02 November 2021 TELUGU Murli Today | Brahma Kumaris

02 November 2021 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

1 November 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

“మధురమైన పిల్లలూ - మీరు మనసా-వాచా-కర్మణా ఏక్యురేట్ గా తయారవ్వాలి, ఎందుకంటే మీరు బ్రాహ్మణులు, పిలక వంటి వారు, దేవతల కంటే ఉన్నతమైనవారు”

ప్రశ్న: -

పిల్లలు కూడా కష్టంగా అర్థం చేసుకునే అత్యంత గుప్తమైన, సూక్ష్మమైన విషయమేమిటి?

జవాబు:-

శివబాబాకు మరియు బ్రహ్మాబాబాకు మధ్యన ఉన్న భేదాన్ని అర్థం చేసుకోవడమనేది అత్యంత గుప్తమైన, సూక్ష్మమైన విషయము. చాలామంది పిల్లలు ఇందులో తికమకపడతారు. ఈ రహస్యాన్ని స్వయంగా తండ్రి అర్థం చేయిస్తారు – ఉదయాన్నే, నేను ఈ తనువు ద్వారా పిల్లలైన మిమ్మల్ని చదివిస్తాను. అంతేకానీ రోజంతా ఇతని పై స్వారీ చేస్తానని కాదు.

