03 July 2021 TELUGU Murli Today | Brahma Kumaris
Read and Listen today’s Gyan Murli in Telugu
2 July 2021
Morning Murli. Om Shanti. Madhuban.
Brahma Kumaris
నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.
“మధురమైన పిల్లలూ - ఇప్పుడు మీరు కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి, ఈ దుఃఖపు రోజులు పూర్తి అవుతున్నాయి, అందుకే గడిచిపోయిన పాత విషయాలను మర్చిపోండి”
ప్రశ్న: -
కర్మయోగి పిల్లలైన మీరు నిరంతరం ఏ అభ్యాసాన్ని చేయాలి?
జవాబు:-
ఇప్పుడిప్పుడే శరీర నిర్వహణార్థము దేహంలోకి రావాలి మరియు ఇప్పుడిప్పుడే దేహీ-అభిమానులుగా అవ్వాలి. దేహం స్మృతి లేకుండా కర్మలు జరగవు. అందుకే, కర్మ చేసేటప్పుడు దేహం యొక్క స్మృతిలో ఉండండి, మళ్ళీ దేహీ-అభిమానులుగా అయిపోండి – ఈ అభ్యాసం చేయాలి. ఇటువంటి అభ్యాసాన్ని పిల్లలైన మీరు తప్ప ప్రపంచంలో ఇంకెవరూ చేయలేరు.
♫ వినండి ఆడియో (audio)➤
గీతము:-
మేలుకోండి, ప్రేయసులారా, మేలుకోండి….. (జాగ్ సజనియా జాగ్…..)
ఓంశాంతి. మధురాతి-మధురమైన ఆత్మలు లేక పిల్లలు ఈ పాటను విన్నారని ఆత్మిక తండ్రి అంటారు. దీనిని జ్ఞాన యుక్తమైన పాట అని అంటారు. ఈ పాట అయితే చాలా బాగుంది. ఆత్మలైన మీరిప్పుడు మేల్కున్నారు. డ్రామా రహస్యాన్ని కూడా ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. భక్తి మార్గం యొక్క షో చూసారు కదా – గతించినదంతా మీ బుద్ధిలో ఉంది. మీకు గతించిన మీ 84 జన్మల చరిత్ర గురించి తెలుసు. తండ్రి 84 జన్మల కథను వినిపించారు. ఇవి కొత్త ప్రపంచం కోసం కొత్త విషయాలు. తండ్రి ద్వారా మీరు కొత్త విషయాలను వింటారు. తండ్రి పిల్లలకు ఓర్పునిస్తారు. పిల్లలూ, ఇప్పుడు కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి కనుక పాత విషయాలను మర్చిపోండి. భక్తి మార్గపు సామాగ్రి అయిన ఈ వేద శాస్త్రాలన్నీ సమాప్తమవ్వనున్నాయి. అక్కడ భక్తి మార్గపు గుర్తులు కూడా ఉండవు. అక్కడ భక్తికి ఫలం లభిస్తుంది. తండ్రి వచ్చి భక్తులకు ఫలాన్నిస్తారు. తండ్రి వచ్చి భక్తి ఫలాన్ని ఎలా ఇస్తారు అనేది పిల్లలు తెలుసుకున్నారు. ఎవరైతే అందరికన్నా ఎక్కువ భక్తి చేసారో, వారికి తప్పకుండా ఎక్కువ ఫలం లభిస్తుంది. జ్ఞానం యొక్క పురుషార్థాన్ని కూడా వారే ఎక్కువగా చేస్తారు. ఆత్మలైన మనము ఎక్కువ భక్తి చేసామని మీకు తెలుసు. జ్ఞానంలో కూడా తప్పకుండా వారే చురుకుగా ముందుకు