02 July 2021 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

1 July 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

“మధురమైన పిల్లలూ - ఇప్పటివరకు మీరు చెప్పుడు మాటలనుసారంగా నడుచుకుంటూ వచ్చారు. ఇప్పుడు తండ్రి మీకు డైరెక్టుగా వినిపించి, తమ సమానంగా నాలెడ్జ్ ఫుల్ గా తయారుచేస్తారు”

ప్రశ్న: -

మంచి పురుషార్థీ పిల్లల గుర్తులేమిటి మరియు వారి అవస్థకు గల గాయనమేమిటి?

జవాబు:-

మంచి పురుషార్థీ పిల్లలు – మదర్, ఫాదర్ ను పూర్తిగా అనుసరిస్తారు. తమ జీవితంపై తామే దయ చూపించుకుంటారు. పూర్తి అటెన్షన్ పెడతారు. కొద్ది సమయాన్ని అయినా తీసి తండ్రి స్మృతిలో తప్పకుండా కూర్చుంటారు. అచలమైన అవస్థ, స్థిరమైన అవస్థ అని వారి అవస్థకే గాయనముంది. వారినే మహావీరులని అంటారు.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

భోళానాథుని కన్నా అతీతమైనవారు లేరు….. (భోలేనాథ్ సే నిరాలా…..)

