02 December 2021 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

December 1, 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

“మధురమైన పిల్లలూ - ఆత్మాభిమానులుగా అయ్యే అభ్యాసం చేయండి. ఎంతగా ఆత్మాభిమానులుగా అవుతారో అంతగా తండ్రి పట్ల ప్రేమ ఉంటుంది”

ప్రశ్న: -

దేహీ-అభిమానులుగా ఉన్న పిల్లలలో ఏ తెలివి సహజంగానే వచ్చేస్తుంది?

జవాబు:-

తమకంటే పెద్దవారికి గౌరవం ఎలా ఇవ్వాలి అన్న తెలివి దేహీ-అభిమానులుగా ఉన్న పిల్లలలో వచ్చేస్తుంది. అభిమానం పూర్తిగా శవం వలె చేసేస్తుంది. తండ్రిని స్మృతియే చేయలేరు. ఒకవేళ దేహీ-అభిమానులుగా ఉన్నట్లయితే చాలా సంతోషముంటుంది, ధారణ కూడా బాగుంటుంది. వికర్మలు కూడా వినాశనమవుతాయి మరియు పెద్దలకు గౌరవం కూడా ఇస్తారు. ఎవరైతే సత్యమైన మనసు కలవారుంటారో, వారు మేము ఎంత సమయం దేహీ-అభిమానిగా ఉంటూ తండ్రిని స్మృతి చేస్తున్నాము అన్నది అర్థం చేసుకుంటారు.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

వారు మా నుండి విడిపోరు..

ఓంశాంతి. ఇది ఎవరన్నారు? ఆత్మయే అంటుంది, ఎందుకంటే ఇప్పుడు పిల్లలైన మీరు డ్రామానుసారంగా ఆత్మాభిమానులుగా అవుతున్నారు. అర్ధకల్పం దేహాభిమానులుగా అయ్యారు. అర్ధకల్పం మీరు మళ్ళీ ఆత్మాభిమానులుగా అవుతారు. ఇప్పుడు మీరు ఆత్మాభిమానులుగా అయ్యే అభ్యాసం చేయవలసి ఉంటుంది. బాబా పదే-పదే చెప్తారు – పిల్లలూ, అశరీరి భవ, ఆత్మాభిమానీ భవ. పిల్లలైన మీరు ఎదురుగా కూర్చొన్నారు మరియు వారు దూరంగా కూర్చొన్నారు. మేము ఆత్మాభిమానులుగా అయి తండ్రిని స్మృతి చేయాలని మీకు తెలుసు. బాబా శ్రీమతాన్నే అనుసరించాలి. దీనిని శ్రేష్ఠాతి శ్రేష్ఠమైన మతం అని అంటారు. తండ్రి పట్ల చాలా ప్రేమ ఉండాలి. ఇప్పుడు తండ్రి అంటారు – దేహ సహితంగా దేహం యొక్క సంబంధాలన్నింటినీ విడిచిపెట్టండి. ఆత్మాభిమానులుగా అవ్వడానికి చాలా-చాలా అభ్యాసం చేయాలి. శరీరమైతే వినాశనం అయ్యేదే ఉంది. ఆత్మ అవినాశీ. వినాశీ శరీరాన్ని స్మృతి చేసిన కారణంగా ఆత్మను మర్చిపోయారు. ఆత్మ అంటే ఏమిటి అనేది కూడా పిల్లలకు అర్థం చేయించడం జరుగుతుంది. ఆత్మ చిన్న నక్షత్రం వలె ఉంటుందని అంటారు కూడా. ఈ కళ్ళ ద్వారా దానిని చూడలేము, ఆత్మను దివ్యదృష్టి లేకుండా చూడలేము. ఆత్మను చూడడానికి చాలా ప్రయత్నిస్తారు కానీ చూడలేరు. కొందరు దివ్యదృష్టితో చూసినా కూడా, అది ఏమిటి అన్నది వారు అర్థం చేసుకోలేరు. ఆత్మ పెద్ద వస్తువు కానే కాదు. చాలా చిన్న నక్షత్రం వలె ఉంటుంది, ఎంత చిన్న బిందువు. ఈ విషయాలు ఎవరి బుద్ధిలోనైనా కూర్చోవడం చాలా కష్టము ఎందుకంటే అర్ధకల్పం నుండి దేహాభిమానంలో ఉన్నారు.

