03 January 2022 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

2 January 2022

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

‘‘మధురమైన పిల్లలూ - బ్రహ్మా నుండి విష్ణువుగా, విష్ణువు నుండి బ్రహ్మాగా ఎలా అవుతారు, ఇరువురూ ఒకరి నాభి నుండి ఒకరు ఎప్పుడు వెలువడుతారు, ఈ రహస్యాన్ని నిరూపించి అర్థం చేయించండి’’

ప్రశ్న: -

ఏ గుప్తమైన విషయాన్ని సూక్ష్మ బుద్ధి కల పిల్లలే అర్థం చేసుకోగలరు?

జవాబు:-

మనందరి పెద్ద తల్లి ఈ బ్రహ్మా, మనం వారి ముఖవంశావళి. ఇది చాలా గుప్తమైన విషయము. బ్రహ్మా యొక్క పుత్రిక సరస్వతి. వారు అందరికన్నా తెలివైనవారు, జ్ఞాన దేవి. తండ్రి జ్ఞాన కలశాన్ని మాతలపై పెట్టారు. తల్లి యొక్క జోల పాట అని అంటూ ఉంటారు. విశ్వంలో శాంతి ఎలా ఏర్పడగలదు అనేది వారు అందరికీ అర్థం చేయించాలి.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

