04 April 2022 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

April 3, 2022

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

‘‘మధురమైన పిల్లలూ - మీరు కర్మయోగులు, మీరు నడుస్తూ-తిరుగుతూ స్మృతి యొక్క అభ్యాసాన్ని చేయాలి, ఒక్క తండ్రి స్మరణలో ఉంటూ నరుని నుండి నారాయణునిగా అయ్యే పురుషార్థం చేయండి’’

ప్రశ్న: -

నిశ్చయబుద్ధి పిల్లల ముఖ్యమైన గుర్తులేమిటి?

జవాబు:-

వారికి తండ్రి పట్ల పూర్తి-పూర్తి ప్రేమ ఉంటుంది. తండ్రి యొక్క ప్రతి ఆజ్ఞను పూర్తి-పూర్తిగా పాలన చేస్తారు. వారి బుద్ధి బయట భ్రమించలేదు. వారు రాత్రివేళ మేల్కొని కూడా తండ్రిని స్మృతి చేస్తారు. స్మృతిలో ఉంటూ భోజనం తయారుచేస్తారు.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

నీవు నిదురించి రాత్రిని పోగొట్టుకున్నావు… (తూనే రాత్ గవాయీ సోకే…)

ఓంశాంతి. బాబా ఇక్కడి నివాసి అయితే కాదు అని మొదట పిల్లలైన మీకు నిశ్చయముండాలి. పరంధామం నుండి ఇక్కడకు వచ్చి మనల్ని చదివిస్తారు. ఏమి చదివిస్తారు? ఉన్నతోన్నతమైన తండ్రి, మనుష్యుల నుండి దేవతలుగా అయ్యే ఉన్నతోన్నతమైన చదువును చదివిస్తారు. ఈ చదువు ప్రసిద్ధమైనది, దీని ద్వారా అసురుల నుండి దేవతలుగా అనగా కోతుల నుండి మందిర యోగ్యులుగా అవుతారు. ఈ సమయంలో మనుష్యుల ముఖము మనుష్యుల వలె ఉంది కానీ వారిలోని వికారాలు కోతి కన్నా కూడా ఎక్కువగా ఉన్నాయి. కోతుల కన్నా మనుష్యులలో చాలా శక్తి ఉంది, వారు నేర్చుకుని శక్తిని పొందుతారు. ఇక్కడ కూడా కొందరైతే తండ్రి నుండి నేర్చుకుని స్వర్గ రాజధానిని స్థాపన చేస్తారు, మరికొందరు సైన్సు నేర్చుకుని నరకం యొక్క వినాశనాన్ని చేస్తారు. తప్పకుండా స్థాపన మరియు వినాశన కార్యాలు ఇప్పుడు నడుస్తున్నాయి. ఎప్పుడూ పాత వస్తువు యొక్క వినాశనం జరుగుతుంది. వారంతా రావణుడికి సలామ్ చేస్తారు. రామునికి సలామ్ చేసేది కేవలం మీరు మాత్రమే. పిల్లలైన మీకు రాముడు మరియు రావణుడు, ఇరువురి గురించి తెలుసు. వ్యాసుడు గీతను వినిపించారని మనుష్యులు అంటారు. అందులో, భగవానువాచ అన్న పదం ఏదైతే రాసి ఉందో, అది సత్యము. కానీ భగవంతుని పేరును మార్చి అసత్యం చేసేసారు. బాబా ఎంతగానో అర్థం చేయిస్తారు – ప్రదర్శనీలో కేవలం ఒక్క విషయాన్ని అర్థం చేసుకోవాలి, గీతా భగవంతుడు నిరాకార శివుడు, అంతేకానీ మనిషి కాదు. ఇది కూడా ఎవరూ అర్థం చేసుకోరు. ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. కేవలం సన్యాసులు మాత్రమే తమను తాము దుఃఖితులుగా భావించరు. వాస్తవానికి వారు కూడా తప్పకుండా దుఃఖితులుగానే ఉన్నారు కానీ మేము దుఃఖితులుగా లేము అని అంటారు లేక ఇలా అంటారు – శరీరం దుఃఖమయంగా అవుతుంది, ఆత్మ ఏమైనా దుఃఖమయంగా అవుతుందా, ఆత్మనే పరమాత్మ, అదెలా దుఃఖమయంగా అవుతుంది! ఇది తప్పుడు జ్ఞానము. ఇప్పుడు ఉన్నదే అసత్య ఖండము. భారత్ స్వర్గంగా ఉన్నప్పుడు సత్యఖండంగా ఉండేది. తండ్రి అర్థం చేయిస్తారు, డ్రామానుసారంగా రోజురోజుకు దుఃఖం పెరుగుతూనే ఉంటుంది. ఎన్ని యజ్ఞాలు, దాన-పుణ్యాలు మొదలైనవి చేసినా కానీ పరిణామమేమి వెలువడింది! కిందికే పడిపోతూ వచ్చారు. ఈ సమయంలో 100 శాతం భ్రష్టాచారులుగా, నరకవాసులుగా అయ్యారు, అందుకే తండ్రి రావడమే ఎలాంటి సమయంలో వస్తారంటే, అందరూ దుఃఖంలో ఉన్నప్పుడు మరియు పాత్రధారులందరూ వచ్చి ఉన్నప్పుడు వస్తారు. మరికొందరు వస్తూ కూడా ఉంటారు. మెజారిటీ వచ్చి ఉన్నారు, ఇప్పుడైతే చాలామంది దుఃఖితులుగా అవుతారు. వారు భగవంతుడిని స్మృతి చేస్తారు. మిమ్మల్ని అయితే భగవంతుడే స్వయంగా చదివిస్తారు. కావున ఎంత మంచి రీతిలో చదువుకోవాలి. తండ్రి, టీచరు, సద్గురువు, ముగ్గురూ కలిపి లభించారు, ఇప్పుడు ఇక ఎవరి వద్దకు వెళ్ళాలి? తండ్రి అంటారు, గృహస్థ వ్యవహారంలో ఉండండి, కానీ నిరాకార పరమాత్మనైన నా మతంపై నడుచుకున్నట్లయితే మీరు శ్రేష్ఠంగా అవ్వగలరు, ఇతర ఏ గురువులు-పండితుల మతంపై నడవకండి. పరమపిత పరమాత్మతో మీకున్న సంబంధమేమిటి? అని మీరు అడుగుతారు. ఒకవేళ వారు గాడ్ ఫాదర్ అయితే తప్పకుండా తండ్రి నుండి కొత్త ప్రపంచం యొక్క వారసత్వం లభించాలి. తండ్రి అనగా రచయిత అని, స్వర్గం యొక్క రచనను రచించేవారని ఎవరి బుద్ధిలోకీ రాదు. కానీ వీరు నిరాకారుడు. ఆత్మ కూడా నిరాకారీ. ఇది మనుష్యులకు తెలియనే తెలియదు. ఆత్మ రూపమేమిటి? పరమాత్మ రూపమేమిటి? ఆత్మ అవినాశీ, పరమాత్మ కూడా అవినాశీ. ప్రతి ఆత్మలో అవినాశీ పాత్ర నిండి ఉంది. ఈ విషయాలను విన్నప్పుడు మనుష్యుల బుద్ధి తిరుగుతుంది. కల్పక్రితం ఎవరైతే వారసత్వాన్ని తీసుకున్నారో, వారే పురుషార్థం అనుసారంగా అన్ని విషయాలను అర్థం చేసుకుంటారు. ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో పక్కా నిశ్చయముంది మరియు తండ్రి పట్ల ప్రేమ కూడా ఉంది. శివబాబా ఆజ్ఞను ఇస్తారు, తింటూ-తాగుతూ నన్ను స్మృతి చేయండి. స్మృతితో వికర్మలు వినాశనమవుతాయి మరియు ఉన్నత పదవిని కూడా పొందుతారు. ఏ విధంగానైతే భక్తి మార్గంలో జరుగుతుందో, అలా కొందరు ఇక్కడ కూర్చుని ఉన్నా కానీ బుద్ధి బయట భ్రమిస్తూ ఉంది. ఇది మాయా రాజ్యం కదా. బుద్ధి బయటకు వెళ్ళిపోతే ధారణ జరగదు. కష్టం మీద ఎవరో మాత్రమే తండ్రి ఆజ్ఞపై నడచుకుంటారు. తండ్రి అంటారు, తలపై పాపాల భారం చాలా ఉంది, అందుకే రాత్రివేళ మేల్కొని నన్ను స్మృతి చేయండి, అప్పుడు మీకు చాలా సహాయం లభిస్తుంది. నడుస్తూ-తిరుగుతూ కూడా స్మృతి యొక్క అభ్యాసాన్ని చేయండి. స్మృతిలో ఉంటూ భోజనం తయారుచేయండి, ఇందులో చాలా శ్రమ ఉంది. పదే-పదే మర్చిపోతారు. పిల్లలు చాలా మంచి రీతిలో అభ్యాసం చేయాలి. 24 గంటలలో 16 గంటలైతే మీరు ఫ్రీగా ఉంటారు కావున 8 గంటలైతే యోగంలో తప్పకుండా ఉండాలి. మీరు కర్మయోగులు. బాబా అంటారు, అన్నీ చేస్తూ నా స్మరణలో ఉండండి. నరుని నుండి నారాయణునిగా అయ్యే పురుషార్థం చేసినట్లయితే ఇంట్లో కూర్చుని ఉంటూ కూడా గొప్ప సంపాదన చేసుకోవచ్చు. గొప్ప-గొప్ప వ్యక్తులు కూడా వస్తారు, కానీ టూ లేట్ అయిపోతుంది. మీలో కూడా చాలామంది, మేము లక్ష్మిని లేక నారాయణుడిని వరిస్తాము అని అంటారు, కానీ పదే-పదే మర్చిపోతారు. చాలామంది ఏమంటారంటే, శివబాబా వీరిలోకి వస్తారు అన్న విషయమైతే మా బుద్ధిలో కూర్చోదు కానీ ఏదో శక్తి ఉంది, ఆకర్షణ ఉంది అని అంటారు. పిల్లలు తండ్రిని అర్థం చేసుకోరు ఎందుకంటే తండ్రి వస్తారు అనేటువంటి విషయాలు శాస్త్రాలలో లేవు. గీత అన్నింటికన్నా ఉన్నతమైన శాస్త్రము కానీ అందులో కూడా మనిషి పేరు వేసారు, మరి ఉన్నతోన్నతమైన భగవంతుని పేరు ఆ తర్వాత ఉన్న శాస్త్రాల్లోకి ఎలా వస్తుంది. తండ్రి అంటారు, ఎంత పొరపాటు చేసేసారు. నేనే ఈ రుద్ర జ్ఞాన యజ్ఞాన్ని రచించాను. కృష్ణుడినైతే శ్యామ-సుందరుడని అంటారు. రాధే-కృష్ణులే లక్ష్మీ-నారాయణులుగా అవుతారు. వారే పూర్తి 84 జన్మలను తీసుకుంటారు. 