♫ వినండి ఆడియో (audio)➤

ఓంశాంతి. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తారు. పిల్లలు అంటే ఎవరు? బ్రాహ్మణులు. మేము బ్రాహ్మణులము, దేవతలుగా తయారవుతున్నామని ఎప్పుడూ మర్చిపోకండి. వర్ణాలను కూడా గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరంతా పరస్పరంలో బ్రాహ్మణులు. బ్రాహ్మణులను అనంతమైన తండ్రి చదివిస్తారు. ఈ బ్రహ్మా చదివించరు, శివబాబా చదివిస్తారు. బ్రహ్మా ద్వారానే బ్రాహ్మణులను చదివిస్తారు. శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అవ్వకుండా దేవతలుగా అవ్వలేరు. వారసత్వం శివబాబా నుండే లభిస్తుంది. శివబాబా అందరికీ తండ్రి. ఈ బ్రహ్మాను గ్రాండ్ ఫాదర్ (తాతగారు) అని అంటారు. లౌకిక తండ్రి అందరికీ ఉంటారు. పారలౌకిక తండ్రిని భక్తి మార్గంలో స్మృతి చేస్తారు. ఇతను అలౌకిక తండ్రి అని ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు.. బ్రహ్మా మందిరం ఉన్నప్పటికీ వారి గురించి ఎవ్వరికీ తెలియదు. ఇక్కడ కూడా ప్రజాపిత ఆది దేవ్ యొక్క మందిరముంది. వారిని మహావీర్ అని కూడా అంటారు, కొందరు దిల్ వాలా (మనసున్నవారు) అని కూడా అంటారు. కానీ వాస్తవానికి మనసును దోచుకునేవారు శివబాబా, బ్రహ్మా కాదు. ఆత్మలందరికీ సదా సుఖమిచ్చేవారు, సంతోషాన్ని ఇచ్చేవారు ఒక్క తండ్రి మాత్రమే. ఇది కూడా పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. ప్రపంచంలోని మనుష్యులకు ఏ మాత్రము తెలియదు. బ్రాహ్మణులైన మనమే శివబాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాము. మీరు కూడా పదే-పదే మర్చిపోతారు. స్మృతి చాలా సహజమైనది. ‘యోగము’ అనే పదాన్ని సన్యాసులు ఉపయోగిస్తారు. మీరైతే బాబాను స్మృతి చేస్తారు. యోగము అనేది కామన్ పదము, దీనిని యోగాశ్రమము అని కూడా అనరు. పిల్లలు మరియు తండ్రి కూర్చొని ఉన్నారు. అనంతమైన తండ్రిని స్మృతి చేయడం పిల్లల కర్తవ్యము. మనం బ్రాహ్మణులము, తాతగారి వారసత్వాన్ని బ్రహ్మా ద్వారా తీసుకుంటాము. అందుకే శివబాబా అంటారు – ఎంత వీలైతే అంత స్మృతి చేస్తూ ఉండండి. చిత్రాలను కూడా పెట్టుకోండి. మనం బ్రాహ్మణులము, తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటామని అయితే గుర్తుంటుంది. బ్రాహ్మణులు ఎప్పుడైనా తమ జాతిని మర్చిపోతారా ఏమిటి? మీరు శూద్రుల సాంగత్యంలోకి వచ్చి బ్రాహ్మణత్వాన్నే మర్చిపోతారు. బ్రాహ్మణులు దేవతల కంటే ఉన్నతమైనవారు, ఎందుకంటే బ్రాహ్మణులైన మీరు నాలెడ్జ్ ఫుల్. భగవంతుడిని జానీ జానన్ హార్ (అన్నీ తెలిసినవారని) అంటారు. అంటే వారు అందరి మనస్సులో ఏముందో కూర్చొని చూస్తారని కాదు. వారికి సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానముంది. వారు బీజరూపుడు. బీజానికి వృక్షం యొక్క ఆదిమధ్యాంతాల గురించి తెలుసు. కనుక అలాంటి తండ్రిని చాలా-చాలా స్మృతి చేయాలి. ఇతని ఆత్మ కూడా ఆ తండ్రిని స్మృతి చేస్తుంది. ఆ తండ్రి అంటారు – వీరు (బ్రహ్మా) కూడా నన్ను స్మృతి చేసినప్పుడే ఈ పదవిని పొందుతారు. మీరు కూడా స్మృతి చేస్తే, పదవిని పొందుతారు. మొట్టమొదట మీరు శరీరం లేకుండా (అశరీరిగా) వచ్చారు. మళ్ళీ అశరీరులుగా అయి తిరిగి వెళ్ళాలి. ఇతర దేహ సంబంధీకులందరూ దుఃఖమిచ్చేవారే, నేను మీకు లభించినప్పుడు, వారినెందుకు గుర్తు చేస్తారు! నేను మిమ్మల్ని కొత్త ప్రపంచానికి తీసుకువెళ్ళేందుకు వచ్చాను. అక్కడ ఎలాంటి దుఃఖము ఉండదు. అది దైవీ సంబంధము. ఇక్కడ స్త్రీ-పురుషులు ఇరువురి సంబంధంలో మొదట దుఃఖమే ఉంటుంది, ఎందుకంటే వారు వికారులుగా అవుతారు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఆ ప్రపంచానికి యోగ్యులుగా తయారుచేస్తాను, అక్కడ వికారాల విషయమే ఉండదు. కామం మహాశత్రువు అని అంటూ ఉంటారు, అది ఆదిమధ్యాంతాలు దుఃఖమిస్తుంది. క్రోధం గురించి – అది ఆదిమధ్యాంతాలు దుఃఖమిస్తుంది అని అనరు. కామమును జయించాలి, అదే ఆదిమధ్యాంతాలు దుఃఖమిస్తుంది. పతితులుగా తయారుచేస్తుంది. పతితులు అనే పదం వికారులకు వర్తిస్తుంది. ఈ శత్రువుపై విజయం పొందాలి. మనం సత్యయుగ దేవీ-దేవతలుగా అవుతున్నాము. ఈ నిశ్చయం ఏర్పడనంత వరకు ఏమీ పొందలేరు.