భోళానాథుని కన్నా అతీతమైనవారు ఎవరూ లేరు…

ఓంశాంతి. పాడైనదానిని బాగుచేసేవారు అని తప్పకుండా భగవంతుడినే అంటారు, అంతేకానీ శంకరుడిని కాదు. భోళానాథుడు అని కూడా శివుడినే అంటారు, శంకరుడిని కాదు. నావికుడు అని కూడా శివుడినే అంటారు, శంకరుడిని కాదు, విష్ణువును కాదు. నావికుడు లేదా గాడ్ ఫాదర్ అని అనడంతో బుద్ధి నిరాకారుని వైపుకు వెళ్ళిపోతుంది. త్రిమూర్తి చిత్రమైతే ప్రసిద్ధి గాంచినది. ప్రభుత్వం వారి రాజముద్ర ఏదైతే ఉందో, అది జంతువులది తయారుచేసారు. మరియు దానిపై సత్యమేవ జయతే అని రాసారు. ఇప్పుడు జంతువులను చూపించడంతో ఏ అర్థము వెలువడదు. ప్రభుత్వం వారి రాజముద్రకు సంబంధించిన నాణెం ఉంటుంది. ఏవైతే పెద్ద-పెద్ద రాజధానులు ఉన్నాయో, వాటన్నింటికీ రాజముద్రలు ఉన్నాయి. భారత్ లో త్రిమూర్తులు ప్రసిద్ధమైనవారు. బ్రహ్మా, విష్ణు, శంకరుడు, అందులో శివుని చిత్రాన్ని మాయం చేసేసారు, ఎందుకంటే వారి గురించిన జ్ఞానమే లేదు. గాడ్ ఫాదర్ అని అనడంతో బుద్ధి నిరాకారుని వైపుకు వెళ్ళిపోతుంది. బ్రహ్మా, విష్ణు, శంకరులను గాడ్ ఫాదర్ అని అనరు. భగవంతుడు ఆత్మలకు తండ్రి. వారు ఉన్నతోన్నతమైనవారు. ఉన్నతోన్నతమైనవారు భగవంతుడు అని చూపిస్తారు కూడా. ఉన్నతోన్నతమైనవారు అని బ్రహ్మాను అనరు, అలానే విష్ణువును లేక శంకరుడిని అనరు. ఉన్నతోన్నతమైనవారు ఒక్క భగవంతుడు. ఇది అందరికీ తెలుసు. సిక్కులు కూడా వారి మహిమను పాడుతారు. మనుష్యులను దేవతలుగా తయారుచేసేవారు పరమపిత పరమాత్మ తప్ప ఇంకెవ్వరూ ఉండజాలరు అన్న జ్ఞానం గురునానక్ కు కూడా ఉండేది. సత్యయుగంలోనైతే దేవతలు తప్పకుండా ఉంటారు. కానీ దేవతలను రచించేవారు పరమాత్మనే. వారు దేవతలను ఎలా రచిస్తారు, ఇది తెలియదు. మురికి పట్టిన వస్త్రాలను శుభ్రం చేస్తారు అని మహిమను పాడుతారు. కనుక ఏ మనుష్యులైతే మురికి పట్టిన వారిగా ఉండేవారో, వారిని దేవతలుగా తయారుచేసారు. కానీ తయారుచేసింది ఎప్పుడు, ఇది రాయలేదు. తప్పకుండా ఈ సమయంలోనే పరమాత్మ మనుష్యులను దేవతలుగా తయారుచేస్తూ ఉన్నారని మీకు తెలుసు. తప్పకుండా దుర్గతి నుండి సద్గతి కలిగించి ఉండవచ్చు, భ్రష్టాచారులను శ్రేష్ఠాచారులుగా తయారుచేసి ఉండవచ్చు! ఈ భారత్ లోనే శ్రేష్ఠాచారీ దేవతలు ఉండేవారని మీరు అర్థం చేయించవచ్చు. గురునానక్ ఎప్పుడైతే వచ్చారో, అప్పుడు భ్రష్టాచారీ ప్రపంచం ఉండేది కదా, అందుకే అలా పాడేవారు. లక్ష్మీ-నారాయణులు మొదలైనవారి చిత్రాలైతే ఉంటాయి కదా, వీరితోనే వారికి కాంపిటీషన్ (పోటీ) ఉంటుంది. గురు గోవింద్ సింగ్ జన్మదినాన్ని చాలా ఘనంగా జరుపుకుంటారు. వారు సిక్కు ధర్మం యొక్క రచయిత. వారు స్వయం అంటారు, భగవంతుడు నిరాకారుడు, నిరహంకారి, వచ్చి మనుష్యులను పతితుల నుండి పావన దేవతలుగా తయారుచేస్తారు అని. శ్రీ కృష్ణుడు మనుష్యులను దేవతలుగా తయారుచేయలేరు. నేను మీకు సహజ రాజయోగాన్ని నేర్పించి శ్రేష్ఠాచారీ మహారాజు-మహారాణిగా తయారుచేస్తాను అని గీతలో కూడా ఉంది. పతితపావనా అని గాడ్ ఫాదర్ నే అంటారు. వారు తప్పకుండా భ్రష్టాచారీ ప్రపంచంలో వస్తారు. వచ్చి పావనంగా తయారుచేయండి అని వారితో అంటారు. శ్రేష్ఠాచారిగా తయారుచేసేవారైతే ఒక్క నిరాకార తండ్రి, ఉన్నతోన్నతమైన భగవంతుడే, ఆ తర్వాత ఉన్నది బ్రహ్మా, విష్ణు, శంకరులు, వీరు పరమపిత పరమాత్మ యొక్క రచన. పరమాత్మకు చిత్రము లేదు. విష్ణువు నాభి నుండి బ్రహ్మా వెలువడుతారు, మళ్ళీ బ్రహ్మా నాభి నుండి విష్ణువు ఎలా వెలువడుతారు