84 లక్షల జన్మలు అన్నా కూడా మొదట స్వర్గంలోకి వచ్చేవారైతే లక్ష్మీ-నారాయణులే. తండ్రి అర్థం చేయిస్తారు, దేవీ-దేవతా ధర్మానికి చెందిన మీరు 84 జన్మలు తీసుకున్నారు. మీరే నంబరువన్ గా ఉండేవారు. మీ రాజధానియే ఇప్పుడు స్థాపనవుతూ ఉంది. లక్ష్మీ-నారాయణులు మీ తల్లిదండ్రులే. ఇప్పుడు మీ రాజధాని తయారవుతూ ఉంది. మీరిప్పుడు సంపూర్ణంగా అవ్వలేదు కానీ తప్పకుండా అవ్వాలి, అప్పుడే సూక్ష్మవతనంలో సాక్షాత్కారం జరుగుతుంది. మీరు స్వయాన్ని సంపూర్ణ ఫరిశ్తాగా భావిస్తారు. ఫరిశ్తాగా అయిన తర్వాత లక్ష్మీ-నారాయణులుగా అవుతారు, వారి సాక్షాత్కారం కూడా జరుగుతుంది. తతత్వమ్, మీరు కూడా ఆ విధంగా తయారవుతున్నారు. ఎంత మంచి రీతిలో అర్థం చేయించడం జరుగుతుంది. ఈ రోజుల్లో స్కూళ్ళలో కూడా గీతను చదివిస్తారు, ఎవరైతే చదువుకుని తెలివైనవారిగా అవుతారో, వారు మళ్ళీ ఇతరులను చదివిస్తారు, అప్పుడు పండితులుగా అవుతారు, వినేవారిలో చాలామంది శిష్యులుగా అవుతారు. మధురమైన మాటతీరు ఉంటుంది, మంచి రీతిలో శ్లోకాలు మొదలైనవి కంఠస్థం చేస్తారు. కానీ ఏమీ లభించదు. తమోప్రధానంగా అయిపోయారు. బాబానే వచ్చి సతోప్రధానంగా తయారుచేస్తారు, అది కూడా నంబరువారు పురుషార్థం అనుసారంగానే తయారవుతారు. ఆత్మలలో అందరూ అయితే శక్తివంతులుగా అవ్వలేరు. తండ్రిని సర్వశక్తివంతుడని అంటారు. లక్ష్మీ-నారాయణులను అలా అనరు. శక్తి యొక్క ప్రస్తావన ఇప్పుడు ఉంటుంది. ఇప్పుడు మీరు రాజ్యం తీసుకుంటున్నారు. ఇప్పుడు మీకు వరుడు లభిస్తున్నారు. తండ్రి అంటారు, అమర భవ, జీవిస్తూ ఉండండి. సత్యయుగంలో మిమ్మల్ని కాలుడు కబళించడు. అక్కడ మృత్యువు అన్న పదమే ఉండదు. అక్కడ, ఫలానావారు మరణించారని అనరు, మేము పాత, వృద్ధ శరీరాన్ని వదిలి కొత్తది తీసుకుంటామని మీరంటారు. మహాకాలుడి మందిరం కూడా ఉంది. అందులో కేవలం శివలింగాన్ని పెట్టి జెండాలు మొదలైనవి పెట్టారు. బంగారం అంటుకుని ఉన్నటువంటి ఈ విధమైన రాళ్ళు చాలా ఉంటాయి. తర్వాత ఆ రాళ్ళను అరగదీసి తయారుచేస్తారు. నేపాల్ లో నదీతీరంలో ఉన్న ఇసుకలోకి బంగారం కొట్టుకుంటూ వచ్చేది. సత్యయుగంలో మీకు చాలా బంగారు లభిస్తుంది. ఇప్పుడైతే బంగారం లేనే లేదు, మొత్తం సమాప్తమైపోయింది. గనులన్నీ ఖాళీ అయిపోయాయి. స్వర్గంలో బంగారు మహళ్ళు తయారవుతాయి. మళ్ళీ మనం మన స్వర్గాన్ని స్థాపన చేసుకుంటున్నాము. చాలా మంది పిల్లలు ఏమని రాస్తారంటే, బాబా, మేము మీకు చెందినవారిగా అయిపోయాము. కానీ వారు బాబాను ఎప్పుడూ చూడలేదు కూడా. ఇప్పుడు మీరు అమరలోకం కోసం శివబాబా నుండి అమరకథను వింటున్నారు. నిశ్చయంతోనే విజయం లభిస్తుంది. నిశ్చయం కూడా పక్కాగా ఉండాలి. అచ్ఛా.