తండ్రి అర్థం చేయిస్తారు – పిల్లలు మనసా-వాచా-కర్మణా ఏక్యురేట్ గా తయారవ్వాలి. దీని కోసం శ్రమించాలి. మీరు భారత్ ను స్వర్గంగా తయారుచేస్తున్నారని ప్రపంచంలోని వారెవ్వరికీ తెలియదు. మున్ముందు అర్థం చేసుకుంటారు. ఒకే ప్రపంచం, ఒకే రాజ్యం, ఒకే ధర్మం, ఒకే భాష ఉండాలని కూడా కోరుకుంటారు. నేటికి 5 వేల సంవత్సరాల క్రితం ఒకే రాజ్యము, ఒకే ధర్మముండేది, దానినే స్వర్గము అంటారని మీరు అర్థం చేయించవచ్చు. రామ రాజ్యం, రావణ రాజ్యం గురించి కూడా ఎవ్వరికీ తెలియదు. ఇంతకుముందు మీకు కూడా తెలియదు. ఇప్పుడు నంబరువారు పురుషార్థం అనుసారంగా మీరు స్వచ్ఛ బుద్ధి కలవారిగా అయ్యారు. తండ్రి కూర్చొని మీకు అర్థం చేయిస్తున్నారు కనుక తప్పకుండా తండ్రి మతాన్ని అనుసరించండి. తండ్రి అంటారు – పాత ప్రపంచంలో ఉంటూ కమలపుష్ప సమానంగా పవిత్రంగా ఉండండి. నన్ను స్మృతి కూడా చేస్తూ ఉండండి. తండ్రి ఆత్మలకు అర్థం చేయిస్తారు. ఈ కర్మేంద్రియాల ద్వారా ఆత్మలను చదివించేందుకు వచ్చాను. ఇది పాత ఛీ- ఛీ ప్రపంచం, ఛీ-ఛీ శరీరము. బ్రాహ్మణులైన మీరు పూజకు యోగ్యులు కాదు, గాయన యోగ్యులు. పూజకు యోగ్యులైన వారు దేవతలు. మీరు శ్రీమతం అనుసారంగా విశ్వాన్ని స్వర్గంగా తయారుచేస్తారు అందుకే మీకు గాయనముంది, పూజ జరగదు. గాయనం తప్పకుండా బ్రాహ్మణులైన మీకు మాత్రమే ఉంటుంది, దేవతలకు ఉండదు. తండ్రి మిమ్మల్నే శూద్రుల నుండి బ్రాహ్మణులుగా తయారుచేస్తారు. దేవతల యొక్క ఆత్మ మరియు శరీరం రెండు పవిత్రంగా ఉంటాయి. ఇప్పుడు మీ ఆత్మ పవిత్రంగా అవుతూ ఉంటుంది. శరీరం పవిత్రంగా లేదు. ఇప్పుడు మీరు ఈశ్వరుని మతం అనుసారంగా భారత్ ను స్వర్గంగా తయారుచేస్తున్నారు. మీరు కూడా స్వర్గానికి యోగ్యులుగా తయారవుతున్నారు. సతోప్రధానంగా తప్పకుండా అవ్వాలి. తండ్రి కూర్చొని కేవలం బ్రాహ్మణులైన మీకు మాత్రమే చదివిస్తారు. బ్రాహ్మణుల వృక్షం వృద్ధి చెందుతూ ఉంటుంది. ఏ బ్రాహ్మణులైతే పక్కాగా అవుతారో, వారే వెళ్ళి దేవతలుగా అవుతారు. ఇది కొత్త వృక్షము, మాయా తుఫాన్లు కూడా వస్తాయి. సత్యయుగంలో ఏ తుఫాన్లు రావు. ఇక్కడ మాయ తండ్రి స్మృతిలో ఉండనివ్వదు. తండ్రి స్మృతి ద్వారానే తమోప్రధానం నుండి సతోప్రధానంగా అవుతామని మనకు తెలుసు. స్మృతిపైనే అంతా ఆధారపడి ఉంది. భారత్ యొక్క ప్రాచీన యోగం కూడా ప్రసిద్ధమైనది కదా. విదేశీయులు కూడా – ఎవరైనా వచ్చి ప్రాచీన యోగాన్ని నేర్పించాలని భావిస్తారు.