తండ్రి అర్థం చేయిస్తారు – మీరు స్వయాన్ని ఆత్మ అని నిశ్చయం చేసుకోండి. ఆత్మలైన మనం అక్కడ నివసించేవారము. ఈ శరీరాలనైతే ఇక్కడే తీసుకోవాలి. ఈ శరీరం పంచ తత్వాలతో తయారుచేయబడింది. పిండం (శరీరం) తయారైనప్పుడు చిన్నదైన ఆత్మ అందులో ప్రవేశిస్తుంది, అప్పుడు చైతన్యం వస్తుంది. ఆత్మ కూడా సత్యమైనది, చైతన్యమైనది. అలాగే పరమపిత పరమాత్మ కూడా సత్యమైనవారు, చైతన్యమైనవారు. వారు పరమ ఆత్మ. వారు పెద్ద వస్తువేమీ కాదు. ఆత్మ కూడా చిన్నదే. ఎలాగైతే వీరిలో జ్ఞానముందో, అలాగే మీ ఆత్మలో కూడా జ్ఞానముంది. ఇంత చిన్న ఆత్మలో జ్ఞానమంతా ఉంది, ఇది గొప్ప అద్భుతము. కానీ పిల్లలు ఈ విషయాలను పదే-పదే మర్చిపోతారు. దేహాభిమానంలోకి వచ్చేస్తారు. ఇప్పుడు ఆత్మలైన మీరు ఈ శరీరాల ద్వారా విశ్వానికి యజమానులుగా అవుతారు అనగా గాడ్-గాడెస్ (భగవాన్-భగవతి)గా అవుతారు. తండ్రి అయితే గాడ్ ఫాదర్ కానీ భారత్ లో ఈ లక్ష్మీ-నారాయణులను గాడ్-గాడెస్ అని అంటారు, ఎందుకంటే వీరిని ఇంత ఉన్నతంగా తండ్రి తయారుచేస్తారు. ఈ జ్ఞానం ద్వారా చూడండి ఎలా తయారైపోతారు. ఎవరైతే మంచి రీతిగా చదువును చదువుకుంటారో, పరీక్షలో పాస్ అవుతారో, వారు సంపాదన కూడా మంచిగా చేసుకుంటారు. ఉదాహరణకు ప్రపంచంలో ఎవరైనా చాలా అందంగా ఉంటే, వారికి చాలా బహుమతులు లభిస్తాయి. వారిని మిస్ ఇండియా, మిస్ అమెరికా… అని అంటారు. శరీరం కోసం వారు ఎంతగా శ్రమ చేస్తారు. సత్యయుగంలోనైతే సహజ సౌందర్యం ఉంటుంది, ఆకర్షించేదిగా ఉంటుంది. సతోప్రధాన ప్రకృతితో శరీరం తయారవుతుంది కదా, వారు ఎంతగా ఆకర్షిస్తారు. లక్ష్మీ-నారాయణులు, రాధా-కృష్ణుల చిత్రాలు అందరినీ ఎంతగా ఆకర్షిస్తాయి! అవి కూడా ఏమీ ఏక్యురేట్ (ఖచ్ఛితమైన) చిత్రాలు తయారవ్వవు. అక్కడ వారు ఉండడమే సతోప్రధానంగా ఉంటారు కనుక సహజ సౌందర్యముంటుంది. ఇవన్నీ బాబా అర్థం చేయిస్తారు. వారు ఓ పతితపావనా… అని పాడుతారు. కానీ ఏమీ అర్థం చేసుకోరు. పిలవడం కూడా తెలివిహీనుల వలె పిలుస్తారు – ఓ భగవంతుడా దయ చూపించండి, కరుణ చూపించండి. కానీ భగవంతుడు ఏమిటి అన్నది కొంచెం కూడా తెలియదు. తండ్రి గురించి తెలుసుకుంటే రచన గురించి కూడా తెలుసుకుంటారు. అందుకే ఋషులు, మునులు మొదలైనవారందరూ నేతి-నేతి (తెలియదు-తెలియదు) అంటారు. ఇది పూర్తిగా సత్యము. రచయిత మరియు రచనల గురించి ఎవ్వరికీ తెలియదు. ఒకవేళ తెలుసుకున్నట్లయితే విశ్వానికి యజమానులుగా అవుతారు.