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. నిశ్చయబుద్ధి కలవారిగా అయి ఒక్క తండ్రి పట్ల పూర్తి-పూర్తి ప్రేమను ఉంచుకోవాలి. తండ్రి ఆజ్ఞపై నడుచుకుని మాయపై విజయం పొందాలి.

2. శరీర నిర్వహణార్థం కర్మలు చేస్తూ కర్మయోగిగా అవ్వాలి. స్మృతి చార్టును 8 గంటల వరకు తప్పకుండా తీసుకురావాలి.

వరదానము:-

మొత్తం రోజంతటిలో ఏవైతే వ్యర్థ సంకల్పాలు, వ్యర్థ మాటలు, వ్యర్థ కర్మలు మరియు వ్యర్థ సంబంధ-సంపర్కాలు ఉంటాయో, ఆ వ్యర్థాన్ని సమర్థతలోకి పరివర్తన చేయండి. వ్యర్థాన్ని తమ బుద్ధిలోకి స్వీకరించవద్దు. ఒకవేళ ఒక్క వ్యర్థాన్ని అయినా స్వీకరించినట్లయితే, అది అనేక వ్యర్థాలను అనుభవం చేయిస్తుంది, దీనినే ఫీలింగ్ వచ్చింది అని అంటారు. అందుకే హోలీహంసలుగా అయి వ్యర్థాన్ని సమర్థతలోకి పరివర్తన చేసినట్లయితే ఫీలింగ్ ప్రూఫ్ గా అవుతారు. ఎవరైనా నిందించినా, కోప్పడినా, మీరు వారికి శాంతి యొక్క శీతల జలాన్ని ఇవ్వండి, ఇది హోలీహంసల కర్తవ్యము.

స్లోగన్:-

మాతేశ్వరి గారి అమూల్యమైన మహావాక్యాలు

1) పరమాత్మను త్రిమూర్తి అని ఎందుకు అంటారు?

పరమాత్మను త్రిమూర్తి అని ఎందుకు అంటారు? వారు ఏ మూడు రూపాలను రచించారు? తప్పకుండా వారు మూడు రూపాలైన బ్రహ్మా, విష్ణు, శంకరులను రచించారు. వారు స్వయంగా ఎప్పుడైతే వస్తారో, అప్పుడు మూడు రూపాలనూ తమతో పాటు తీసుకొస్తారు. అలాగని వారు ఈ మూడు రూపాలను వేర్వేరుగా రచించారని కాదు, కలిపే రచించారు, అంతేకానీ ముందు-వెనుక రచించలేదు. కావున పరమాత్మనే అంటారు, ఈ రచన నాది ఎందుకంటే నేను సాకారీ, ఆకారీ మరియు నిరాకారీ, మూడు ప్రపంచాలకు యజమానిని. నేను సాకారీ లక్ష్మి-నారాయణుల దేవతా రూపంలో లేను, వారు దైవీ గుణాలు కలిగిన సాకారీ మనుష్యులు. అలాగే నేను అవ్యక్త దేవతలైన బ్రహ్మా, విష్ణు, శంకరులను కూడా కాను. అయితే, ఈ ఆకారీ దేవతలు పునర్జన్మల్లోకి రారు, కానీ నేను అది కూడా కాను, ఇదంతా నా డిపార్టుమెంట్. నేను స్వయంగా వచ్చినప్పుడు మొత్తం డిపార్టుమెంట్ ను నాతో పాటు తీసుకొస్తాను మరియు వారి ద్వారానే దైవీ సృష్టి యొక్క స్థాపనను, ఆసురీ ప్రపంచం యొక్క వినాశనాన్ని మరియు కొత్త సృష్టి యొక్క పాలనను చేయించేందుకు వస్తాను. పైనుండి డైరెక్టుగా పవిత్రాత్మనైన నేను వస్తాను మరియు నేను ఏ మనిషి తనువులోకైతే వస్తానో, వారు అనేక జన్మల అంతిమంలో తమోగుణం కలవారిగా ఉన్నారు, వారి తనువులోకి ప్రవేశించి వారిని కూడా పవిత్రంగా తయారుచేస్తాను. వారి భవిష్య జన్మ సర్వగుణ సంపన్నుడు, 16 కళల సంపూర్ణుడైన శ్రీ కృష్ణుడిది. ఎందుకంటే పరమాత్మ అయితే సర్వగుణాల సాగరుడు, వికర్మాజీత్, వారి తర్వాత రెండవ నంబరు శ్రీ కృష్ణుడు, మళ్ళీ వారి అంతిమ జన్మనే బ్రహ్మా తనువు. పరమాత్మ వలె పవిత్రాత్మలుగా ఇతరులెవ్వరూ లేరు, ఇతరులను పవిత్రంగా చేయాల్సి ఉంటుంది, అందుకే పరమాత్మనే సుప్రీమ్ సోల్ అని అంటారు.