అనేది ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తారు. ఎందుకంటే బ్రహ్మానే విష్ణువుగా, విష్ణువే బ్రహ్మాగా అవుతారు. బ్రహ్మా ద్వారా స్థాపన, మళ్ళీ ఆ బ్రహ్మా-సరస్వతులే మరుసటి జన్మలో విష్ణువు యొక్క రెండు రూపాలైన లక్ష్మీ-నారాయణులుగా అయి పాలన చేస్తారు. కావున బ్రహ్మా-సరస్వతులే లక్ష్మీ-నారాయణులు. బ్రహ్మా అంటారు, మేమే విష్ణువు యొక్క రెండు రూపాలైన లక్ష్మీ-నారాయణులుగా అవుతాము. లక్ష్మీ-నారాయణులు మళ్ళీ, మేమే బ్రహ్మా-సరస్వతులము అని అంటారు, కావున ఒకరి నాభి నుండి ఒకరు వెలువడినట్లు కదా. మేమే దేవతలుగా, మళ్ళీ క్షత్రియులుగా, వైశ్యులుగా, శూద్రులుగా అయ్యాము. ఇవి చాలా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. బాబా అర్థం చేయించారు – ఏ బ్రహ్మా శరీరంలోనైతే నేను ప్రవేశించానో, వారివి పూర్తి 84 జన్మలు అయ్యాయి. అంతేకానీ రథము మొదలైనవాటి విషయమేమీ లేదు. అవన్నీ అసత్యాలు. ఈ సంగమ సమయం గురించి ఎవ్వరికీ తెలియదు. మనుష్యులను ఘోర అంధకారంలో వేసేసారు. కలియుగ ఆయువు ఇన్ని లక్షల సంవత్సరాలు, సత్యయుగం ఆయువు ఇంత, ఇలాంటి-ఇలాంటి విషయాలను వినిపించి ఘోర అంధకారంలో వేసేసారు. తండ్రి అంటారు, ఎవరైతే నన్ను గుర్తిస్తారో, నేను ఆ పిల్లల ఎదురుగా సమ్ముఖంగా ఉంటాను. మిగిలినవారైతే నన్ను గుర్తించనే గుర్తించరు. వీరు ఎవరు అనేది వారు అర్థం చేసుకోరు కూడా. ఏదైనా పెద్ద సభలోకి వెళ్ళినట్లయితే వారేమైనా అర్థం చేసుకుంటారా. మీలో కూడా కష్టం మీద అర్థం చేసుకుంటారు. పదే-పదే మర్చిపోతారు. వీరు అందరికన్నా పెద్ద అత్యంత ఉన్నతమైన అథారిటీ. పోప్ విషయంలో చూడండి, ఎంత గౌరవిస్తారు. పోప్ ఎవరు? వారు క్రిస్టియన్ వంశావళికి చెందినవారు. ఇది అంతిమ జన్మ. క్రైస్టు సమయం నుండి పునర్జన్మలు తీసుకుంటూ ఇప్పుడు తమోప్రధాన అవస్థలో ఉన్నారు. అందరూ పతితులుగా ఉన్నారు. ఒకరికొకరు దుఃఖమిచ్చుకుంటూ ఉంటారు. తండ్రి అంటారు – ఇది కూడా తయారై తయారుచేయబడిన ఆట. కావున ఉన్నతోన్నతమైనవారు నిరాకార భగవంతుడు, ఆ తర్వాత బ్రహ్మా, విష్ణు, శంకరులు. బ్రహ్మా ద్వారా స్థాపన. ఎవరి ద్వారా స్థాపన జరుగుతుందో, వారి ద్వారానే పాలన జరుగుతుంది. కావున ఈ బ్రహ్మా-సరస్వతులు మళ్ళీ లక్ష్మీ-నారాయణులుగా అవ్వాలి. లక్ష్మీ-నారాయణులే ఇప్పుడు బ్రహ్మా-సరస్వతులుగా అయ్యారు. వీరంతా ప్రజాపిత యొక్క ముఖవంశావళి. కృష్ణుడిని ప్రజాపిత అని అనరు. వీరి పేరే ప్రజాపిత బ్రహ్మా. బ్రహ్మా ద్వారా తప్పకుండా బ్రాహ్మణులు కావాలి. తండ్రి అంటారు, బ్రహ్మాను దత్తత తీసుకుంటాను. ఎవరైతే పూర్తి 84 జన్మలు అనుభవించి ఇప్పుడు అంతిమ జన్మలో ఉన్నారో, నేను వారినే బ్రహ్మాగా చేయాలి. బ్రహ్మా అయితే ఒక్కరే ఉంటారు కదా. వీరికి తమ జన్మల గురించి తెలియదు కావున బ్రహ్మాకు కూర్చుని అర్థం చేయిస్తారు, మరి తప్పకుండా బ్రాహ్మణులు కూడా ఉంటారు. బ్రాహ్మణులు బ్రహ్మా యొక్క ముఖవంశావళి. వీరంతా దత్తత తీసుకోబడిన పిల్లలు, కుమారులు, కుమారీలు. ప్రజాపితకు తప్పకుండా ముఖవంశావళి ఉంటారు. ఇవి చాలా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. నాకు అనేక జన్మల అంతిమంలో రావాల్సి వస్తుంది అని స్వయం అర్థం చేయిస్తారు. సత్యయుగంలో మొట్టమొదట ఈ లక్ష్మీ-నారాయణులు ఉండేవారు. తప్పకుండా వీరే 84 జన్మలు తీసుకొని ఉంటారు. ఇతరులు తప్పకుండా తక్కువ తీసుకొని ఉంటారు. ఈ బ్రహ్మా-సరస్వతులే మళ్ళీ విష్ణువు యుగళ్ అవుతారు. కావున ఇవి ఎంత అర్థం చేసుకోవాల్సిన విషయాలు. మొట్టమొదటగా ఈ నిశ్చయం ఉండాలి, ఈ జ్ఞానాన్ని కృష్ణుడు ఇవ్వలేరు అని. అచ్ఛా, మళ్ళీ మీరే పూజ్యులు, మీరే పూజారులు అని అంటూ ఉంటారు. భక్తి మార్గంలో పూజారులు, జ్ఞాన మార్గంలో పూజ్యులు. విష్ణువు యొక్క రెండు రూపాలు తప్పకుండా పూజ్యులుగా ఉండేవారు. తర్వాత, ఈ బ్రహ్మానే పూజారిగా అయ్యి, విష్ణువు యొక్క పూజ చేసేవారు. మేమే విష్ణువు యొక్క పూజారిగా ఉండేవారము అని అంటారు. ఇప్పుడు మేమే పూజ్యులైన విష్ణువుగా అవుతున్నాము, తతత్వం (ఇది మీకు కూడా వర్తిస్తుంది). దీనిని గుహ్యాతి గుహ్యమైన విషయం అని అనడం జరుగుతుంది. బ్రహ్మా ఎక్కడ నుండి వచ్చారు! విష్ణువు ఎక్కడికి వెళ్ళారు? ఇది మీకు మాత్రమే తెలుసు. విష్ణువు యొక్క రెండు రూపాలైన లక్ష్మీ-నారాయణులు, 84 జన్మలు పూర్తి చేసుకొని అంతిమంలో పతితులుగా అవ్వాలి. వంశమంతా పతితంగా అయినప్పుడు నేను వచ్చి స్థాపన చేసి, మిగిలిన అన్ని ధర్మాలను సమాప్తం చేస్తాను. మళ్ళీ సహజ రాజయోగాన్ని నేర్పించి శ్రేష్ఠాచారీ దేవీ-దేవతా ధర్మాన్ని స్థాపన చేసి, మిగిలిన భ్రష్టాచారీ ధర్మాలు ఏవైతే ఉన్నాయో, వాటన్నిటి వినాశనం చేయిస్తాను. రామరాజ్యంలో ఏ ఇతర ధర్మము ఉండదు. ఇప్పుడు అన్ని ధర్మాలు ఉన్నాయి. భారత్ యొక్క అసలైన ధర్మం లేదు, అది మళ్ళీ స్థాపన అవుతూ ఉంది. చిత్రాలు కూడా ఉన్నాయి. త్రిమూర్తుల పైన శివుడు కూడా ఉన్నారు, బ్రహ్మా-సరస్వతులే లక్ష్మీ-నారాయణులు, వారే రాధే-కృష్ణులుగా ఉండేవారు. రాధే ఆమె రాజధానికి చెందినవారిగా ఉండేవారు. అలానే, కృష్ణుడు అతని రాజధానికి చెందినవారిగా ఉండేవారు. జ్ఞాన సితార్ రాధే వద్ద లేదు. సరస్వతి జ్ఞానంతో భవిష్యత్తులో రాధేగా అయ్యారు. సరస్వతిని జ్ఞాన దేవి అని అంటారు. వారికి తప్పకుండా తండ్రి ద్వారా జ్ఞానం లభించి ఉంటుంది. సరస్వతి, బ్రహ్మాకు కుమార్తె. ప్రజాపిత బ్రహ్మా ఉన్నారు అంటే జగదంబ కూడా కావాలి. వాస్తవానికి ఇది గుప్తమైన విషయము. పెద్ద తల్లి అయితే ఈ బ్రహ్మా. వీరి ద్వారా మాతలకు జ్ఞానమిస్తారు. జగదంబను పెద్ద కుమార్తె అని అంటూ ఉంటారు. వాస్తవానికి బ్రహ్మా ముఖం ద్వారా దత్తత తీసుకోబడతారు కావున వీరు మాత అయ్యారు. తెలివైనవారిలో తెలివైనవారు, బ్రహ్మా కుమార్తె అయిన సరస్వతి. వారు ఎక్కడి నుండి వచ్చారు? బ్రహ్మాకు పత్ని అయితే లేరు. వారు ఉన్నదే ప్రజాపిత. కావున ఆమె ముఖవంశావళి. ఈ డ్రామా కూడా అనాదిగా తయారై తయారుచేయబడినది. కావున జ్ఞాన దేవి సరస్వతి. ఇప్పుడు ధర్మ సమ్మేళనం జరుగుతుంది, దానికి నిరాకార శివబాబా అయితే వెళ్ళలేరు. బ్రహ్మాను కూడా కూర్చోబెట్టలేరు. మాతకు మహిమ ఉంది. అన్ని ధర్మాల వారి హెడ్ గా మాత ఉండాలి. అందరికీ మాత అయిన జగదంబ కూర్చొని జోల పాట పాడాలి. పిల్లలు తల్లి ద్వారా జన్మిస్తారు. జగదంబ అందరికీ తల్లి కావున అందరూ వారి ఎదురుగా తల వంచాల్సి ఉంటుంది. ఈ భ్రష్టాచారీ ప్రపంచం శ్రేష్ఠాచారిగా ఎలా అవుతుంది మరియు ఈ భారత్ లో శాంతి ఎలా స్థాపన అవుతుంది అనేది మాత అర్థం చేయించగలరు. రావణ రాజ్యంలో శాంతి ఉండజాలదు. శాంతి ఎక్కడ నుండి లభిస్తుంది – ఇది మాత మాత్రమే అర్థం చేయించగలరు. శాంతిధామము నిర్వాణధామము. ఇది దుఃఖధామము. సత్యయుగము సుఖధామము. తప్పకుండా సత్యయుగంలో ఒకే రాజ్యముండేది. సుఖము, శాంతి, పవిత్రత అన్నీ ఉండేవి. ఇప్పుడు లేవు. కావున తప్పకుండా డ్రామా పూర్తి అవుతుంది. వృక్షం యొక్క ఆయువు కూడా పూర్తి అయ్యింది. దేవతలవి కూడా 84 జన్మలు పూర్తి అయ్యాయి. 84 లక్షల జన్మలైతే ఉండలేవు. ఇస్లామ్, బౌద్ధ ధర్మం వారు వచ్చి ఇన్ని సంవత్సరాలు అయ్యింది అంటే 84 లక్షల జన్మలెలా ఉంటాయి. బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము అయ్యేందుకు సమయం పడుతుంది. 84 లక్షల జన్మలు ఉంటే కల్పం చాలా పెద్దదైపోతుంది. మరి మీకు పరమపిత పరమాత్మతో ఏ సంబంధం ఉంది అనేది ఈ మాత అర్థం చేయిస్తారు. వారైతే తండ్రి, రచయిత కదా. మొదట బ్రహ్మా, విష్ణు, శంకరులను రచిస్తూ ఉండవచ్చు, ఆ తర్వాత బ్రహ్మా ద్వారా మనుష్య సృష్టిని రచిస్తారు. అలాగని ఏదో కొత్త ప్రపంచాన్ని రచిస్తారు అని కాదు. ఒకవేళ అలా జరిగితే, పతితపావనా రండి, అని మనుష్యులు అనరు. ఈ సమయంలో మొత్తం ప్రపంచమంతా పతితంగా ఉంది, అందరూ దుర్గతిని పొంది ఉన్నారు. ఓ గాడ్ ఫాదర్, దయ చూపండి, మమ్మల్ని ఈ మాయావి దుఃఖాల నుండి విడిపించండి అని గుర్తు చేసుకుంటూ ఉంటారు. అటువంటప్పుడు వారు దుఃఖం ఎలా ఇస్తారు. దుఃఖం ఇచ్చేవారు తప్పకుండా వేరే వారు ఉన్నారు. సత్యయుగంలో ఏక ధర్మం ఉన్నప్పుడు, మిగిలిన అన్ని ధర్మాల ఆత్మలు నిర్వాణధామంలో ఉండేవారు. ఇప్పుడైతే ఆత్మలందరూ ఇక్కడ ఉన్నారు కావున మళ్ళీ తప్పకుండా తండ్రి వచ్చి ఏక ధర్మ స్థాపనను చేయాలి. బ్రహ్మా ద్వారా స్థాపన, మళ్ళీ ఆ బ్రహ్మానే విష్ణువుగా అవుతారు. మళ్ళీ విష్ణువు నాభి నుండి బ్రహ్మా వెలువడుతారు. వారి ద్వారా కూర్చుని జ్ఞానమిస్తాను, అప్పుడు మళ్ళీ దేవతలుగా అవుతారు. రాజయోగం నేర్చుకుంటారు. ఇకపోతే ప్రపంచం వారు ఏవైతే అనేక చిత్రాలు తయారుచేసారో, అవన్నీ కట్టు కథలు. ముఖ్యమైన విషయము – గీతా మాత యొక్క భగవంతుడు ఎవరు అని. పరమపిత పరమాత్మ విష్ణువుకు జన్మనిస్తారు అని అర్థం చేయించాలి. బ్రహ్మాకు కూడా జన్మనిస్తారు కదా. వారు సత్యయుగం యొక్క దేవతలు. బ్రహ్మా ఎక్కడి వారు? తప్పకుండా కలియుగం వారై ఉంటారు. అనేక జన్మల అంతిమ జన్మ అనేది తప్పకుండా దేవతలదే ఉంటుంది. ఎవరైతే శేష్ఠాచారులుగా ఉండేవారో, ఇప్పుడు భ్రష్టాచారులుగా ఉన్నారు. రెండు యుగాలలో సూర్యవంశీయుల, చంద్రవంశీయుల రాజ్యం ఉంటుంది, నాలుగు భాగాలు ఉన్నాయి. లక్షల సంవత్సరాల విషయం కాదు. క్రైస్టుకు 3 వేల సంవత్సరాలకు క్రితం భారత్ స్వర్గంగా ఉండేది అని అంటారు. ఇదంతా చాలా బాగా అర్థం చేయించాల్సి ఉంటుంది. తండ్రి అంటారు – వీరంతా దత్తత తీసుకోబడిన పిల్లలు. ఇప్పుడు వినాశనం ఎదురుగా నిలబడి ఉంది. భ్రష్టాచారీ భారత్ ను మనుష్యులెవ్వరూ శ్రేష్ఠాచారిగా చేయలేరు. బాబా అర్థం చేయించారు – దేవతలు వామ మార్గంలో వచ్చినప్పుడు, ఈ సన్యాసులు పవిత్రతా బలంతో భారత్ ను నిలుపుతారు. ఈ సమయంలోనైతే అందరూ పతితులుగా అయిపోయారు. నది అయితే సాగరం నుండి వెలువడుతుంది. నదులను పతితపావని అని అంటూ వాటిలో స్నానం చేస్తారు. ఇప్పుడు నదులైతే అన్ని చోట్ల ఉన్నాయి. నది ఎలా పతితపావనిగా అవ్వగలదు. పతితపావనుడు అయితే ఒక్క పరమపిత పరమాత్మనే. ఇక్కడైతే సహజ రాజయోగము ద్వారా మనుష్యులను భ్రష్టాచారుల నుండి శ్రేష్ఠాచారులుగా తయారుచేయడానికి జ్ఞాన గంగలు కావాలి. తండ్రి అంటారు, నేను సర్వశక్తివంతుడిని, నాతో యోగం జోడించడం ద్వారానే సర్వ వికర్మలు వినాశనం అవుతాయి. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. అందరికన్నా పెద్ద అత్యంత ఉన్నతమైన అథారిటి తండ్రి, వారిని యథార్థ రూపంలో గుర్తించి గౌరవం ఉంచాలి. వారి శ్రీమతంపై పూర్తి-పూర్తిగా నడుచుకోవాలి.