ఓంశాంతి. భక్తి మార్గంలో ప్రపంచం కేవలం పాడుతుంది. భక్తి మార్గంలో మీరు కూడా పాడేవారని పిల్లలైన మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు ఆ భోళానాథుడే సమ్ముఖంగా ఉన్నారు. భోళానాథుడు అనే పదం భక్తి మార్గానికి సంబంధించినది. జ్ఞాన మార్గం యొక్క పదం శివబాబా. అనాదిగా తయారై-తయారవుతున్న డ్రామా ప్లాన్ అనుసారంగా ఇప్పుడు సంగమయుగంలో తండ్రి వచ్చి మన చేత ఈ పురుషార్థం చేయించాల్సిందేనని మీరు అర్థం చేసుకున్నారు. కల్ప-కల్పము పురుషార్థం చేయిస్తూ వచ్చారు. పిల్లలైన మీరు ఎంత సమయం భక్తి చేసారు అనేది కూడా ఋజువు చేసి తెలియజేస్తారు. ఎవరైతే మొట్టమొదట భక్తి ప్రారంభించారో, వారే వచ్చి జ్ఞానాన్ని తీసుకుంటారు మరియు సూర్యవంశీయులుగా అవుతారు. సత్యయుగంలో కేవలం లక్ష్మీనారాయణులు మాత్రమే రావడం కాదు, వారి రాజ్యం కూడా ఉంటుంది కదా. దానిని దైవీ వర్ణమని అంటారు. భారత్ లో దైవీ వర్ణముండేది. ఇప్పుడు ఆసురీ వర్ణముంది. ఇది సంగమము. ఇప్పుడు ఆసురీ వర్ణం నుండి దైవీ వర్ణంలోకి వెళ్ళాలి. తప్పకుండా మహిమ చేయబడిన ఆ మహాభారత యుద్ధము కూడా ఇదే. కేవలం శివుని పేరుకు బదులుగా కృష్ణుని పేరు వేసేశారు. కేవలం గీత ఖండితమవ్వడంతో శాస్త్రాలన్నీ ఖండితమవుతాయి. ముఖ్యమైన విషయం గీతకు సంబంధించినది. గీతా పాఠశాలలు మరియు గీతా భవనాలు ఎన్ని ఉన్నాయి! గీతా పాఠశాల అనగా గీతా జ్ఞానాన్ని వినే పాఠశాల. స్వయంగా గీతను వినిపించినవారు ఇప్పుడు లేరు. ఎవరైతే ఉండి వెళ్ళిపోయారో, వారి మహిమ తర్వాత నడుస్తుంది. పిల్లలకైతే ప్రతిరోజు తండ్రి చాలా ప్రేమగా అర్థం చేయిస్తారు. బాబా ప్రేమ సాగరుడని పిల్లలకు తెలుసు. అందరికీ ప్రేమగా నేర్పిస్తారు. బాబా ఎప్పుడూ కోప్పడరు, సదా ప్రేమగా అర్థం చేయిస్తారు. పిల్లలూ, మీరు సతోప్రధానంగా ఉండేవారు, తర్వాత పునర్జన్మలు తీసుకుంటూ వచ్చారు. వాస్తవానికి భారతవాసులైన మీరే దేవీ దేవతా ధర్మానికి చెందినవారని కూడా తెలియజేస్తారు. మొట్టమొదటగా వారసత్వాన్ని తీసుకోవడానికి ఎవరు వస్తారు? ఎవరైతే కల్పక్రితం తీసుకున్నారో వారే వస్తారు, వారే అంటారు – బాబా, మీరు తప్ప మాకు సహాయకులు ఇంకెవరూ లేరు అని. సంగమయుగంలోనే తండ్రి క్షమిస్తారు కూడా. రావణ రాజ్యం మరియు రామ రాజ్యం ఇక్కడే ఉంటాయని పిల్లలకు తెలుసు. ఇది రావణ రాజ్యం కావుననే రామ రాజ్యాన్ని కోరుకుంటారు. మీరు శివబాబా అని అన్నప్పుడు బుద్ధి నిరాకారుని వైపుకే వెళ్తుంది. నిరాకారుడే గుర్తుకొస్తారు. ఆత్మయే తండ్రిని పిలుస్తుంది. పరమాత్మ కూర్చొని వింటారనేమీ కాదు. తండ్రి అర్థం చేయిస్తారు – డ్రామా ప్లాన్ అనుసారంగా పతితులను పావనంగా చేసేందుకు నేను శరీరంలోకి