వెళ్తారు, అప్పుడే ఈ లక్ష్మీనారాయణుల వలె ఉన్నత పదవిని పొందుతారు. ఇప్పుడు మీరు జ్ఞాన-యోగాల కోసం పురుషార్థం చేస్తున్నారు. దేహీ-అభిమానులుగా అయి ఉండాలి, మళ్ళీ దేహధారులుగా కూడా అవ్వాలి. కర్మలు చేస్తూ తండ్రిని స్మృతి చేయాలి. దేహం లేకుండా మనం కర్మలు చేయలేము. బాబాను స్మృతి చేయాలి అన్నది అయితే కరక్టే కానీ స్వయాన్ని ఆత్మగా భావిస్తూ దేహాన్ని మర్చిపోతే పని అవ్వదు, కర్మలైతే చేయాల్సిందే. తండ్రి స్మృతిలో చాలా మజా ఉంటుంది. లేస్తూ-కూర్చుంటూ, నడుస్తూ-తిరుగుతూ తండ్రిని స్మృతి చేయండి కానీ కడుపుకు భోజనం అయితే కావాలి కదా. దేహీ-అభిమానులుగా అయి ఉండాలి. ఈ సమయంలో పిల్లలైన మీరు తప్ప ఎవరూ దేహీ-అభిమానులుగా లేరు. ఒకవేళ స్వయాన్ని ఆత్మగా భావించినా పరమాత్మ పరిచయం లేదు. నేను ఆత్మను అవినాశి, ఈ శరీరం వినాశి అని అర్థం చేసుకుంటారు కానీ ఇది అర్థం చేసుకున్నంత మాత్రాన వికర్మలు వినాశనమవ్వవు. పుణ్యాత్మ, పతితాత్మ అని అంటారు కూడా. నేను ఆత్మను, ఇది నా శరీరము – ఇది కామన్ విషయము. నన్ను స్మృతి చేయండి – తండ్రి ఈ ముఖ్యమైన విషయాన్నే అర్థం చేయిస్తారు. శరీర నిర్వహణార్థము దేహం యొక్క స్మృతిలోకైతే రావాల్సిందే. దేహానికి తినిపించాలి కూడా, దేహం లేకుండా ఏమీ చేయలేరు. ప్రతి జన్మలో తమ శరీర నిర్వహణను చేసుకుంటూ ఉంటారు, కర్మలు చేస్తూ తమ ప్రియుడిని గుర్తుంచుకోవాలి. ఆ ప్రియుడి గురించి ఎవరికీ పూర్తిగా తెలియదు. ఆ ప్రియుడి నుండి లేక తండ్రి నుండి మనకు వారసత్వం లభించనున్నది మరియు వారి స్మృతితో వికర్మలు వినాశనమవుతాయి. ఈ విషయాన్ని ఎవరూ అర్థం చేయించరు. పిల్లలైన మీరు కొత్త విషయాలను వింటారు. ఇంటికి వెళ్ళేందుకు మీకు మార్గం లభించిందని మీకు తెలుసు. తమ ఇంటికి వెళ్ళి మళ్ళీ రాజధానిలోకి వస్తారు. తండ్రి కొత్త ఇల్లు కడితే, అందులోకి వెళ్ళి కూర్చోవాలని తప్పకుండా మనసుకు అనిపిస్తుంది కదా. ఇప్పుడు మీకు మార్గం లభించింది, దీని గురించి ఇతరులెవ్వరికీ తెలియదు. ఎన్ని యజ్ఞ-తపాదులు మొదలైనవి చేసినా, ఎంత తల బాదుకున్నా సద్గతిని పొందలేరు, ఈ ప్రపంచం నుండి ఆ ప్రపంచంలోకి వెళ్ళలేరు. ఇది కూడా అర్థం చేసుకోవాలి. శాస్త్రాలలో లక్షల సంవత్సరాలని రాసేసారు, అందుకే మనుష్యుల బుద్ధి పని చేయడం లేదు. ఇది నిన్నటి విషయమేనని మీరు మంచి రీతిగా అర్థం చేసుకోగలరు. భారత్ స్వర్గంగా ఉండేది. మనం ఆది సనాతన దేవీ-దేవతా ధర్మానికి చెందినవారిగా ఉండేవారము. దేవీ-దేవతా