2. తండ్రి జ్ఞాన కలశాన్ని మాతలకు ఇచ్చారు, వారిని ముందుంచాలి.

వరదానము:-

డబల్ లైట్ అనగా అంతా తండ్రికి అర్పించడము. తనువు కూడా నాది కాదు. ఈ తనువును సేవ కోసం తండ్రి ఇచ్చారు. తనువు-మనసు-ధనము, అన్నీ మీవే అని మీరు ప్రతిజ్ఞ చేసారు. తనువే నాది కాదు అన్నప్పుడు ఇంకేమి మిగిలింది. కనుక సదా కమల పుష్పం యొక్క ఉదాహరణ స్మృతిలో ఉండాలి, నేను కమల పుష్పం సమానంగా అతీతంగా మరియు ప్రియంగా ఉన్నాను. ఇలా అతీతంగా ఉండేవారికి పరమాత్మ ప్రేమ యొక్క అధికారం లభిస్తుంది.

స్లోగన్:-

లవలీన స్థితిని అనుభవం చేయండి

మీ నయనాలలో మరియు నోటి ద్వారా వెలువడే ప్రతి మాటలో తండ్రి ఇమిడి ఉండాలి. అప్పుడు మీ శక్తిశాలీ స్వరూపం ద్వారా సర్వశక్తివంతుడు కనిపిస్తారు. ఎలాగైతే ఆది స్థాపనలో బ్రహ్మా రూపంలో శ్రీకృష్ణుడు కనిపించేవారో, అలా ఇప్పుడు పిల్లలైన మీ ద్వారా సర్వశక్తివంతుడు కనిపించాలి.

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top