వస్తాను, అంతేకాని మీ పిలుపులు విని వస్తానని కాదు. భక్తి పూర్తయినప్పుడు నేను రావాల్సిందే. ఇవి అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఆ సమయం వస్తుంది, అప్పుడు పిల్లలు పిలవడం ప్రారంభిస్తారు. వారు ఎప్పుడు వస్తారు అనేది ఎక్కడా రాయబడిలేదు. వారు కల్పం ఆయువును తప్పుగా రాసేశారు. ఈ చిత్రాలు ప్రతి ఇంట్లో ఉండాలి. వాటిని రోజూ చూస్తూ, వీరు బాబా, వీరు దాదా, ఇది వారసత్వం అని గుర్తు చేసుకోవాలి. తండ్రి అంటారు – పిల్లలూ, సతోప్రధానంగా అయ్యేందుకు నన్ను స్మృతి చేసినట్లయితే మాలిన్యం తొలగిపోతుంది. ఈ యుక్తిని తండ్రియే అర్థం చేయిస్తారు. నేను కూడా పురుషార్థం చేస్తాను అని ఈ తండ్రి కూడా అంటారు. పిల్లలు ఒకరినొకరు సావధానపరచుకుంటూ ఉన్నతిని పొందాలి. ఈ చిత్రాల వివరణ చాలా బాగుంది. శివబాబా బ్రహ్మా ద్వారా స్థాపన చేస్తున్నారు. మహాభారీ మహాభారత యుద్ధం ఎదురుగా నిలబడి ఉంది. ఈ అనేక ధర్మాలన్నీ వినాశనమవుతాయి, దాని కోసం యుద్ధం తప్పకుండా కావాలి. పిల్లలు ఈ విషయాలను మర్చిపోకూడదు. తప్పకుండా ఇప్పుడు కలియుగము ఘోర అంధకారములో ఉంది. ఎంతమంది మనుష్యులున్నారు, తప్పకుండా వినాశనం జరగాల్సిందే. సత్యయుగంలో ఒకే ధర్మముంటుంది. తప్పకుండా 84 జన్మల చక్రంలో కూడా వారే తిరిగారు. ఇది సహజము. ఇకపోతే, ఈ మిగిలిన ధర్మాలన్నింటి వినాశనం తప్పకుండా జరుగుతుంది. ఏక ధర్మ స్థాపన తప్పకుండా జరుగుతూ ఉంది. సర్వుల సద్గతిదాత తండ్రి. తండ్రి నుండే పిల్లలకు వారసత్వం లభిస్తుంది. మేము ఏ చదువునైతే చదువుకుంటున్నామో, అది భవిష్య 21 జన్మల కోసం చదువుకుంటున్నామని పిల్లలకు తెలుసు. భగవానువాచ – నేను మిమ్మల్ని చదివించి 21 జన్మల కోసం స్వర్గానికి యజమానులుగా తయారుచేస్తాను. సూర్యవంశం, చంద్రవంశం తప్పకుండా స్థాపన అవుతున్నాయి. ఎవరెంత పురుషార్థం చేస్తారో, అంత ఉన్నత పదవిని పొందుతారు, కావున ఈ తల్లిదండ్రులను ఫాలో చేయండి అని శివబాబా అంటారు. వీరిని మీరు సూక్ష్మవతనం, వైకుంఠంలో కూడా చూస్తారు. మేము కూడా మహారాజు-మహారాణులుగా అవుతామని స్వయాన్ని కూడా చూసుకుంటారు. వైకుంఠ సాక్షాత్కారం కూడా జరుగుతుంది. తప్పకుండా భారత్ వైకుంఠంగా ఉండేదని, శ్రీకృష్ణపురిగా ఉండేదని కూడా నమ్ముతారు. నేడు కంసపురిగా ఉంది, రేపు కృష్ణపురిగా ఉంటుంది. రాత్రి పరివర్తనై పగలుగా అవ్వనున్నది. అర్ధకల్పం అనంతమైన పగలు మరియు అర్ధకల్పం అనంతమైన రాత్రి. అంధకారంలో ఎదురుదెబ్బలే తింటూ ఉంటారు. బ్రహ్మా రాత్రి అనగా బ్రాహ్మణుల రాత్రి. తర్వాత మీరు బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతారు. సత్యయుగంలో బ్రాహ్మణులు ఉండరు, దేవతలు ఉంటారు.