ధర్మం చాలా సుఖాన్నిచ్చేది. భారత్ వంటి సుఖాన్ని ఎవరూ పొందలేరు. స్వర్గంలోకి ఇతర ధర్మాల వారెవ్వరూ వెళ్ళలేరు. ఎంత ప్రయత్నించినా సరే, మీకున్నటువంటి సుఖం ఇతరులెవ్వరికీ ఉండదు. ధనం ఖర్చు చేసినా కూడా, స్వర్గంలో ఉండే సుఖమైతే లభించదు. కొందరికి ఆరోగ్యముంటే ధనముండదు, కొందరికి ధనముంటే ఆరోగ్యముండదు. ఇది దుఃఖపు ప్రపంచం. కనుక ఇప్పుడు తండ్రి అంటారు – ఓ ఆత్మలూ, మేలుకోండి….. ఇప్పుడు మీకు జ్ఞానమనే మూడవ నేత్రం లభించింది. ఎంతటి మేలుకొలుపు కలిగింది. మీరు మొత్తం ప్రపంచం యొక్క చరిత్ర-భూగోళాలను తెలుసుకున్నారు. తండ్రి అన్నీ తెలిసినవారు కదా. దీని అర్థం, అందరి మనసులలో ఏముందో వారికి తెలుసు అని కాదు. వీరు ఎవరు, వీరు ఎంత అర్థం చేయిస్తారు, వీరు ఎంతవరకు పవిత్రంగా ఉంటారు, ఎంతవరకు బాబాను స్మృతి చేస్తారు? అని ప్రతి ఒక్కరి గురించి నేను ఎందుకు ఆలోచించాలి….. ఆత్మలైన మీరు పరమపిత పరమాత్మను స్మృతి చేయాలి అని నేను మార్గం తెలియజేస్తాను. ఈ సృష్టి చక్రాన్ని బుద్ధిలో ఉంచుకోవాలి. దేహీ-అభిమానులుగా అయితే తప్పకుండా అవ్వాలి. దేహాభిమానులుగా అయిన కారణంగా, మీకు ఈ దుర్గతి కలిగింది. ఇప్పుడు మీరు తండ్రిని స్మృతి చేయాలి. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా అవ్వాలి. స్వదర్శన చక్రధారులు కూడా మీరే, దేవతలకైతే శంఖం మొదలైనవి ఉండవు. ఈ జ్ఞాన శంఖం మొదలైనవి బ్రాహ్మణులైన మీకే ఉన్నాయి. సిక్కులు శంఖం మోగిస్తారు, చాలా పెద్ద ధ్వని చేస్తారు. మీరు కూడా ఈ జ్ఞానాన్నిచ్చినట్లయితే, పెద్ద సభలో లౌడ్ స్పీకర్ ను అమరుస్తారు. ఇక్కడ మీరు లౌడ్ స్పీకర్ పెట్టాల్సిన అవసరం లేదు. టీచరు చదివించేటప్పుడు లౌడ్ స్పీకర్ పెడతారా ఏమిటి? ఇక్కడైతే కేవలం శివబాబాను స్మృతి చేయాలి, అప్పుడు వికర్మలు వినాశనమవుతాయి. నేను సర్వశక్తివంతుడను కదా. దూర-దూరాల వరకు శబ్దం వినిపించాలని మీరు లౌడ్ స్పీకర్ పెడతారు. అది కూడా మున్ముందు ఉపయోగపడుతుంది. మృత్యువు ఎదురుగా ఉంది, ఇప్పుడు అందరూ తిరిగి వెళ్ళాలని మీరు వినిపించాలి. మహాభారత యుద్ధం కూడా ఎదురుగా నిలబడి ఉంది. మహాభారత యుద్ధం జరిగిందని, వినాశనం అయ్యిందని గీతలో కూడా రాసి ఉంది. అచ్ఛా, తర్వాత ఏమయ్యింది? పాండవులు కూడా కరిగిపోయి మరణించారని రాసారు. ఒకవేళ వినాశనం ముందే జరిగి ఉంటే, భారత ఖండం కూడా ఖాళీ అయిపోయుండేదని తండ్రి అర్థం చేయిస్తారు. భారత్ అవినాశీ ఖండము, అది ఖాళీ అవ్వదు. ప్రళయమైతే జరగదని మీకు తెలుసు. తండ్రి అవినాశి కనుక వారి జన్మ స్థలం కూడా అవినాశి. పిల్లలకు సంతోషముండాలి. తండ్రి సర్వుల సద్గతి దాత, సుఖ కర్త, శాంతి కర్త. ఎవరు వచ్చినా కూడా, శాంతి కావాలని అంటారు. ఆత్మకు శాంతి అనేది అంతగా ఎందుకు గుర్తుకొస్తుంది? శాంతిధామము ఆత్మల ఇల్లు కదా. ఇల్లు ఎవరికి గుర్తుండదు? ఎవరైనా విదేశాలలో మరణిస్తే, వారిని తమ జన్మ భూమికి తీసుకువెళ్ళాలని అనుకుంటారు. భారత్ యే సర్వుల సద్గతిదాత మరియు దుఃఖం నుండి ముక్తినిప్పించే శివబాబా యొక్క జన్మ స్థలమని ఒకవేళ అందరికీ తెలిస్తే, భారత్ కు ఎంత గౌరవముంటుంది, అప్పుడు వచ్చి ఒక్క శివునికే పుష్పాలు అర్పిస్తారు. ఇప్పుడు ఎంత మందికి పుష్పాలు అర్పిస్తూ ఉంటారు. అందరికీ సుఖ-శాంతులనిచ్చే వారి నామ రూపాలనే మాయం చేసేసారు. ఎవరికైతే తండ్రి గురించి మంచి రీతిగా తెలుసో, వారే వారసత్వాన్ని తీసుకునే పురుషార్థం చేస్తారు. నా పేరే దుఃఖహర్త-సుఖకర్త. దుఃఖం నుండి ముక్తినిప్పించి ఏమి చేస్తారు! శాంతిధామంలో శాంతిగా ఉంటారని, సుఖధామంలో సుఖముంటుందని మీకు తెలుసు. శాంతిధామం వేరు, సుఖధామం వేరు, ఇది దుఃఖధామము. ఈ సమయంలో అందరికీ దుఃఖమే దుఃఖముంది. మనం ఎలాంటి సుఖంలోకి వెళ్తామంటే, అక్కడ 21 జన్మల వరకు ఏ విధమైన దుఃఖము ఉండదని ఇప్పుడు మీకు తెలుసు. దాని పేరే సుఖధామము, ఎంత మధురమైన పేరు. తండ్రి అంటారు – మీకు ఎటువంటి కష్టం ఇవ్వను, కేవలం తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయాలి. స్వయాన్ని ఆత్మగా భావించాలి. మీకు ఈ జ్ఞానాన్ని తండ్రి నేర్పిస్తున్నారు. సత్యయుగంలో, ఆత్మనైన నేను ఈ శరీరాన్ని వదిలి మరొక జన్మ తీసుకుంటానని ఆత్మ జ్ఞానముంటుంది, దీనిని ఆత్మాభిమాని స్థితి అని అంటారు. ఇది ఆత్మిక నాలెడ్జ్. దీనిని ఇతరులెవ్వరూ ఇవ్వలేరు. ఆత్మల తండ్రి వచ్చి ఆత్మలకు నాలెడ్జ్ ఇస్తారు. ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత ఇస్తారు. మనుష్యులైతే పూర్తిగా ఘోర అంధకారంలో ఉన్నారు. ఇప్పుడు మీకు ప్రకాశం లభించింది, మీరు అజ్ఞాన నిద్ర నుండి మేలుకున్నారు. ప్రేయసులందరి ప్రియుడు ఒక్క తండ్రియే. తండ్రి అంటారు – నేను మీకు తండ్రిని కూడా, ప్రియుడిని కూడా, గురువులకు గురువును కూడా, సుప్రీమ్ టీచరును. గురువులందరి సద్గతిదాత ఒక్క సద్గురువు మాత్రమే. వారంటారు – పిల్లలూ, నేను సర్వులకు సద్గతినిస్తాను. గతి తర్వాత సద్గతి ఉంటుంది.