ఈ లక్ష్మీ-నారాయణులను కూడా ఆ విధంగా తయారుచేసేవారు తండ్రియేనని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మీరు తండ్రి సమ్ముఖంగా కూర్చొన్నారు కానీ అర్ధకల్పం దేహాభిమానంలో ఉన్న కారణంగా అంతటి గౌరవాన్ని ఇవ్వలేరు. ఆత్మాభిమానులుగా అసలు అవ్వడం లేదు. దేహీ-అభిమానులుగా అవ్వడం వలన రోజు-రోజుకు మీ గౌరవం పెరుగుతూ ఉంటుంది. పూర్తి దేహీ-అభిమానులుగా అయినప్పుడు గౌరవం కూడా ఇస్తారు. అవస్థ కూడా బాగవుతూ ఉంటుంది, సంతోషం కూడా ఉంటుంది. నంబరువారుగా అయితే ఉంటారు కదా. ఎలాగైతే తండ్రి మీకు అర్థం చేయిస్తారో, మీరు కూడా ఇతరులకు యుక్తిని తెలియజేయండి – స్వయాన్ని ఆత్మగా భావించండి అని. ఇప్పుడు మీ 84 జన్మల చక్రం పూర్తయ్యింది, ఇప్పుడు తిరిగి వెళ్ళాలి. ఆత్మలైన మనం ఇంటి నుండి ఇక్కడకు వచ్చి శరీరాలను ధారణ చేసి పాత్రను అభినయిస్తున్నాము. ఇక్కడ ఎన్ని జన్మలు తీసుకున్నాము అన్న జ్ఞానం కూడా బుద్ధిలో ఉంది. దేహీ-అభిమానులుగా అవ్వడంలోనే శ్రమ ఉంది. పదే-పదే మాయ దేహాభిమానులుగా చేసేస్తుంది. ఇప్పుడు మీరు మాయపై విజయాన్ని పొంది దేహీ-అభిమానులుగా అవ్వాలి. నేను ఆత్మను అని ఏకాంతంలో కూర్చుని ఆలోచించండి. నన్నొక్కడినే స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయని తండ్రి చెప్పారు. ఈ దేహం పట్ల మోహం ఉంచుకోకండి. ఆత్మనైన నేను అవినాశీ, సోదరులతో కూడా బుద్ధియోగాన్ని జోడించకూడదు. సోదరునికి సోదరుని నుండి వారసత్వం లభించదు. ఏ ఆత్మను గానీ, ఏ సోదరుని శరీరాన్ని గానీ గుర్తు చేయకూడదు. స్మృతి ఒక్క తండ్రిని మాత్రమే చేయాలి. వారసత్వం కూడా తండ్రి నుండే లభిస్తుంది. ఆత్మనైన నేను ఇప్పుడు ఇంటికి వెళ్తాను, తర్వాత సత్యయుగంలోకి వచ్చి రాజ్య భాగ్యాన్ని తీసుకుంటాను. అక్కడ ఆత్మాభిమానులుగా ఉంటారు, ఇక్కడ మాయ రావణుడు దేహాభిమానులుగా చేస్తాడు. ఇప్పుడు మీరు మళ్ళీ ఆత్మాభిమానులుగా అయ్యే పురుషార్థం చేస్తున్నారు. తమ కళ్యాణం చేసుకుంటూ ఉండండి. ఇక్కడ చిత్రాల ఎదురుగా వచ్చి కూర్చోండి. ఎలాగైతే మిలట్రీ వారికి ఫీల్డ్ లో ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది కదా. అలాగే, ఇప్పుడు మీరు ఆత్మాభిమానులుగా అయి బాబాను స్మృతి చేసే ప్రాక్టీస్ చేయాలి. తండ్రి అంటారు – మీరు నా పిల్లలు కదా, దేహాభిమానులుగా అవ్వడంతో మీరు మాయకు చెందినవారిగా అయిపోయారు. ఓ పతిత-పావనా, ఓ జ్ఞాన సాగరా… అని పిలుస్తారు కూడా. మిగిలినవారంతా భక్తి సాగరులు. భక్తి మార్గం ఎంత విస్తారంగా ఉంది. తండ్రి అసత్య ప్రపంచంలోకి వస్తారు, అది కూడా సాధారణ రూపంలో వస్తారు. డ్రామాలో ఈ విధంగానే నిశ్చయించబడి ఉంది. పతిత శరీరంలోనే తండ్రి వస్తారు. లక్ష్మీ-నారాయణుల శరీరాలలోకి రారు. వారికైతే రాజ్య భాగ్యం లభించి ఉంది. మరి, నేను వారిలోకి ఎలా వస్తాను, నన్ను సాధారణ రూపంలో గుర్తించరు. పిలుస్తారు కానీ వారు తప్పకుండా ఏదో ఒక శరీరంలోకి వస్తారు అన్నది అర్థం చేసుకోరు. నా రూపమైతే నిరాకార బిందువు. కనుక తప్పకుండా ప్రజాపిత బ్రహ్మా తనువులోకే వస్తాను. ప్రజాపిత అయితే తప్పకుండా ఇక్కడే ఉండాలి, వారికి తప్పకుండా పాత తనువే ఉంటుంది. ఈ బ్రహ్మా పాత వారు (వృద్ధుడు) మరియు ప్రక్కన కొత్తవారైన విష్ణువు నిలబడి ఉన్నారు. త్రిమూర్తి చిత్రంలో ఎంత జ్ఞానం ఉంది.