ఇప్పుడు యోగం రెండు రకాలుగా ఉంటుంది – మొదటిది హఠయోగులకు సంబంధించింది, రెండవది రాజయోగులకు సంబంధించింది. మీరు రాజయోగులు. హఠయోగం అనేది చాలా రోజుల నుండి కొనసాగుతూ ఉంది. రాజయోగం గురించి మీకు ఇప్పుడు తెలిసింది. సన్యాసులకు రాజయోగం గురించి ఏం తెలుసు. రాజయోగాన్ని నేనే వచ్చి నేర్పిస్తాను, కృష్ణుడు నేర్పించలేరని తండ్రి వచ్చి తెలియజేసారు. ఇది కేవలం భారత్ కు సంబంధించిన ప్రాచీన యోగము, కానీ గీతలో నా పేరుకు బదులు కృష్ణుని పేరును వేసేసారు. ఎంత తేడా వచ్చేసింది. శివజయంతి జరిగినప్పుడు, మీ వైకుంఠ జయంతి కూడా జరుగుతుంది, అందులో కృష్ణుని రాజ్యముంటుంది. శివబాబా జయంతి ఉంది అంటే గీతా జయంతి కూడా ఉంటుంది, వైకుంఠ జయంతి కూడా ఉంటుంది. మీరు పవిత్రంగా అవుతారు. కల్పక్రితం వలె స్థాపన జరుగుతుంది. కనుక శివబాబా జయంతి అనగా స్వర్గ జయంతి అని అర్థము. బాబానే వచ్చి స్వర్గ స్థాపన చేస్తారు. ఇప్పుడు తండ్రి అంటారు – నన్ను స్మృతి చేయండి, స్మృతి చేయకపోతే మాయ ఏదో ఒక వికర్మ చేయిస్తూ ఉంటుంది. స్మృతి చేయకపోతే చెంపదెబ్బ తగులుతుంది. స్మృతిలో ఉంటే చెంపదెబ్బ తగలదు. ఈ బాక్సింగ్ జరుగుతుంది. మనకు మనుష్యులెవరూ శత్రువులు కారు, రావణుడు శత్రువని మీకు తెలుసు. వివాహమైన తర్వాత కుమారులు-కుమారీలు కూడా పతితులుగా అవ్వడం వలన పరస్పరంలో శత్రువులుగా అయిపోతారు. వివాహం కోసం లక్షల రూపాయలు ఖర్చు చేస్తారు. బాబా అంటారు – ‘వివాహం వినాశనకారి’. ఇప్పుడు పారలౌకిక తండ్రి ఆర్డినెన్స్ (చట్టాన్ని) జారీ చేసారు – పిల్లలూ, ఈ కామం మహాశత్రువు, దీనిపై విజయం పొందండి, పవిత్రత యొక్క ప్రతిజ్ఞను చేయండి. ఎవ్వరూ పతితులుగా అవ్వకూడదు. జన్మ-జన్మలుగా ఈ వికారాల కారణంగా మీరు పతితులుగా అయ్యారు. అందుకే కామం మహాశత్రువని అంటారు. మీరు 84 జన్మలు ఎలా తీసుకున్నారో తండ్రి చాలా బాగా అర్థం చేయిస్తారు. ఇప్పుడు తిరిగి వెళ్ళాలి. మీలో చాలా శుద్ధ అహంకారముండాలి, ఆత్మలైన మనం తండ్రి మతాన్ని అనుసరించి భారత్ ను స్వర్గంగా తయారుచేస్తున్నాము. మళ్ళీ మనమే స్వర్గంలో రాజ్యం చేస్తాము. ఎంత శ్రమ చేస్తే అంతటి పదవిని పొందుతారు. రాజులు-రాణులుగా అవ్వండి లేక ప్రజలుగా అయినా అవ్వండి. రాజులు-రాణులుగా ఎలా అవుతారు