04 January 2022 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

January 3, 2022

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

‘‘మధురమైన పిల్లలూ - లోపాలను దానం చేసిన తర్వాత ఒకవేళ ఏదైనా తప్పు జరిగినట్లయితే చెప్పాలి, నాకు అన్నీ తెలుసు అని అనుకునేవారిగా అవ్వకూడదు, ఎప్పుడూ కూడా అలగకూడదు’’

ప్రశ్న: -

ఏ విషయాన్ని స్మృతిలో పెట్టుకొని అపారమైన సంతోషంలో ఉండాలి? ఏ విషయంలో ఎప్పుడూ దుఃఖపడకూడదు?

జవాబు:-

స్మృతిలో పెట్టుకోండి – మేము ఇప్పుడు రాజయోగాన్ని నేర్చుకుంటున్నాము, తర్వాత సూర్యవంశపు, చంద్రవంశపు రాజులుగా అవుతాము. చాలా సుందరమైన మహళ్ళను తయారుచేస్తాము. మేము మా సుఖధామానికి, శాంతిధామం ద్వారా వెళ్తాము. అక్కడ అన్నీ ఫస్ట్ క్లాస్ వస్తువులే ఉంటాయి. చాలా సుందరమైన, నిరోగి తనువు కూడా లభిస్తుంది. ఇక్కడ ఒకవేళ ఈ అంతిమ పాత శరీరానికి వ్యాధి మొదలైనవి వచ్చినట్లయితే దుఃఖపడకూడదు, మందులు వాడాలి.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

సభలో జ్యోతి వెలిగింది..