పిల్లలైన మీరు ఇంతకుముందు ఈ దేవతలను పిలిచేవారు. శ్రీ నారాయణుడిని ఎంతగా గౌరవించేవారు. ఇది అద్భుతం కదా. మేము స్వయంగా నారాయణుడిని ఎంతగానో ప్రేమించేవారము. శ్రీ నారాయణుడు వచ్చారు వారికి తినిపించండి, తాగించండి…. లోలోపల అర్థం చేసుకుంటాము – ఇప్పుడు మేమే అలా తయారవుతున్నాము అని. ఎవరైతే తయారయ్యారో వారిని తప్పకుండా గౌరవిస్తారు అంటే మనల్ని మనమే గౌరవించుకుంటున్నట్లు. బాబా కూడా మిమ్మల్ని మీరు గౌరవించుకుంటున్నారని అనేవారు. పిల్లలైన మీరు చూసారు కదా – ఇవి చాలా అద్భుతమైన విషయాలు. వీటిని ఇతరులెవ్వరూ అర్థం చేయించలేరు. మీరు మాత్రమే అర్థం చేయించగలరు. ఇది పూర్తిగా కొత్త జ్ఞానము.

తండ్రి అంటారు – నేను మళ్ళీ దేవీ-దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తాను. ఆదిలో దేవీ-దేవతల రాజ్యమే ఉంటుంది. మధ్యలో రావణ రాజ్యముంటుంది. ఇప్పుడిది అంతిమము. అంతిమంలో తండ్రి స్వయంగా వస్తారు. ఇప్పుడు పిల్లలూ, మీరు ఆదిమధ్యాంతాలను తెలుసుకున్నారు. ఇప్పుడు ఇంకా కొద్ది సమయంలో ఏమేమి జరగనున్నది. వినాశనం కూడా తప్పకుండా జరుగుతుంది. మహాభారత యుద్ధం జరిగింది, ఇప్పుడు మళ్ళీ జరుగుతుందని అంటారు. ఈ సమయంలో ఇది ఎవ్వరికీ తెలియదు. పతిత-పావనుడు ఒక్క తండ్రి మాత్రమే, వారు వచ్చారు అంటే ఇంకా ఎంత సమయం మిగిలి ఉంటుంది. శ్రీకృష్ణుడైతే పతిత-పావనుడు కాలేరు, వారైతే సత్యయుగంలో ఒక్క జన్మ కృష్ణుని పేరుతో తీసుకున్నారు. తర్వాత వారి నామ రూపాలు మారిపోతాయి. శరీరం యొక్క నిర్మాణమే మారిపోతుంది. తండ్రి అర్థం చేయించారు – మీరే పూజ్యులుగా ఉండేవారు, మళ్ళీ మీరే పూజారులుగా అయ్యారు. 84 జన్మలు ఎలా తీసుకున్నారు – ఇది కూడా తండ్రి అర్థం చేయించారు. మరియు అంటారు – అర్ధకల్పం మీరు దేహాభిమానంలో ఉన్నారు, ఇప్పుడు దేహీ-అభిమానులుగా అవ్వండి. మీరు ఆత్మలు, నేను మీ తండ్రిని, పరమపిత పరమాత్మను. నేను అశరీరిని, కూర్చుని పిల్లలకు నా పరిచయాన్ని ఇస్తాను. అతీంద్రియ సుఖం గోప గోపికలను అడగండి అని ఏదైతే అంటూ ఉంటారో, అది అంతిమ సమయానికి సంబంధించిన విషయము. అప్పుడే పరీక్ష ఫలితాలు సమీపంగా వస్తాయి. ఏ పిల్లలైతే ఎక్కువ సేవ చేస్తారో, వారు తప్పకుండా అందరికీ ప్రియమనిపిస్తారు. ప్రదర్శినీ మొదలైనవాటిలో కూడా ముందు వారినే గుర్తు చేస్తారు. ఫలానావారిని పంపించండి అని రాస్తారు. దీని అర్థం ఏమిటంటే, వారు మా కంటే తెలివైనవారని స్వయం భావిస్తారు. కానీ దేహాభిమానం చాలా ఉంది. వారు మన పెద్ద అన్నయ్య మరియు అక్కయ్య అయినప్పుడు, వారికి గౌరవం కూడా ఇవ్వాలి. ఫలానావారు మా కంటే 100 రెట్లు మంచిగా ఉన్నారు అని ఎప్పుడూ అనరు. ఎవరికైనా గౌరవాన్ని ఇచ్చే తెలివి కూడా లేదు. తండ్రి ఏదైతే అర్ధం చేయిస్తారో, దానిని అనుసరించకపోతే వారి పరిస్థితి ఏమవుతుంది. దేహాభిమానం శవం వలె చేసేస్తుంది. తండ్రి అంటారు – దేహీ-అభిమానులుగా అవ్వండి. ఉదయాన్నే లేచి శివబాబాను స్మృతి చేయండి, అది కూడా చేయరు. మంచి-మంచి మహారథులు యోగంలో చాలా తక్కువగా ఉంటారు. జ్ఞానాన్ని అయితే చిన్న పిల్లలు కూడా అర్థం చేయించగలరు. కానీ అది చిలుక పలుకుల వలె అయిపోతుంది. ఇందులో యోగంలో ఉండాలి, ధారణ కూడా ఉండాలి. అప్పుడే సంతోషం కలుగుతుంది. యోగం లేకుండా వికర్మలు వినాశనమవ్వవు. పవిత్రమైన వారినే స్మృతి చేయడం జరుగుతుంది. కనుక వారి పట్ల ప్రేమ కూడా చాలా ఉండాలి. పదే-పదే అర్థం చేయించడం జరుగుతుంది – మన్మనాభవ. అర్ధకల్పం దేహాభిమానులుగా ఉన్నారు కనుక దేహీ అభిమానులుగా ఉండడం కష్టమనిపిస్తుంది, చాలా శ్రమ అనిపిస్తుంది. దేహీ-అభిమానీ అవస్థను తయారుచేసుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది. స్వయాన్ని చిన్న ఆత్మగా భావిస్తూ మరియు తండ్రిని కూడా బిందువుగా భావిస్తూ స్మృతి చేయడంలోనే శ్రమ ఉంది. ఎవరైతే సత్యంగా ఉంటారో, వారు లోపల ఫీల్ అవుతూ ఉంటారు – నేను ఎంత స్మృతి చేస్తున్నాను అని. ఈ అభ్యాసం చాలా కష్టమైనది. 21 జన్మల కోసం స్వర్గ రాజ్యాధికారాన్ని పొందడం ఏమైనా చిన్న విషయమా! మీరు అర్థం చేసుకుంటారు – మేము చిన్న ఆత్మ, మాలో 84 జన్మల పాత్ర నిశ్చయించబడి ఉంది. ఆత్మయే ముఖ్యమైన పాత్రధారిగా అవుతుంది. ఆత్మయే అన్నీ అవుతుంది. కానీ దేహాభిమానం కారణంగా ఆత్మాభిమానం మాయమైపోయింది. అన్నింటికంటే ముఖ్యమైన అభ్యాసం ఇదే చేయాలి. ఇదే భారత్ యొక్క ప్రాచీన యోగం, ప్రసిద్ధిమైనది. ఇదే గీత, కేవలం దానిలో నిరాకారుని పేరుకు బదులుగా దేహధారి అయిన దేవత పేరు రాసేసారు.