అనేది కూడా మీరు చూస్తున్నారు. ఫాలో ఫాదర్ (తండ్రిని అనుసరించండి) అని గాయనముంది. అది ఇప్పటి విషయము. లౌకిక సంబంధాల గురించి అలా అనరు. నన్నొక్కరినే స్మృతి చేస్తే వికర్మలు వినాశనమవుతాయని తండ్రి మతాన్ని ఇస్తున్నారు. మంచి మతాన్ని అనుసరించి అనేకుల సేవ చేస్తామని మీరు భావిస్తారు. పిల్లలు తండ్రి వద్దకు వచ్చినప్పుడు శివబాబా కూడా రిఫ్రెష్ చేస్తారు, వీరు కూడా రిఫ్రెష్ చేస్తారు. వీరి కూడా నేర్చుకుంటారు కదా. శివబాబా అంటారు – నేను ఉదయాన్నే వస్తాను. తర్వాత ఎవరైనా కలుసుకునేందుకు వస్తే, ఈ బ్రహ్మా అర్థం చేయించలేరా. అంతేకానీ – బాబా, మీరే వచ్చి అర్థం చేయించండి, నేను అర్థం చేయించను అని బ్రహ్మా అంటారా ఏమిటి? ఇవి చాలా గుప్తమైన, గుహ్యమైన విషయాలు కదా. నేను అందరికంటే బాగా అర్థం చేయించగలను. శివబాబా మాత్రమే అర్థం చేయిస్తారని, ఇతను అర్థం చేయించలేరని మీరెందుకు భావిస్తారు. కల్పక్రితం కూడా ఇతను అర్థం చేయించారు కనుకనే ఈ పదవిని పొందారని కూడా మీకు తెలుసు. మమ్మా కూడా అర్థం చేయించేవారు కదా. ఆమె కూడా ఉన్నత పదవిని పొందుతారు. అక్కడ బాబాను సూక్ష్మవతనంలో చూస్తారు, కనుక పిల్లలు వారిని ఫాలో చేయాలి. పేదవారే సరెండర్ అవుతారు, షావుకారులు సరెండర్ అవ్వలేరు. బాబా, ఇదంతా మీదేనని పేదవారే చెప్తారు. శివబాబా దాత. వారు ఎప్పుడూ తీసుకోరు. ఇదంతా మీదేనని పిల్లలకు చెప్తారు. నా కోసం ఇక్కడ కానీ, అక్కడ కానీ మహళ్ళను తయారుచేసుకోను. మిమ్మల్నే స్వర్గానికి యజమానులుగా తయారుచేస్తాను. ఇప్పుడు ఈ జ్ఞాన రత్నాలతో జోలిను నింపుకోవాలి. మందిరంలోకి వెళ్ళి జోలిను నింపమని అడుగుతారు. కానీ ఏ విధంగా, ఏ వస్తువులతో జోలిను నింపుతారు? జోలిను నింపేవారు అయితే వాస్తవానికి లక్ష్మి, వారు ధనమిస్తారు. ధనం కోసం శివుని వద్దకు వెళ్ళరు. కృష్ణుడు గీతను వినిపించారని అంటారు. కానీ జోలిను నింపమని కృష్ణుడిని అడగరు. శంకరుని వద్దకు వెళ్ళి అడుగుతారు. శివుడు మరియు శంకరుడు ఒక్కరేనని భావిస్తారు. శంకరుడు జోలిను ఖాళీ చేసేవాడు. మన జోలిను ఎవ్వరూ ఖాళీ చేయలేరు. వినాశనం తప్పకుండా జరగాల్సిందే. రుద్ర జ్ఞాన యజ్ఞం నుండి వినాశ జ్వాల ప్రజ్వలితమయిందని గాయనముంది. కానీ దానిని ఎవ్వరూ అర్థం చేసుకోరు.