ఓంశాంతి. పాటనైతే పిల్లలు చాలాసార్లు విన్నారు. పిల్లలకు భిన్న-భిన్న రకాలుగా అర్థం వివరించడం జరుగుతుంది. ఎవరైతే పాటను తయారుచేసారో వారికైతే ఈ విషయాలు తెలియవు. మీరు ఇప్పుడు అనంతమైన తండ్రికి పిల్లలుగా అయ్యారు. మీరు అనంతమైన తండ్రికి పిల్లలు కూడా, మనవళ్ళు-మనవరాళ్ళు కూడా. మీరు నాకు పిల్లలు కూడా, మనవళ్ళు-మనవరాళ్ళు కూడా అని ఈ విధంగా ఏ తండ్రి కూడా చెప్పలేరు. ఇక్కడ ఇది అద్భుతము. ఆత్మలైన మనమందరం శివబాబాకు పిల్లలము మరియు సాకారంలో శివబాబా యొక్క కుమారుడు ఒక్క బ్రహ్మా. అందుకని మనం మనవళ్ళు-మనవరాళ్ళుగా అవుతాము. లెక్కలేనంతమంది పిల్లలున్నారు. పిల్లలందరూ ఒక్క తండ్రికి చెందినవారు. మీరిప్పుడు మనవళ్ళు-మనవరాళ్ళుగా అయ్యారు, వారసత్వం తీసుకోవడానికి. ఇంకెవ్వరూ వారసత్వాన్ని తీసుకోలేరు. ఒకవేళ అందరూ మనవళ్ళు-మనవరాళ్ళుగా అయినట్లయితే, అందరూ స్వర్గ వారసత్వాన్ని తీసుకోవాలి. కానీ ఆ విధంగా జరగదు. అందుకని కోటిలో ఏ ఒక్కరో మనవళ్ళు-మనవరాళ్ళుగా అవుతారు. బ్రహ్మానైతే తప్పకుండా దత్తత తీసుకోవలసి వస్తుంది అని ప్రజాపిత బ్రహ్మా కోసమైతే అర్థం చేయించడం జరుగుతుంది. ఒకటేమో దత్తత తీసుకోవడము, ఇదైతే ప్రవేశించే విషయము. పిల్లలంటారు, మేము మనవళ్ళు మరియు మనవరాళ్ళము కూడా. పిల్లలూ, మీ మధురమైన ఇంటిని స్మృతి చేయండి అన్న విషయాన్ని ఇంకెవ్వరూ చెప్పలేరు. ఇది ఎవరికి చెప్తారు? ఆత్మలకు. ఆత్మ ఈ కర్మేంద్రియాల ద్వారా వింటుంది. మేము ఆత్మలతో మాట్లాడుతున్నామని ఈ విధంగా ఎవ్వరూ చెప్పలేరు. ఆత్మ వింటుంది – తండ్రి అంటారు – పరమపిత పరమాత్మనైన నేనే ఈ బ్రహ్మా తనువులో ప్రవేశించి మీకు నేర్పిస్తాను లేదంటే ఎలా అర్థం చేయిస్తాను? నేను బ్రహ్మా యొక్క తనువులోకే రావాల్సి ఉంటుంది. పేరు కూడా బ్రహ్మా అనే పెట్టాలి, అప్పుడే బ్రహ్మాకుమార-కుమారీలు అని పిలవబడతారు. మీరు ఏ విధంగా బ్రహ్మాకు సంతానము, అని ఆ బ్రాహ్మణులను అడగండి. వారు మీకు చెప్పలేకపోతారు. మేము బ్రహ్మా యొక్క ముఖవంశావళి అని అంటారు. కానీ వాస్తవానికి కుఖ వంశావళి (గర్భం ద్వారా జన్మించినవారు). ముఖవంశావళిగా ఉండేవారము, ఇప్పుడు కుఖ వంశావళివారిగా అయ్యామని అంటారు. ఇప్పుడు బ్రహ్మాకు కుఖ వంశావళి ఉండడమైతే జరగదు. కనుక ఇవి చాలా అద్భుతమైన విషయాలు. తండ్రి ఎప్పుడూ తప్పుడు విషయాలను వినిపించరు. వారు సత్యమైనవారు. మనం సత్యంగా అవుతున్నాము. స్వయాన్ని అన్నీ తెలిసినవారిగా భావించకూడదు. ఈ దాదా కూడా అంటారు – పరిపూర్ణంగా అయ్యేంత వరకు ఏదో ఒకటి జరగవచ్చు. కానీ మీ పని అయితే శివబాబాతో, మనుష్యులైతే ఏ పొరపాట్లు అయినా చేయవచ్చు, ఇతరులతో మీకు గొడవలు జరగవచ్చు. కానీ తండ్రి నుండి అయితే వారసత్వాన్ని తీసుకోవాలి కదా. చాలా మంది పిల్లలు తండ్రిపై కూడా అలుగుతారు. ఒకవేళ ఎవరైనా సోదరుడు గానీ, సోదరీ గానీ ఏమైనా అన్నా, శివబాబా యొక్క మురళీనైతే వినండి. ఇంట్లో కూర్చొని ఉండండి కానీ తండ్రి యొక్క ఖజానానైతే తీసుకోండి. ఖజానా లేకుండా మీరు ఏం చేస్తారు! బ్రాహ్మణుల సాంగత్యంలోకి కూడా తప్పకుండా రావాలి. లేదంటే శూద్రుల సాంగత్యం యొక్క ప్రభావం పడుతుంది. మీకు దుర్గతి జరుగుతుంది. సత్సాంగత్యం తీరానికి చేరుస్తుంది, కుసాంగత్యం ముంచేస్తుంది. హంస వెళ్ళి కొంగలతో కలిసి ఉన్నట్లయితే, సర్వనాశనం అయిపోతుంది. నావికుడు అని ఒక్క తండ్రినే అంటారు. ఇకపోతే, ముంచేవారు అయితే చాలామంది ఉన్నారు. మనుష్యులెవ్వరూ తమను తాము నావికుడు లేక గురువు అని చెప్పుకోలేరు. ఈ నిస్సారమైన ప్రపంచం, విషయ సాగరం నుండి బయటకు తీసి మధురమైన ఇంటికి తీసుకువెళ్ళేవారు ఒక్క తండ్రి మాత్రమే. సుఖధామము శాంతిధామము మరియు దుఃఖధామము, ఈ మూడు ధామాలు ఉంటాయని తండ్రి అంటారు. మీరు ఈ దుఃఖధామం నుండి బయటపడి శాంతిధామానికి వెళ్ళా్లి. ఈ దుఃఖధామానికి అగ్ని అంటుకునేది ఉంది. ఇది దుఃఖం యొక్క ప్రపంచము. ఇందులో కుంభకర్ణుల వంటి భ్రష్టాచారీ మనుష్యులు ఉంటారు. పతిత-పావనుడైన తండ్రిని పిలుస్తారు. పతిత-పావని గంగను అయితే పిలిచేటటువంటి విషయమే లేదు. అదైతే అనాదిగా ఉంది. స్వర్గంలో కూడా ఉంటుంది కదా. ఒకవేళ ఈ గంగ పతిత-పావని అయినట్లయితే, ఇక అందరూ చాలా పావనంగా ఉండాలి. ఏమీ అర్థం చేసుకోరు.