భారత్ పవిత్ర రాజస్థాన్ గా ఉండేది, తర్వాత అపవిత్ర రాజస్థాన్ గా తయారయ్యిందని కూడా పిల్లలకు తెలుసు. భారత్ సదా రాజస్థాన్ గానే ఉన్నది. ఇక్కడ రాజ్యమనేది కొనసాగుతూనే వస్తుంది, మిగిలిన ధర్మాల వారి రాజ్యం ప్రారంభం నుండే ఉండదు. భగవంతుడే రాజ్యాన్ని స్థాపన చేస్తారు. భగవంతుడే వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు. వారు నిరాకారుడు, జ్ఞాన సాగరుడు, సుఖ సాగరుడు…… బాబా నుండి మనకు వారసత్వం లభిస్తుందని మీకు తెలుసు. తప్పకుండా మన పురుషార్థంలోనే ఆలస్యం జరుగుతుంది. ఎవరెంత పురుషార్థం చేస్తారో, అంతగా మార్గాన్ని తెలియజేస్తారు. బాబా అంటారు – తండ్రినైన నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పతితం నుండి పావనంగా అయి పావన ప్రపంచానికి యజమానులుగా అవుతారు. ఇది ఎంత సహజము. ఒకవేళ లౌకిక తల్లిదండ్రులు జ్ఞానంలో ఉంటే పిల్లలను కూడా తమ సమానంగా తయారుచేయవలసి ఉంటుంది. తల్లిదండ్రులు సత్యమైన సంపాదనను చేసుకుంటున్నారంటే పిల్లల చేత కూడా సత్యమైన సంపాదనను చేయించాలి. కొందరు పిల్లలు మంచిగా ఉంటారు. మేము ఆత్మిక చదువును చదువుకుని, ఇంటింటికి ఈ సందేశాన్ని ఇస్తూ ఉంటామని అంటారు. సందేశకుడిని మరియు మెసెంజర్ ను నేను, ఇంటికి వెళ్ళాలనే మెసేజ్ ను మీకు ఇస్తానని తండ్రి కూడా అంటారు. వేరే ధర్మ స్థాపకులు వచ్చి కేవలం తమ-తమ ధర్మాలను స్థాపన చేస్తారు. ఇప్పుడు తిరిగి వెళ్ళాలనే సందేశాన్ని నేను అందరికీ ఇస్తాను. ఇప్పుడీ ప్రపంచం నివసించేందుకు యోగ్యంగా లేదు. నన్ను స్మృతి చేసినట్లయితే పావనంగా అవుతారు. మీరు పావనంగా ఉండేవారు, తర్వాత రావణుడు పతితంగా తయారుచేశాడు. నేను మళ్ళీ పావనంగా చేయడానికి వచ్చాను. ఇక కొద్ది సమయంలోనే ఈ బాంబులు మొదలైనవి పడినప్పుడు, ఇది అదే మహాభారత యుద్ధమని అర్థం చేసుకుంటారు. కావున తప్పకుండా భగవంతుడు కూడా ఉంటారు. కానీ వారు గీతా భగవంతుడు కృష్ణుడని భావిస్తారు. ఇది ఎంత పెద్ద తికమక. తికమకపడి ఉండకపోతే భగవంతుడికి రావాల్సిన అవసరమేముంది. భక్తి మార్గాన్ని భూల్-భులయ్యా (తికమక దారుల) ఆట అని అనడం జరుగుతుంది. నన్ను స్మృతి చేసినట్లయితే అన్ని పొరపాట్లు సమాప్తమైపోతాయని ఇప్పుడు తండ్రి అంటారు. ఇంతకుముందు స్వయాన్ని దేహమని భావించేవారు. ఇప్పుడు స్వయాన్ని దేహీగా భావిస్తున్నారు. పిల్లలూ, దేహీ-అభిమానులుగా అవ్వండి అనే అటెన్షన్ ను తండ్రియే ఇప్పిస్తారు. ఇక్కడ మీరు తండ్రి సమ్ముఖంలో కూర్చొన్నారు. అక్కడ సెంటర్లలో కుమార్తెలు కూర్చొని, శివబాబా ఇలా అంటారని అర్థం చేయిస్తారు. ఇక్కడ, నేను కూర్చొని ఆత్మలతో మాట్లాడతాను అని డైరెక్టుగా తండ్రి అంటారు. బాబా వీరి ద్వారా మనకు అర్థం చేయిస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు. ఇది పెద్ద కళ్యాణకారి మేళా. నన్ను నిరంతరం స్మృతి చేయండి అని తండ్రి అంటారు. బాబా నుండి మనం స్వర్గ వారసత్వాన్ని తీసుకోవాలి. తండ్రిని మరియు స్వర్గాన్ని స్మృతి చేయాలి. ఎలాంటి వికర్మలు చేయకూడదు. ఒకవేళ వికర్మలు చేసినట్లయితే, అవి 100 రెట్లు అయిపోతాయి. వికర్మలు చేయించేది మాయ, దానిపై విజయం పొందాలి, అందుకే మహావీరుడైన హనుమంతుని కథ ఉంది. మీరు మహావీరులైన హనుమంతులు కదా. మనమైతే బాబాకు చెందినవారిగా అయిపోయాము. మనం మాయతో ఓడిపోలేము. కావున, తండ్రిని