అని అడగడం జరుగుతుంది. ఆత్మనైన నేను, ఈ శరీరం ద్వారా ఫలానా వ్యాపారాన్ని చేస్తున్నానని అంటారు. కనుక మొట్టమొదట ఇది నిశ్చయం చేసుకొని, తండ్రిని స్మృతి చేయండి. ఈ ఆత్మిక నాలెడ్జ్ ను ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు. తండ్రి వచ్చి దేహీ-అభిమానులుగా చేస్తారు. అలాగని, జ్ఞానంలో ఎవరైనా చురుకుగా ఉంటే, వారు పక్కా దేహీ-అభిమానులుగా అయ్యారని కాదు. ఎవరైతే జ్ఞానాన్ని మంచి రీతిగా ధారణ చేస్తారో, వారు దేహీ-అభిమానులు. ఇకపోతే జ్ఞానాన్ని మంచి రీతిగా అర్థం చేసుకున్నవారు చాలామంది ఉంటారు, కానీ శివబాబా స్మృతిని మర్చిపోతారు. పదే-పదే స్వయాన్ని ఆత్మగా భావిస్తూ, తండ్రిని స్మృతి చేయాలి, ఇందులో జిన్ను వలె తయారవ్వాలి. జిన్ను కథ ఉంది కదా. తండ్రి కూడా ఈ పని ఇస్తారు – నన్ను స్మృతి చేయండి, లేదంటే మాయ మిమ్మల్ని తినేస్తుంది. మాయ జిన్ను వంటిది. తండ్రిని ఎంతగా స్మృతి చేస్తారో, అంతగా వికర్మలు వినాశనమవుతాయి మరియు మీకు చాలా ఆకర్షణ కలుగుతుంది. మాయ మిమ్మల్ని తలక్రిందులుగా చేసి చాలా తుఫానుల్లోకి తీసుకువస్తుంది. ఆత్మలైన మేము తండ్రి పిల్లలమని బుద్ధిలో ఇదే స్మృతి ఉండాలి. కేవలం ఈ సంతోషంలో ఉండాలి.