ఇప్పుడు పిల్లలైన మీకు అర్థం చేయించారు. కనుక నంబరువారు పురుషార్థానుసారంగా అర్థం చేసుకున్నారు, ఎందుకంటే పిల్లలలో లోపాలున్నాయి, అశుద్ధ అహంకారం, కామ క్రోధాలు ప్రతి ఒక్కరిలోనూ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ – మాలో ఏ లోపముంది అని తమ హృదయాన్ని ప్రశ్నించుకోవాలి. తండ్రికి చెప్పాలి – బాబా, నాలో ఈ లోపముంది. లేదంటే ఆ లోపం వృద్ధి చెందుతుంది. ఇదేమీ శాపం ఇవ్వడం లేదు. కానీ ఇది ఒక ‘లా’ ఉంది – లోపాలను దానమిచ్చిన తర్వాత ఏదైనా తప్పు జరిగినట్లయితే చెప్పాలి. బాబా, మేము ఈ తప్పు చేసాము, ఫలానా వస్తువును దొంగలించాము. శివబాబా యొక్క భండారీలో అన్నీ లభిస్తాయి, అవినాశీ జ్ఞాన రత్నాలు కూడా లభిస్తాయి, అలాగే శరీర నిర్వహణ కోసం కూడా అన్నీ లభిస్తాయి. బుద్ధికి ఔషధం మరియు శరీరానికి ఔషధం అన్నీ లభిస్తాయి. ఇంకా ఏదైనా కావాలి అంటే అడగవచ్చు. ఒకవేళ అడగకుండా ఏదైనా తీసుకున్నట్లయితే, మిమ్మల్ని చూసి ఇతరులు కూడా అదే విధంగా చేస్తారు. అడిగి తీసుకోవడం సరైనది. ఎలా అయితే, పిల్లలు తండ్రిని ఏదైనా అడిగితే అది తండ్రి ఇచ్చేస్తారు. షావుకార్లు అయితే అన్నీ తెప్పిస్తారు, పేదవారు ఏం చేస్తారు. ఇదైతే శివబాబా యొక్క భండారా. ఏ వస్తువు కావలి అన్నా అడగవచ్చు. యోగ్యత అనుసారంగా అందరికీ లభించాల్సిందే. బాబా-మమ్మా మరియు అనన్యమైన పిల్లలతో పోటీ పడకూడదు. బాబా కూడా మహిమ చేస్తారు, ఫలానా పిల్లలు చాలా మంచి సేవ చేస్తారు. కావున పిల్లలైన మీరు కూడా వారి పట్ల గౌరవముంచాలి. మొత్తం ఆధారం అంతా జ్ఞాన-యోగాలపైనే ఉంది. తెలివైన పిల్లలు చాలా యుక్తిగా నడుచుకుంటారు. వారికి తెలుసు, వీరు నిజంగా మా కన్నా ఉన్నతమైనవారు అని. కనుక వారిని గౌరవంతో చూడాలి. స్త్రీలలో కూడా కొందరు చదువుకున్నవారు, చాలా తెలివైనవారిగా ఉంటారు, వారు మీరు, మీరు అని అంటూ మాట్లాడుతారు. కొంతమందైతే చదువుకోని వారుంటారు, నీవు-నీవు అని అంటూ మాట్లాడుతారు. ఈ మేనర్స్ (సభ్యత) ఉండాలి. తండ్రి ఎదురుగా అయితే వివిధ రకాల వారు వస్తారు. తండ్రి ఎవరినైనా కూడా అడుగుతారు – మీరు సంతృప్తిగా, సంతోషంగా ఉన్నారా? ఎవరైనా ఆఫీసర్ మొదలైనవారికి గౌరవాన్ని ఇవ్వవలసి ఉంటుంది. పోప్ వచ్చారు, వారికి కూడా ఇది చెప్పాలి – ఇది ముళ్ళ అడవి, మీరు దేనినైతే ప్యారడైజ్ (స్వర్గం) అని అంటారో అది పుష్పాల తోట, అక్కడైతే తప్పకుండా మంచి ఫరిశ్తాలు ఉండి ఉంటారు. ఇది ముళ్ళ అడవి. అడవిలో ముళ్ళు మరియు జంతువులే ఉంటాయి. ఈ బాబా అయితే ఎవరినైనా, ఏమైనా అనవచ్చు కానీ పిల్లలైతే అలా అనలేరు. ఇప్పుడు స్వర్గం స్థాపన అవుతుంది. ఇది ఇనుప యుగము. ఇప్పుడు అల్లా యొక్క పూలతోట స్థాపనవుతుంది. సత్యయుగమైతే అల్లా యొక్క పూలతోట, ఇదైతే ముళ్ళ అడవి. ఈ విషయాలు చాలా అర్థం చేసుకోవలసినవి. భాగ్యశాలురే మంచి రీతిగా అర్థం చేసుకోగలరు మరియు అర్థం చేయించగలరు. బాబా పిల్లలకు మంచి సలహానిస్తారు. కనుక 5 వికారాలపై విజయాన్ని పొందాలి. వీటితో వీడ్కోలు అయితే అంతిమంలో జరగనున్నది, అప్పటివరకు ఏవో ఒక లోపాలు ఉంటాయి. వాటిని తొలగించుకునేందుకు పురుషార్థం చేయాలి, దేహీ-అభిమానిగా అవ్వాలి. శాంతిధామాన్ని మరియు సుఖధామాన్ని స్మృతి చేయాలి, అప్పుడు సంతోషం ఉంటుంది. మేము శాంతిధామం ద్వారా సుఖధామంలోకి వెళ్తాము, అప్పటికి మొత్తం శుభ్రమైపోతుంది. తర్వాత స్వర్గంలో ప్రతి వస్తువు ఫస్ట్ క్లాస్ అయినది లభిస్తుంది. వజ్ర-వైఢూర్యాల మహళ్ళను వచ్చి తయారుచేసుకుంటాము, ఇది చేస్తాము. మీకు కూడా బుద్ధిలో ఉంటుంది – మేము ఆత్మలము. ఇక్కడకు వచ్చాము – మన రాజధానిని స్థాపన చేయడానికి. తర్వాత శివబాబాతో పాటు వెళ్ళిపోతాము. మేము రాజయోగాన్ని నేర్చుకుంటున్నాము, మళ్ళీ వెళ్ళి