ప్రతి ఆత్మ తిరిగి వెళ్ళాల్సిందేనని తండ్రి అర్థం చేయించారు. ఆత్మయే సతోప్రధానంగా, సతో, రజో, తమోగా అవుతుంది. కొంతమంది పాత్ర చాలా కొద్దిగానే ఉంటుంది. వస్తారు, వెళ్ళిపోతారు. దోమల వలె జన్మిస్తారు మరియు మరణిస్తారు. అటువంటివారు తండ్రి నుండి వారసత్వం తీసుకోరు. తండ్రి నుండి పవిత్రత, సుఖ-శాంతుల వారసత్వం తీసుకోవడం జరుగుతుంది. తండ్రి ఆత్మలైన మీకు అర్థం చేయిస్తారు, తండ్రి అయితే నిరాకారుడు. వారు కూడా వచ్చి ఈ నోటి ద్వారా అర్థం చేయిస్తారు. శివబాబా మందిరాలను కూడా చాలా ఎత్తులో నిర్మిస్తారు. తీర్థయాత్రలకు, మేళాలకు ఎంత దూర-దూరాలకు వెళ్తారు. అక్కడ పైన తాగడానికి జ్ఞానామృతం ఏమైనా పెట్టారా ఏమిటి? ఎంత ఖర్చు చేస్తారు. గవర్నమెంట్ కూడా వారి కోసం ఎన్ని ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది, కష్టమవుతుంది. ఇక్కడ చిన్న పిల్లలను తీర్థ యాత్రలకు ఎలా తీసుకువెళ్తారు. పిల్లలను ఎవరో ఒకరికి చూసుకోమని అప్పజెప్పి వెళ్తారు. తమతో పాటు తీసుకువెళ్ళరు. 2-3 నేలలు యాత్రలు చేస్తారు. ఇక్కడకు మీరు వచ్చినప్పుడు, మీరు కూర్చుని వినాలి, చదువుకోవాలి. చిన్న పిల్లలైతే వినరు. ఇక్కడకు మీరు జ్ఞాన-యోగాలను నేర్చుకునేందుకు వచ్చారు. తండ్రి కూర్చుని జ్ఞానం వినిపించేటప్పుడు శబ్దాలు మొదలైనవేవి ఉండకూడదు. లేదంటే అటువైపు అటెన్షన్ వెళ్తుంది. శాంతిగా కూర్చుని అటెన్షన్ తో వినాలి. యోగమైతే చాలా సహజము. ఏ పని చేస్తున్నా, బుద్ధి యోగం అక్కడ జోడించబడి ఉండాలి. తండ్రి స్మృతి ఉన్నట్లయితే చాలా గొప్ప సంపాదన జరుగుతుంది. మనం సదా ఆరోగ్యవంతులుగా అవుతామని మీకు తెలుసు. మీతో మీరు మాట్లాడుకోవాల్సి ఉంటుంది. తండ్రి స్మృతిలో ఉంటూ భోజనాన్ని కూడా మీ చేతితో తయారుచేసుకోవాలి. చేతులతో పనులు కూడా చేసుకోండి, కానీ మీ తండ్రిని స్మృతి చేయండి. దీనితో మీ కళ్యాణం కూడా జరుగుతుంది మరియు స్మృతిలో ఉండడం వలన వండిన పదార్థం కూడా బాగా కుదురుతుంది. మీకు విశ్వ రాజ్యాధికారం లభిస్తుంది. మీరు ఇక్కడకు లక్ష్మీనారాయణులుగా అయ్యేందుకు వస్తారు. మేము సూర్యవంశీయులుగా అవుతామని అందరూ అంటారు.