దేహాభిమానంలోకి రావడంతో మాయ చెంపదెబ్బ వేస్తుంది. హాతిమ్ తాయీ ఆటను కూడా చూపిస్తారు. నోటిలో నాణెం వేసుకోగానే సమస్య మాయమైపోతుంది. ఒకవేళ తండ్రి స్మృతిలో ఉన్నట్లయితే, మిమ్మల్ని కూడా మాయ విసిగించదు. ఇందులోనే యుద్ధం నడుస్తుంది. మీరు స్మృతి చేసే పురుషార్థం చేస్తారు కానీ మాయ ఏ విధంగా ముక్కు పట్టుకుంటుంది అంటే, స్మృతి చేయనివ్వదు, మీరు విసిగిపోయి నిద్రపోతారు. అంతగా మాయతో యుద్ధం నడుస్తుంది. ఇకపోతే ప్రపంచ చరిత్ర-భూగోళాలు అయితే చాలా సాధారణమైనవి. ఇప్పుడు మా 84 జన్మలు పూర్తయ్యాయి, ఇప్పుడు మేము తండ్రిని కలుసుకునేందుకు వెళ్తాము అని భావించండని మీకు పదే-పదే చెప్పడం జరుగుతుంది. ఇది గుర్తుంచుకోవడమే కష్టము. ఇకపోతే, ఎవరికైనా అర్థం చేయించడము కష్టమేమీ కాదు. అలాగని మేము చాలా బాగా అర్థం చేయిస్తాము కదా అని కాదు. అలా కాదు, స్మృతియే మొట్టమొదటి విషయము. ప్రదర్శనీలకు ఎంతోమంది వస్తారు. మొట్టమొదట ఈ పాఠాన్ని వారికి నేర్పించాలి – స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకొని తండ్రిని స్మృతి చేసినట్లయితే, తమోప్రధానము నుండి సతోప్రధానముగా అవుతారు. ముందు ఈ పాఠాన్నే చెప్పాలి. భారత్ యొక్క ప్రాచీన యోగాన్ని ఎవరూ నేర్పించలేరు. తండ్రి ఎప్పుడైతే వచ్చి నేర్పిస్తారో, అప్పుడే నేర్చుకోగలరు. మనుష్యులు మనుష్యులకు రాజయోగాన్ని నేర్పించలేరు, అది అసాధ్యము. సత్యయుగములోనైతే పావనమైనవారే ఉంటారు, అక్కడ ప్రారబ్ధాన్ని అనుభవిస్తారు. అక్కడ జ్ఞానము-అజ్ఞానము యొక్క విషయాలే ఉండవు. మీరు వచ్చి దుఃఖాన్ని హరించి, సుఖాన్ని ఇవ్వండి అని భక్తి మార్గంలోనే తండ్రిని పిలుస్తారు. సత్య-త్రేతా యుగాలలో గురువులు మొదలైనవారెవరూ ఉండరు. అక్కడ సద్గతిని పొంది ఉంటారు. మీరు 21 జన్మల కోసం సద్గతి యొక్క వారసత్వాన్ని పొందగలరు. బ్రహ్మాకుమారి అనగా 21 తరాలను ఉద్ధరణ చేసేవారు అని అంటారు. భారత్ లోనే ఈ విధంగా గాయనం చేయడం జరుగుతుంది. భారత్ లోనే మీకు 21 తరాల వారసత్వం లభిస్తుంది. అక్కడ మీరు, ఒక్క దేవీ దేవతా ధర్మానికి చెందినవారిగా ఉంటారు, వేరే ధర్మమేదీ ఉండదు. తండ్రి వచ్చి, మిమ్మల్ని మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేస్తారు. పవిత్రంగా అవ్వకుండా మనం తిరిగి ఎలా వెళ్ళగలము. ఇక్కడైతే అందరూ వికారులుగా, పతితులుగా ఉన్నారు. ధర్మ స్థాపకులు ఎవరైతే ఉన్నారో, వారు పాలన చేస్తారు, వారి ధర్మం వృద్ధి చెందుతూ ఉంటుంది. తిరిగి ఎవరూ వెళ్ళలేరు. పాత్రధారులు ఒక్కరు కూడా తిరిగి వెళ్ళలేరు. అందరూ సతోప్రధానము నుండి సతో, రజో, తమోలలోకి రావాల్సిందే. బ్రహ్మా పగలు, బ్రహ్మా రాత్రి అని బ్రహ్మాను గురించి కూడా అంటారు. అంటే సృష్టిలో బ్రహ్మా ఒక్కరే ఉంటారా ఏమిటి. ఇప్పుడు మీరు బ్రాహ్మణ కులానికి చెందినవారిగా అవుతున్నారు. మీరు రాత్రిలో ఉండేవారు, ఇప్పుడు పగలులోకి వెళ్తున్నారు.