సూర్యవంశపు, చంద్రవంశపు రాజా-రాణులుగా అవుతాము. మహళ్ళనైతే తయారుచేయవలసి ఉంటుంది కదా. ఈ విషయాలు లోపల స్మృతి చేసుకుంటూ చాలా సంతోషంగా ఉండాలి. లోపాలైతే చాలా ఉన్నాయి. చాలామంది దేహాభిమానంలోకి వస్తారు. ఇది చివరి పాత వస్త్రం, కొత్త వస్త్రం సత్యయుగంలో లభిస్తుంది. తండ్రి కూర్చొని మధురాతి-మధురమైన పిల్లలకు అర్థం చేయిస్తారు. అర్ధకల్పం మీరు భక్తి చేసారు భగవంతుడిని కలవడానికి. భక్తి చేయడమే జరుగుతుంది, ఒక్క భగవంతుడిని కలవడం కోసమా లేక అనేకులను కలవడం కోసమా? భక్తి కూడా ఒక్కరిదే చేయాల్సి ఉంటుంది. తర్వాత వ్యభిచారీ భక్తి అయిపోతుంది. తర్వాత మీరు జన్మ-జన్మాంతరాలు గురువులను ఆశ్రయిస్తారు, పునర్జన్మ తీసుకున్నారంటే, తర్వాత వేరొక గురువును ఆశ్రయించాల్సి ఉంటుంది. ఇప్పుడు తండ్రి అంటారు – నేను మిమ్మల్ని స్వర్గంలోకి తీసుకువెళ్తాను. అక్కడ మీరు జన్మ-జన్మాంతరాలు గురువులను ఆశ్రయించే అవసరమే ఉండదు. అవ్యభిచారీ భక్తి తర్వాత వ్యభిచారీ భక్తిగా అవ్వాల్సిందే ఎందుకంటే ఇప్పుడు దిగే కళ ఉంది. కనుక తండ్రి అంటారు – పిల్లలూ, ఇప్పుడు ఇంటికి వెళ్ళా్లి. లిబరేటర్ (ముక్తిదాత), నావికుడు, తోట యజమాని అని నా కోసం పాడుతారు. స్వర్గం ఉన్నదే పుష్పాల తోట, తర్వాత నావికుడు వెళ్ళిపోతారు. అందరూ స్వర్గంలోకైతే వెళ్ళరు. మొట్టమొదట ఎవరైతే వస్తారో, వారి కోసం అల్లా పూదోట వలె ఉంటుంది, వారు చాలా సుఖాన్ని అనుభవిస్తారు. అల్లానే అందరికీ సుఖాన్ని ఇస్తారు. సత్యయుగం అల్లా యొక్క పూలతోటగా ఉండేదని ఎవరైనా అంటారు. భారత్ యే ప్రాచీన ఖండము. ఎప్పుడైతే సూర్య వంశీయులు, చంద్ర వంశీయులు రాజ్యం చేసేవారో, ఆ సమయంలో ఆత్మలందరూ మధురమైన ఇంట్లో ఉండేవారు. ముక్తిలోకి వెళ్ళాలి అని దానికోసమే భక్తి చేస్తారు. జీవన్ముక్తిని ఇచ్చే గురువు అయితే ఎవ్వరూ లేరు. శివబాబాయే ముక్తి మరియు జీవన్ముక్తుల మార్గాన్ని చెప్తారు. ఇప్పుడిది దుఃఖధామము. ప్రపంచానికి నిప్పు అంటుకోనున్నది. లక్షల సంవత్సరాల కల్పముండదు. లక్షల సంవత్సరాలని భావిస్తూ, కుంభకర్ణుణి నిద్రలో నిద్రించి ఉన్నారు. ఇప్పుడు ఈశ్వరుడు వచ్చి మేలుకొల్పారు, మీరు మళ్ళీ ఇతరులను కూడా మేలుకొల్పాలి. సేవ లేకుండా ఉన్నత పదవి లభించదు. పూర్తి వారసత్వం పొందడం లేదని బాబాకు పిల్లలపైన దయ కలుగుతుంది. తండ్రి అయితే అందరితో పూర్తి పురుషార్థాన్ని చేయిస్తారు. మీరు ఎందుకు బాబా యొక్క విజయమాలలో జోడింపబడకూడదు? ఎవరికైనా అర్థం చేయించడం చాలా సహజము. బ్రహ్మా ద్వారా స్థాపన, శంకరుని ద్వారా దుఃఖధామం యొక్క వినాశనము. ఇప్పుడు సుఖధామం కోసం పురుషార్థం చేయాలి. కానీ సుఖధామం గురించి ఎవ్వరికీ తెలియదు. ఒకవేళ తెలిసినట్లయితే అక్కడకు చేరుకుంటారు. ఎవరికైనా తెలియకపోతే చేరుకోలేరు కూడా. రెక్కలు తెగిపోయి ఉన్నాయి. పిల్లలైన మీరు కాలుడి పైన విజయాన్ని పొందుతారు. కాలుడికే కాలుడైన తండ్రే వచ్చి కాలుడిపై విజయం పొందేలా చేస్తారు. కావున ఇవన్నీ ధారణ చేసి పతితులు పావనంగా అవ్వాలి. కేవలం ప్రభావితులై వెళ్తారు, దాని వలన లాభమేముంది? ఎప్పుడైతే 7 రోజుల కోర్సు చేస్తారో, అప్పుడు పూర్తి రంగు అంటుకుంటుంది. కొంతమంది పిల్లలు నడుస్తూ-నడుస్తూ బ్రాహ్మణి పై కూడా అలిగిన కారణంగా మళ్ళీ శివబాబాతో కూడా అలుగుతారు. భగవంతుని పై అలగడం – ఇదేమైనా తెలివైన పనా? ఇతరులతో అలిగితే అలగనివ్వండి, నాతో అలిగితే నిర్జీవులుగా అయిపోతారు. శివబాబాతో అయితే అలగకండి. ఖజానాలు తీసుకుంటూ ఉండండి. ధనమిచ్చినా ధనం తరగదు… సాంగత్యం కూడా కావాలి. బ్రాహ్మణ కులంలోనైతే చాలా క్షీరఖండం వలె ఉండాలి. కుటిలత్వం కలిగినవారు (పరచింతన చేసేవారు) కూడా ఉంటారు. వారి నుండి చాలా సంభాళించుకోవాలి.