స్మృతి చేస్తూ-చేస్తూ సతోప్రధానంగా, వికర్మాజీతులుగా అవుతాము. అలా అవ్వకపోతే మన పదవిని పోగొట్టుకుంటాము. పురుషార్థీ పిల్లలు ఎవరైతే ఉంటారో, వారు తమ జీవితంపై దయ చూపించుకుంటారు. ఏమి జరిగినా సరే, స్మృతి యాత్రలో ఉంటారు, అచంచలంగా, స్థిరంగా ఉంటారు. వినాశనమైతే జరగాల్సిందే. అందరి పెదనాన్నలు, చిన్నాన్నలు, మామయ్యలు, గురువులు, సాధువులు మొదలైనవారంతా సమాప్తమైపోతారు. నేను మిమ్మల్ని నాతో పాటు తీసుకువెళ్తానని సద్గురువు అంటారు. మనుష్యులు పూర్తి అంధకారంలో ఉన్నారు, శివబాబా మనల్ని తమతో పాటు తీసుకువెళ్తారని మీకు తెలుసు. మృత్యువు కబళించిందని అంటారు కదా. కానీ నేను మిమ్మల్ని శాంతిధామానికి తీసుకువెళ్తాను. ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్ళిపోతుంది. మృత్యువు తీసుకువెళ్ళదు, ఆత్మ వదిలి వెళ్ళాల్సి ఉంటుంది. మిమ్మల్ని తిరిగి తీసుకువెళ్ళేందుకు ఇప్పుడు నేను స్వయంగా వచ్చాను. బాబా ఏమైనా హతమార్చడానికి వచ్చారా? లేదు. మీరు పాత శరీరాన్ని వదలాలి. ఆత్మ తమోప్రధానం నుండి సతోప్రధానంగా అవ్వాలి. ఇప్పుడు 5 తత్వాలు కూడా తమోప్రధానంగా ఉన్నాయి, కావున శరీరాలు కూడా అదే విధంగా తయారవుతాయి. అక్కడ సతోప్రధాన తత్వాలతో మీ శరీరాలు కూడా సుందరంగా తయారవుతాయి. తండ్రి అంటారు – నేను మళ్ళీ సత్యయుగ ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తాను. మీరే 84 జన్మలను అనుభవించారు. మీరు మీ ధర్మాన్ని మర్చిపోయారు, మిగిలిన వారెవరూ తమ ధర్మాన్ని మర్చిపోలేదు. వాస్తవానికి దేవీ దేవతా ధర్మానికి చెందిన మనము అంత ఉన్నతమైనవారి నుండి ఇంత నీచమైనవారిగా ఎలా అయ్యామని ఇప్పుడు మీకు తెలుసు. కల్ప-కల్పము తండ్రి కూర్చొని మీకే అర్థం చేయిస్తారు. మీరు ఇతరులకు అర్థం చేయిస్తూ ఉంటారు. ఇప్పుడు 84 జన్మల చక్రం పూర్తవుతుంది, వినాశనం ఎదురుగా నిలబడి ఉంది. స్వర్గానికి యజమానులుగా అయ్యేందుకు స్వయాన్ని యోగ్యులుగా తయారుచేసుకోవాలి. స్మృతి ద్వారానే యోగ్యులుగా తయారవ్వాలి. ఉదయాన్నే లేచి తండ్రిని స్మృతి చేయండి. బాబా, మీరు ఎలా వస్తారు, ఇది ఎంత అద్భుతము. గీతలో కృష్ణుని పేరు వేసేశారు కానీ నేను సమ్ముఖంగా మాట్లాడుతున్నానని ఇప్పుడు మీకు తెలుసు. అవన్నీ భక్తి మార్గంలో చెప్పిన విషయాలు. ఇప్పుడు ఆత్మలైన మాకు తండ్రి అయిన మీరు లభించారు, ఆత్మకు తండ్రి లభించినప్పుడు ఆ ప్రేమలో వచ్చి కలుసుకుంటారు. పిల్లలు తండ్రిని చాలా ప్రేమగా కలుస్తారు. ఇక్కడ ఆ నిరాకార తండ్రి గుప్తంగా ఉన్నారు, కావున వీరిని కలిసినప్పుడు శివబాబాను స్మృతి చేస్తూ కలవండి అని బాబా ఎప్పుడూ చెప్తూ ఉంటారు. మనుష్యులకు ఏమీ తెలియదు. మీలో కూడా ఎవరికైతే తెలుసో, వారు నా వారిగా అయ్యి మళ్ళీ మర్చిపోతారు. దేహాభిమానంలోకి వచ్చేస్తారు. బాబా, నేను మీ వాడిగా అయిపోయాను అని ప్రతిజ్ఞ కూడా చేస్తారు. మేల్ అయినా, ఫిమేల్ అయినా, ఇరువురి ఆత్మ అంటుంది. కానీ శరీరంలో ఉన్నప్పుడు – మీ వాడిగా అయ్యానని పురుషుడు అంటాడు, మీ దానిగా అయ్యానని స్త్రీ అంటుంది. బాబా, మేము మీ నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకుంటాము, పూర్తిగా స్మృతి చేస్తాము అని అంటారు. స్మృతి లేకుండా తుప్పు వదలదు, తమోప్రధానం నుండి సతోప్రధానంగా అవ్వలేరు. సత్యయుగంలో మీకు