2. పాడైపోయిన భాగ్యాన్ని బాగు చేసేవారు పరమాత్మ

భాగ్యాన్ని తయారుచేసేవారు ఆ ఒక్క పరమాత్మనేనని ఇప్పుడు మనుష్యులందరికైతే తెలుసు. పరమాత్మను భాగ్యానికి యజమాని అని అంటారు, వారు వచ్చి ఆత్మలైన మన భాగ్యాన్ని తయారుచేస్తారు. పాడైపోయిన భాగ్యమేదైతే ఉందో, దానిని కొత్తగా చేసేవారు పరమాత్మనే. ఇకపోతే, భాగ్యాన్ని తయారుచేయడం లేక పాడుచేయడం అనేది పరమాత్మ చేతుల్లో ఉంది అని మనుష్యులేదైతే అంటారో, అలా అనడం పూర్తిగా తప్పు. భాగ్యాన్ని తయారుచేయడం పరమాత్మ చేతుల్లో ఉంది కానీ ఎప్పుడైతే మనుష్యులు ఆ భాగ్యాన్ని తయారుచేసేవారిని మర్చిపోతారో, అప్పుడు వారి భాగ్యం పాడైపోతుంది అనగా భాగ్యాన్ని పాడుచేసుకోవడం మనుష్యుల చేతుల్లో ఉంది. ఎప్పుడైతే మనుష్యులు తమను తాము మర్చిపోతారో, తమ తండ్రిని మర్చిపోతారో, అప్పుడు మనుష్యుల ద్వారా తప్పుడు కర్మలు జరిగిన కారణంగా, వారు తమ భాగ్యానికి అడ్డుగీత గీసుకుంటారు. కావున భాగ్యాన్ని పాడుచేసుకునేవారు మనుష్యులు మరియు తయారుచేసేవారు పరమాత్మ. అందుకే పరమాత్మను సుఖదాత అని అంటారు, దుఃఖదాత అని అనరు. చూడండి, ఎప్పుడైతే పరమాత్మ స్వయంగా ఈ సృష్టిపై అవతరిస్తారో, అప్పుడు మనుష్యులందరి పాడైపోయిన భాగ్యాన్ని తయారుచేస్తారు అనగా అందరికీ సద్గతినిస్తారు, అందుకే పరమాత్మను మనుష్యాత్మలందరినీ ఉద్ధరించేవారు అని అంటారు. పరమాత్మ అంటారు – పిల్లలూ, నేను ఈ సంగమయుగంలో వచ్చి అందరి భాగ్యాన్ని తయారుచేస్తాను. అయితే, కొందరి భాగ్యం తయారవుతుంది మరియు కొందరిది తయారవ్వదు అని కాదు. పరమాత్మ అయితే అందరి భాగ్యాన్ని తయారుచేస్తారు ఎందుకంటే మనుష్యులందరికీ పూర్తి సృష్టితో సంబంధముంది. అందుకే పరమాత్మ గురించి ఏమంటారంటే – భాగ్యాన్ని తయారుచేసేవారా, కాస్త మా ఎదురుగా రండి… కనుక పరమాత్మ భాగ్యాన్ని తయారుచేసేవారు అన్నదానికి ఇదే ఋజువు. అచ్ఛా – ఓంశాంతి.

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top