తండ్రి అర్థం చేయిస్తారు – పిల్లలకు సేవ పట్ల చాలా అభిరుచి ఉండాలి. మునిగిపోయిన వారిని బయటకు తీయాలి. దీనిలో కూడా దానం ఇంటి నుండే మొదలవుతుంది. తండ్రి కూడా మొట్టమొదట బ్రహ్మా బిడ్డను ఉన్నతిలోకి తీసుకొచ్చారు. మీరు మళ్ళీ మీ పిల్లలను ఉన్నతిలోకి తీసుకురండి. ప్రాణ దానం చేయండి. చదువునైతే అంతిమం వరకు చదువుకోవాలి. తండ్రి ఎంత మంచి-మంచి పాయింట్లను ఇస్తారు! జీవిస్తూ మరణించి వారసత్వాన్ని పొందాలి. బాబా, మేము మీకు చెందినవారము, మీకు చెందినవారిగానే ఉండేవారిమి, మళ్ళీ మీకు చెందినవారిగానే అయ్యాము. మీ నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకునే విడిచిపెడతాము. ఈ దుఃఖధామం వంటి ప్రపంచానికి నిప్పు అంటుకునేది ఉంది. మనం సుఖధామంలోకి వెళ్తున్నాము, అంటే ఎంత సంతోషముండాలి. అచ్ఛా.