పిల్లలైన మీరు గృహస్థ వ్యవహారంలో కూడా ఉండాలి, వ్యాపారం కూడా చేయాలి. బాబా, ప్రతి ఒక్కరి నాడిని చూసి సలహానిస్తారు, ఎందుకంటే – నేను చెప్పింది మీరు చేయలేరు అన్నప్పుడు, ఇంకా అటువంటి సలహాను నేనెందుకు ఇవ్వాలి అని తండ్రి భావిస్తారు. నాడిని చూసే సలహాను ఇవ్వడం జరుగుతుంది. ఇతని వద్దకు రావాల్సి ఉంటుంది. వీరు సరైన సలహాను ఇస్తారు. బాబా, ఈ పరిస్థితిలో మేము ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేయాలి అని అందరూ బాబాను అడగాలి. తండ్రి స్వర్గంలోకి అయితే తీసుకువెళ్తారు. మనం స్వర్గవాసులుగా అవుతామని మీకు తెలుసు. ఇప్పుడు మనం నరకవాసులుగా ఉన్నాము. ఇప్పుడు మీరు నరకంలోనూ లేరు, స్వర్గంలోనూ లేరు. ఎవరెవరు బ్రాహ్మణులుగా అవుతారో, వారి లంగరు ఈ ఛీ-ఛీ ప్రపంచం నుండి ఎత్తివేయబడింది. ఇప్పుడు కలియుగ ప్రపంచ తీరాన్ని మీరు వదిలారు. కొందరు బ్రాహ్మణులు చురుకుగా వెళ్తున్నారు, కొందరు స్మృతి యాత్రలో బలహీనంగా ఉన్నారు, కొందరు చేతిని వదిలేస్తారు, వారు గుటకలు మింగి మునిగి మరణిస్తారు అనగా మళ్ళీ కలియుగంలోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు నావికుడు మనల్ని తీసుకువెళ్తున్నారని మీకు తెలుసు. ఆ యాత్రలు అనేక రకాలుగా ఉన్నాయి. మీ యాత్ర ఒక్కటే. ఇది పూర్తిగా అతీతమైన యాత్ర. స్మృతి తొలగించే విధంగా చాలా తుఫాన్లు వస్తాయి. ఈ స్మృతి యాత్రను మంచి రీతిలో పక్కా చేసుకోండి, శ్రమించండి. మీరు కర్మయోగులు. ఎంత వీలైతే అంత చేతులతో పని చేయండి, మనసుతో ప్రియుడిని స్మృతి చేయండి. అర్ధ కల్పం నుండి మీరు ప్రేయసులుగా అయి ప్రియుడిని స్మృతి చేస్తూ వచ్చారు. బాబా, మాకు ఇక్కడ చాలా దుఃఖముంది, ఇప్పుడు మమ్మల్ని సుఖధామానికి యజమానులుగా చేయండి. స్మృతి యాత్రలో ఉంటే మీ పాపాలు సమాప్తమైపోతాయి. మీరే స్వర్గ వారసత్వాన్ని పొందారు, ఇప్పుడు పోగొట్టుకున్నారు. భారత్ స్వర్గంగా ఉండేది, అందుకే ప్రాచీన భారత్ అని అంటారు. భారత్ ను చాలా గౌరవిస్తారు. భారత్ అన్నింటికంటే పెద్దది, అన్నింటికంటే పాతది కూడా. వినాశనం ఎదురుగా నిలబడి ఉందని మీకు తెలుసు. ఎవరైతే మంచి రీతిలో అర్థం చేసుకుంటారో, వారికి ఆంతరికంగా చాలా సంతోషముంటుంది. ప్రదర్శనీలకు ఎంత మంది వస్తారు. అహ్మదాబాద్ లో చూడండి ఎంతమంది సాధువులు-సత్పురుషులు మొదలైనవారు వచ్చారు. మీరు సత్యమే చెప్తున్నారని అంటారు. కానీ మనం తండ్రి నుండి వారసత్వం తీసుకోవాలి అనేది బుద్ధిలో కూర్చోదు. ఇక్కడ నుండి బయటకు వెళ్ళగానే సమాప్తమవుతుంది. తండ్రి మనల్ని స్వర్గంలోకి తీసుకువెళ్తారని ఇప్పుడు మీకు తెలుసు. అక్కడ గర్భజైలు కానీ, ఆ స్థూలమైన జైలు కానీ ఉండదు. తర్వాత ఎప్పుడూ జైలు ముఖం చూడాల్సిన అవసరం ఉండదు. రెండు జైళ్ళు ఉండవు. ఇక్కడ ఇదంతా మాయ యొక్క ఆర్భాటము. ఈ రోజుల్లో అన్ని పనులు చాలా త్వరగా అవుతూ ఉంటాయి. మృత్యువు కూడా చాలా త్వరగా జరుగుతూ ఉంటుంది. సత్యయుగంలో ఇటువంటి ఉపద్రవాలేవీ సంభవించవు. ఇక్కడ మృత్యువు కూడా త్వరగా సంభవిస్తుంది, కనుక దుఃఖం కూడా చాలా ఉంటుంది. అందరూ సమాప్తమైపోతారు. పూర్తి ధరణి అంతా కొత్తదిగా అవుతుంది. సత్యయుగంలో దేవీ-దేవతల రాజధాని ఉండేది. అది మళ్ళీ తయారవుతుంది. మున్ముందు ఏమి జరుతుంది అనేది చూడండి! చాలా భయంకరమైన దృశ్యాలు ఉంటాయి, వాటిని పిల్లలైన మీరు సాక్షాత్కారంలో చూసారు. పిల్లలకు ముఖ్యమైనది స్మృతి యాత్ర. ఇది ఎక్కే కళ యొక్క యాత్ర. అచ్ఛా.

మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. మేము బ్రాహ్మణులము అనేది స్మృతిలో సదా ఉండాలి. భగవంతుడు బ్రాహ్మణులైన మనల్ని మాత్రమే చదివిస్తారు. ఇప్పుడు మనం బ్రాహ్మణుల నుండి దేవతలుగా తయారవుతున్నాము.

2. జ్ఞాన రత్నాలతో జోలిను నింపుకొని దానం చేయాలి. ఈ కలియుగ పతిత ప్రపంచ తీరాన్ని వదిలేయాలి. మాయా తుఫాన్లకు భయపడకూడదు.

వరదానము:-

ఎప్పుడైతే మాస్టర్ రచయిత, మాస్టర్ నాలెడ్జ్ ఫుల్ అనే శక్తిశాలి స్థితి మరియు నషాలో స్థితులై ఉంటారో, అప్పుడు రచన యొక్క సర్వ ఆకర్షణల నుండి అతీతంగా ఉండగలరు. ఎందుకంటే ఇప్పుడు రచన ఎన్నో రకరకాల రంగులను, రూపాలను రచిస్తుంది. అందుకే ఇప్పుడు చిన్నతనములో చేసే తప్పులు, నిర్లక్ష్యంగా చేసే తప్పులు, బద్ధకంతో చేసే తప్పులు, అజాగ్రత్తగా చేసే తప్పులు ఏవైతే ఇంకా మిగిలి ఉన్నాయో – వాటిని మరచి మీ పవర్ ఫుల్ (శక్తిశాలి), శక్తి స్వరూపాన్ని, శస్త్రధారి స్వరూపాన్ని, సదా వెలుగుతున్న జ్యోతి స్వరూపాన్ని ప్రత్యక్షం చేయండి. అప్పుడు మిమ్మల్ని ‘మాస్టర్ రచయితలు’ అని అంటారు.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top
Scroll to Top