తండ్రి అంటారు – ఎవరైతే ప్రారంభం నుండి మొదలుకొని చివరి వరకు చాలా భక్తి చేసారో, వారే నంబరువన్ గా పైకి వెళ్తారు. మీరు కూడా చాలా భక్తి చేసారు. కనుక పిల్లలైన మీకు కూడా, మాకు తండ్రి లభించారు అని ఎంత సంతోషముండాలి. బాబా మనల్ని చదివిస్తున్నారు. మనం ఈ చదువు ద్వారా విశ్వానికి యజమానులుగా అవుతాము. ఇప్పుడు బాబా మతాన్ని తప్పకుండా అనుసరించాలి. తండ్రి ఏ డైరెక్షన్ లనైతే ఇస్తారో, వాటిలో ఒకవేళ ఏదైనా తప్పు జరిగినా కూడా, దానిని వారంతట వారే సరి చేసేస్తారు. సలహా ఇచ్చారు అంటే తర్వాత బాధ్యులు కూడా వారే. పదే-పదే శివబాబా గుర్తుకొస్తూ ఉంటారు, అందుకే ఈ బాబా కూడా ఎల్లప్పుడూ ఇదే చెప్తూ ఉంటారు – మీకు శివబాబా వినిపిస్తున్నారు. నేను కూడా వింటాను, కావున ఈ డైరెక్షన్ ఇచ్చేవారు శివబాబా. మేము వారి డైరెక్షన్ అనుసారంగా నడుచుకుంటాము. మీరు కూడా వారిని స్మృతి చేస్తారు. వీరు కూడా వారినే స్మృతి చేస్తారు. దేహాభిమానాన్ని వదిలేయండి. మీరు వజ్రాల వ్యాపారి అయిన దాదా వద్దకేమీ రాలేదు. మీరు శివబాబా వద్దకు వచ్చారు. జ్ఞాన సాగరుడు వారు కదా. మీరు శివబాబా నుండి జ్ఞానామృతాన్ని తాగడానికి వచ్చారు. ఇప్పుడు కూడా జ్ఞానామృతాన్ని తాగుతూ ఉంటారు. ప్రతి రోజు జ్ఞాన సాగరుడైన బాబా వినిపిస్తూ ఉంటారు. వారినే స్మృతి చేయాలి. బాబా భక్తిని వదలిపెట్టండి అని చెప్పరు. ఎప్పుడైతే జ్ఞానం యొక్క పరాకాష్ఠ వస్తుందో, అప్పుడు తమంతట తామే అర్థం చేసుకుంటారు – ఇది భక్తి మరియు ఇది జ్ఞానం అని. అర్ధకల్పం మీరు భక్తి చేసారు. తిరిగి ఎవ్వరూ వెళ్ళలేదు, తీసుకువెళ్ళేవారు ఒక్క తండ్రి మాత్రమే. అచ్ఛా.

మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. తండ్రి ఏ సలహాలనైతే ఇస్తారో, అది శివబాబా శ్రీమతం అని భావిస్తూ అనుసరించాలి. జ్ఞానామృతాన్ని తాగాలి మరియు తాగించాలి.

2. అందరికీ గౌరవాన్ని ఇస్తూ సేవలో తత్పరులై ఉండాలి. దేహాభిమానాన్ని విడిచిపెట్టి దేహీ-అభిమానులుగా ఉండే అభ్యాసం చేయాలి.

వరదానము:-

ఎంత వీలైతే అంత సేవ యొక్క సంబంధంలో బాలకులు, తమ పురుషార్థం యొక్క స్థితిలో యజమానులు, సంపర్కం మరియు సేవలో బాలకులు, స్మృతి యాత్ర మరియు మథనం చేయడంలో యజమానులు, సహచరులతో మరియు సంగఠనలో బాలకులు మరియు వ్యక్తిగతంలో యజమానులు – ఈ బ్యాలెన్స్ తో నడుచుకోవడమే యుక్తియుక్తంగా నడుచుకోవడము. దీనితో ప్రతి కార్యంలో సహజంగానే సఫలత ప్రాప్తిస్తుంది, స్థితి ఏకరసంగా ఉంటుంది మరియు సహజంగానే సర్వులకు స్నేహీలుగా అయిపోతారు.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top