అఖండమైన, స్థిరమైన, సుఖ-శాంతులు, సంపత్తి కల రాజ్యం 21 జన్మలకు లభిస్తుంది. స్వర్గ రచయిత అయిన తండ్రి తప్పకుండా తమ వారసత్వాన్ని ఇస్తారు. దూరంగా బ్రహ్మా తత్వంలో నివసించే పరమపిత పరమాత్ముని కోసం చింత ఉండేదని గాయనము కూడా చేస్తారు. వారు ఒక్కసారి మాత్రమే వస్తారు. ఇవి కూడా అర్థం చేసుకోవాల్సిన విషయాలు కదా. చాలా మంది అర్థమే చేసుకోరు, మున్ముందు కొద్దిగా పెద్ద యుద్ధము మొదలైనప్పుడు కళ్ళు తెరుచుకుంటాయి. వాస్తవానికి ఈ యజ్ఞం రచించబడింది. ఇది యుద్ధం కూడా. ఈ యజ్ఞం గురించి ఎవరికీ తెలియదు. రుద్ర జ్ఞాన యజ్ఞాన్ని వినాశనం కోసమే రచించడం జరిగింది. మనుష్యులేమో వినాశనం జరగకూడదు, శాంతి ఏర్పడాలని యజ్ఞాన్ని రచిస్తారు. ఈ యజ్ఞాన్ని మళ్ళీ రచిస్తారు. వినాశనమైన తర్వాత ఏమి జరుగుతుందనేది వారికి తెలియదు. ఇప్పుడు పిల్లలైన మీకు మొత్తం విశ్వం యొక్క ఆదిమధ్యాంతాల గురించి తెలుసు. అందరి అనంతమైన జన్మ కథ గురించి తెలుసు. పరమపిత పరమాత్ముని జీవిత కథను మేము చెప్తామని అనేవారు ఎవరూ లేరు. అందరూ పరమాత్మనే పిలుస్తారు కదా. పదే-పదే స్మృతి చేస్తారు. భగవంతుడు ఈ బిడ్డను ఇచ్చారు, ఇది చేశారు అని అంటారు కదా. ఇది ఎవరి వస్తువో, వారే తీసుకున్నారని కొందరు భావిస్తారు. ఇలాంటి వివేకవంతులైన వ్యక్తులు కూడా కొందరు ఉంటారు. అనేక రకాల మనుష్యులున్నారు. ఇప్పుడు మీకు తండ్రి లభించారు కావున వారినే స్మృతి చేయాలి. స్మృతితోనే సంపాదన జరుగుతుంది. మీరు విష్ణుపురికి యజమానులుగా అవుతారు. మీరు సత్యయుగం నుండి మొదలుకొని కలియుగ అంతిమం వరకు పూర్తి చక్రాన్ని తెలుసుకున్నారు. తండ్రి బుద్ధిలో ఎలాగైతే ఉందో, మీ బుద్ధిలో కూడా అలాగే ఉంది, అందుకే వారిని జ్ఞానసాగరుడు, నాలెడ్జ్ ఫుల్ అని అంటారు. ఇప్పుడు మీరు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నారు. పిల్లలైన మీరు అచంచలంగా, స్థిరంగా ఉండాలి. మాయ పదే-పదే వచ్చి కదిలించకూడదు. ముట్టుకుంటే ముడుచుకుపోయేవారిగా అవ్వకూడదు. తండ్రిని స్మృతి చేయకపోతే వాడిపోతారు. తండ్రిని స్మృతి చేసే పురుషార్థం మీరు చేస్తున్నారు. సమయం సమీపంగా వచ్చినప్పుడు, ఇక మా పురుషార్థం పూర్తయ్యింది, అంతిమ సమయం వచ్చేసిందని మీరు గమనిస్తారు. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఆత్మిక చదువు చదువుకుని, సత్యమైన సంపాదనను చేసుకోవాలి మరియు చేయించాలి. ఇంటికి వెళ్ళాలనే సందేశాన్ని అందరికీ ఇవ్వాలి. ఇప్పుడు ఎటువంటి వికర్మలు చేయకూడదు.

2. ఉదయాన్నే లేచి తండ్రిని ప్రేమగా స్మృతి చేయాలి. చిన్న-చిన్న విషయాలలో ముట్టుకుంటే ముడుచుకుపోయేవారిగా అవ్వకూడదు. అవస్థను అచంచలంగా, స్థిరంగా తయారుచేసుకోవాలి.

వరదానము:-

ఏ సంకల్పం చేసినా, ఏ మాట మాట్లాడినా, ఏ కర్మ చేసినా, సంబంధ-సంపర్కంలోకి వచ్చినా, ఇది తండ్రి సమానంగా ఉందా అని చెక్ చేసుకోండి. ముందు సమానంగా చేసుకోండి, తర్వాత ఆచరణలోకి తీసుకురండి. ఎలాగైతే స్థూలంలో కూడా చాలా మందికి ముందు చెక్ చేసుకున్న తర్వాత స్వీకరించే సంస్కారముంటుంది. అదే విధంగా, మీరు మహాన్ పవిత్ర ఆత్మలు కావున చెక్ చేసుకునే మెషినరీని వేగవంతం చేయండి. దీనిని మీ నిజ సంస్కారంగా చేసుకోండి – ఇదే అన్నింటికన్నా గొప్ప మహానత.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top