పూజ్యులుగా ఎంత సమయం ఉంటారు, పూజారులుగా ఎన్ని జన్మలు అవుతారు అనేది మీకు అర్థం చేయించారు. తండ్రి ఎప్పటివరకైతే రారో, అప్పటివరకు ఎవరూ భ్రష్టాచారుల నుండి శ్రేష్ఠాచారులుగా అవ్వలేరు. వికారాల ద్వారా ఎవరైతే జన్మను తీసుకుంటారో, వారిని భ్రష్టాచారులని అంటారు, అందుకే దీనిని హెల్ అని అంటారు. హెల్ మరియు హెవెన్ – ఒకవేళ రెండింటిలోనూ దుఃఖమున్నట్లయితే, ఇక దానిని హెవెన్ అనే అనకూడదు. ఎప్పటివరకైతే పూర్తిగా అర్థం చేసుకోరో, అప్పటివరకు వ్యతిరేకమైన ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. భారత్ చాలా ఉన్నతంగా ఉండేదని మీరు అర్థం చేయించాలి. ఈశ్వరుని మహిమ ఏ విధంగా అపారమైనదో, అదే విధంగా భారత్ యొక్క మహిమ కూడా అపారమైనది. భారత్ ఎలా ఉండేది, ఆ విధంగా ఎవరు తయారుచేసారు, తండ్రి తయారుచేసారు. వారి మహిమను పాడుతారు. తండ్రియే వచ్చి పిల్లలను విశ్వానికి యజమానులుగా చేస్తారు. మనుష్యమాత్రులను దుర్గతి నుండి సద్గతిలోకి తీసుకువెళ్తారు. శాంతిధామానికి తీసుకువెళ్తారు, దాని కోసమే మనుష్యులు పురుషార్థం చేస్తారు. దానినే సంపూర్ణ సుఖము, సంపూర్ణ శాంతి, సంపూర్ణ పవిత్రత అని అంటారు. అక్కడ మీరు సుఖంగా కూడా ఉంటారు, శాంతిగా కూడా ఉంటారు. మిగిలిన ఆత్మలు శాంతిలో ఉంటారు. మేక్సిమం జన్మలు మీరు తీసుకుంటారు. మిగిలినవారు ఎవరైతే మినిమం జన్మలు తీసుకుంటారో, వారు సంపూర్ణ శాంతిలో ఉంటారు. వారు దోమల గుంపు వలె వస్తారు, ఒకటి-అర జన్మ పాత్రను అభినయిస్తారు, ఇదేమిటి? వారికి ఏ విలువ ఉండదు. దోమలకు ఏమి విలువ ఉంటుంది. రాత్రి జన్మిస్తాయి, రాత్రే మరణిస్తాయి. ఈ సమయంలో చాలా వరకు శాంతినే కోరుకుంటారు ఎందుకంటే ఈ సమయంలోని గురువులు శాంతిలోకి వెళ్ళేటువంటివారు.

స్వర్గవాసులుగా అయ్యేందుకు మీరు ఇక్కడకు వచ్చారు. స్వర్గవాసులను శాంతివాసులని అనరు. శాంతివాసులు అని నిరాకారీ లోకంలో ఉండేవారిని అంటారు. ముక్తి అనే పదము గురువుల నుండి నేర్చుకుంటారు. వైకుంఠపురికి వెళ్ళేందుకు మాతలు వ్రతాలు, నోములు చేస్తారు. ఎవరైనా మరణించినా కూడా, స్వర్గస్థులయ్యారని అంటారు. అలా ఎవరూ స్వర్గస్థులవ్వరు కానీ భారతవాసులు స్వర్గాన్నే నమ్ముతారు. భారత్ ప్యారడైజ్ గా (స్వర్గంగా) ఉండేదని భావిస్తారు. శివబాబా భారత్ లోనే వచ్చి, స్వర్గ రచనను రచిస్తారు కనుక తప్పకుండా ఇక్కడే రచిస్తారు, స్వర్గంలోకైతే రారు. నేను స్వర్గం మరియు నరకం యొక్క సంగమంలో వస్తానని బాబా అంటారు. కల్ప-కల్పము యొక్క సంగమంలో వస్తారు. వారు ప్రతి యుగంలో వస్తారని రాసేసారు. కల్పము అనే పదాన్ని మర్చిపోయారు. ఇది కూడా తయారుచేయబడిన ఆట, మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. ఈ అంతిమ జన్మలో మీరు తండ్రిని మరియు సృష్టి చక్రాన్ని తెలుసుకున్నారు. స్థాపన ఎలా జరుగుతుంది అనేది ఇప్పుడు మీరు నంబరువారుగా తెలుసుకున్నారు. ఈ ఆటంతా భారతవాసులైన మీపైనే తయారుచేయబడింది. ఇప్పుడు మీరు తండ్రి ద్వారా రాజయోగాన్ని నేర్చుకుంటారు. తండ్రి స్మృతి ద్వారానే రాజ్యాన్ని పొందుతారు. చిత్రాలు కూడా ఉన్నాయి కదా. ఈ చిత్రాలన్నింటినీ ఎవరు తయారుచేసారు. వీరికి గురువు ఎవరూ లేరు. ఒకవేళ ఎవరైనా గురువు ఉన్నా కూడా, ఆ గురువుకు ఒకే శిష్యుడు ఉండడు, అనేకమంది ఉంటారు కదా. ఈ నాలెడ్జ్ ఒక్క తండ్రికి తప్ప ఇంకెవరికీ తెలియదు. ఈ చిత్రాలను మీ దాదా తయారుచేయించారా అని చాలామంది అడుగుతారు. వీటిని తండ్రి దివ్యదృష్టి ద్వారా సాక్షాత్కారం చేయించారు. వైకుంఠాన్ని కూడా సాక్షాత్కారం చేయించారు. అక్కడ స్కూలు ఎలా నడుస్తుంది, ఏ భాష ఉంటుంది, అన్ని సాక్షాత్కారాలు జరిగాయి. పిల్లలు భట్టీలో ఉండేటప్పుడు, తండ్రి పిల్లలను ఆహ్లాదపరిచేవారు. కరాచీలో కేవలం మీరు మాత్రమే వేరుగా ఉండేవారు, అది మీ రాజ్యం వలె ఉండేది. మీ తపన, మీ భాష….. ఇతరులెవరూ అర్థం చేసుకోలేకపోయేవారు. ఇది ఖుదా యొక్క సభ అని అనుకునేవారు. మీరు నన్స్ అని బాబా అర్థం చేయించారు. నన్ బట్ ఒన్. ఒక్క తండ్రిని తప్ప ఇంకెవరినీ స్మృతి చేయకూడదు. ఆ నన్స్ కు క్రీస్తు మాత్రమే తెలుసు, క్రీస్తు తప్ప ఇంకెవరు తెలియదు.