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్, ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఎవరైతే జ్ఞాన-యోగాలలో చురుకుగా ఉంటారో, మంచి సేవ చేస్తారో, వారికి చాలా-చాలా గౌరవమివ్వాలి. మీరు-మీరు అని అంటూ మాట్లాడాలి. పరస్పరంలో కూడా ఎప్పుడూ అలగకూడదు.

2. బ్రాహ్మణ కులంలో చాలా-చాలా క్షీరఖండంగా అయి ఉండాలి. కుటిలత్వం, పరచింతన నుండి తమను తాము సంభాళించుకోవాలి. సత్సాంగత్యం తప్పకుండా చేయాలి.

వరదానము:-

ఇప్పుడు ఎక్కే కళ యొక్క సమయం సమాప్తమయ్యింది, ఇప్పుడు ఎగిరే కళ యొక్క సమయము. ఎగిరే కళకు గుర్తు – డబల్ లైట్. ఏ కొంచెమైనా బరువు ఉన్నట్లయితే, కిందకు తీసుకొస్తుంది. తమ సంస్కారాల బరువు కావచ్చు, వాయుమండలానిది కావచ్చు, ఏదైనా ఆత్మ యొక్క సంబంధ-సంపర్కానిది కావచ్చు, ఏదైనా బరువు అలజడిలోకి తీసుకొస్తుంది. అందుకని ఎక్కడా కూడా మోహం ఉండకూడదు. కొంచెం కూడా ఏ ఆకర్షణ ఆకర్షితం చేయకూడదు. ఎప్పుడైతే ఆ విధంగా ఆకర్షణా ముక్తులుగా, డబల్ లైట్ గా అవుతారో, అప్పుడు సంపూర్ణంగా అవ్వగలరు.

స్లోగన్:-

వలీన స్థితిని అనుభవం చేయండి

తండ్రి ప్రేమలో ఏ విధంగా ఇమిడిపోండి అంటే నేను, నాది అనేది సమాప్తమైపోవాలి. జ్ఞానం ఆధారంతో తండ్రి స్మృతిలో ఇమిడిపోయి ఉన్నట్లయితే. ఈ ఇమిడి పోవడమే లవ లీన స్థితి. ఎప్పుడైతే ప్రేమ లో లీనమైపోతారో, అనగా తపనలో మగ్నమైపోతారో, అప్పుడు తండ్రి సమానంగా అయిపోతారు.

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top