మా మమ్మా-బాబాలు ఈ సమయంలో బ్రహ్మా-సరస్వతులుగా ఉన్నారని మీకు తెలుసు. మరుసటి జన్మలో లక్ష్మీనారాయణులుగా అవుతారు. ఇలా భవిష్యత్తులో ఎవరు ఏమవుతారు అని ఎవరి జన్మల గురించి తెలియదు. నెహ్రూ వెళ్ళి ఏమయ్యారు అనేది ఏమి తెలుసు. అచ్ఛా, ఒకవేళ ఏదైనా దానం చేసి ఉంటే, ఇక్కడ మంచి కులంలో జన్మిస్తారు. ఇప్పుడు మీకు అంతా తెలుస్తుంది. ఇప్పుడు వీరి పేర్లు ఆది దేవ్ బ్రహ్మా, ఆది దేవి సరస్వతి. వీరే మళ్ళీ స్వర్గానికి యజమానులుగా అవుతారు. అచ్ఛా, వారి పిల్లలు కూడా వారితోనే ఉంటారు. మేము స్వర్గానికి యజమానులుగా అవుతామని పిల్లలు కూడా అంటారు. ఇదైతే పక్కాగా జరుగుతుంది. మీరు వారిని సూక్ష్మవతనంలో కూడా చూస్తారు. దేవీల మందిరాలలో కూడా చాలా మేళాలు జరుగుతాయి. ఇప్పుడు జగదంబ అయితే ఒక్కరే ఉన్నారు. వారి ముఖ కవళికలు కూడా ఒకే విధంగా ఉండాలి. మమ్మాను కూడా మీరు చూస్తారు. మూర్తులకు పిల్లలైన మీ ముఖ కవళికలు ఉన్నాయి, అందుకే కన్యా కుమారి, అధర్ కుమారి అనే పేర్లు పెట్టారు. మనమే ఈ విధంగా అవుతామని మీకు తెలుసు. మనమంతా బ్రహ్మాకుమార-కుమారీలము. యుగళ్ కూడా మేము బ్రహ్మాకుమార-కుమారీలము, ఒక్క తండ్రి పిల్లలమని అంటారు. ఇది మీ స్మృతి చిహ్నమే. తప్పకుండా మీరు కూర్చొని ఈ నాలెడ్జ్ ను అర్థ సహితంగా ఇస్తారు. ఇది దిల్వాడా మందిరము. మీరు మాత్రమే దీని గురించి అర్థం చేయించగలరు. మేము స్థాపన చేస్తున్నామని, రాజయోగంతో శ్రీమతమనుసారంగా భారత్ ను స్వర్గంగా చేస్తున్నామని మీకు తెలుసు. అచ్ఛా.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. జ్ఞాన-యోగాలపై పూర్తి అటెన్షన్ పెట్టాలి. వినే సమయంలో చాలా శాంతిగా, ఏకాగ్రచిత్తులై కూర్చోవాలి. కర్మయోగులుగా కూడా అవ్వాలి.
2. తండ్రి తెలియజేసిన ఇంటి మార్గాన్ని అందరికీ తెలియజేయాలి. స్వదర్శన చక్రధారులుగా అవ్వడంతో పాటు జ్ఞాన శంఖాన్ని కూడా మోగించాలి.
వరదానము:-
‘ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ లేరు’ – ఈ పాఠం నిరంతరం గుర్తున్నట్లయితే స్థితి ఏకరసంగా అవుతుంది ఎందుకంటే నాలెడ్జ్ అయితే అంతా లభించేసింది, పాయింట్లు అనేకమున్నాయి, కానీ ఇన్ని పాయింట్లు ఉంటూ కూడా, ఎవరైనా కిందకు లాగే సమయంలో, పాయింటు రూపంలో ఉండడమనేది, ఆ సమయం యొక్క అద్భుతము. ఒక్కోసారి విషయాలు కిందకు లాగుతాయి, ఒక్కోసారి వ్యక్తులు లాగుతారు, ఒక్కోసారి వస్తువులు లాగుతాయి, మరోసారి వాయుమండలం….. ఇదైతే తప్పకుండా జరుగుతుంది. కానీ సెకండులో ఈ విస్తారమంతా సమాప్తమై ఏకరస స్థితి ఉండాలి – అప్పుడే శ్రేష్ఠాత్మ భవ యొక్క వరదానులని అంటారు.
స్లోగన్:-
➤ Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu
➤ Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!