వారసత్వం ఒక్క శివబాబా నుండి లభిస్తుందని మీకు తెలుసు. శివబాబా అయితే బిందువు. వారు కూడా ఎవరి ద్వారానో అర్థం చేయిస్తారు కదా. ప్రజాపిత బ్రహ్మా అయితే తప్పకుండా ఇక్కడే ఉంటారు. వీరి అనేక జన్మల అంతిమ జన్మలో, పతిత శరీరంలో ప్రవేశిస్తాను అని తండ్రి అంటారు. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. జ్ఞానాన్ని మంచి రీతిగా ధారణ చేసి, దేహీ-అభిమానులుగా అవ్వాలి. ఇదే శ్రమ. ఇదే ఉన్నతమైన గమ్యము. ఈ శ్రమ ద్వారా ఆత్మను సతోప్రధానంగా చేసుకోవాలి.

2. జిన్నులా అయి స్మృతి యాత్ర చేయాలి. మాయ ఎన్ని విఘ్నాలను కలిగించినా కానీ నోటిలో నాణెం వేసుకోవాలి. మాయతో విసిగిపోకూడదు. ఒక్కరి స్మృతిలో ఉంటూ తుఫానులను తొలగించుకోవాలి.

వరదానము:-

అలౌకిక జీవితంలో మాయ విఘ్నాలు రావడం కూడా ఒక అలౌకిక ఆట, శారీరిక శక్తి కోసం ఏ విధంగా ఆటలు ఆడించడం జరుగుతుందో, అదే విధంగా అలౌకిక యుగములో పరిస్థితులను ఆట బొమ్మలుగా భావిస్తూ, ఈ అలౌకిక ఆటను ఆడండి. వీటికి భయపడకండి. సర్వ సంకల్పాల సహితంగా, స్వయాన్ని బాప్ దాదాపై బలిహారం చేసుకోండి, అప్పుడిక మాయ ఎప్పుడూ దాడి చేయలేదు. రోజు అమృతవేళలో సాక్షీగా అయి, స్వయాన్ని సర్వశక్తులతో అలంకరించుకున్నట్లయితే, అచల్-అడోల్ గా (చలించకుండా-స్థిరంగా) ఉంటారు.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top