02 April 2022 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

April 1, 2022

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

‘‘మధురమైన పిల్లలూ - మాతా-పితల వంశవృక్షములోకి రావాలి అంటే పూర్తిగా ఫాలో చేయండి, వారి సమానంగా మధురంగా అవ్వండి, మంచి రీతిలో చదువును చదువుకోండి’’

ప్రశ్న: -

ఏ గుహ్యమైన, గుప్తమైన, రహస్యయుక్తమైన విషయాలను అర్థం చేసుకునేందుకు చాలా మంచి బుద్ధి కావాలి?

జవాబు:-

1. బ్రహ్మా-సరస్వతులు వాస్తవానికి తల్లి-తండ్రి కారు, సరస్వతి అయితే బ్రహ్మాకు పుత్రిక, వారు కూడా బ్రహ్మాకుమారి. బ్రహ్మానే మీ పెద్ద తల్లి, కానీ వారు పురుషుడు, అందుకే జగదంబను తల్లి అని అన్నారు. ఇది చాలా రహస్యయుక్తమైన, గుహ్యమైన విషయము, దీనిని అర్థం చేసుకునేందుకు చాలా మంచి బుద్ధి కావాలి. 2. సూక్ష్మవతనవాసి అయిన బ్రహ్మాను ప్రజాపిత అని అనరు. ప్రజాపిత ఇక్కడ ఉన్నారు. వ్యక్తంగా ఉన్న వీరు ఎప్పుడైతే సంపూర్ణ పవిత్రంగా అవుతారో, అప్పుడు సంపూర్ణ అవ్యక్త రూపం కనిపిస్తుంది. అక్కడ సైగల భాష నడుస్తుంది. దేవతల సభ జరుగుతుంది. ఇది కూడా అర్థం చేసుకోవాల్సిన గుహ్యమైన విషయము.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

మాతా ఓ మాతా… (మాతా ఓ మాతా…)

ఓంశాంతి. ఇది ఈశ్వరీయ యూనివర్సిటీ అని పిల్లలకు తెలుసు. ఎవరు చదివిస్తారు? ఈశ్వరుడు. ఈశ్వరుడైతే ఒక్కరే, వారి శాస్త్రం కూడా ఒక్కటే ఉండాలి. ఏ విధంగా ధర్మ స్థాపకుడు ఒక్కరే ఉంటారో, అలా వారి శాస్త్రం కూడా ఒక్కటే ఉండాలి. అయితే, చిన్న-చిన్న పుస్తకాలను తయారుచేసారు కానీ, వాస్తవానికి శాస్త్రము ఒక్కటే ఉంటుంది. ఇది గాడ్ ఫాదర్ యొక్క యూనివర్సిటీ. వాస్తవానికి ఫాదర్ యొక్క యూనివర్సిటీ అయితే ఏమీ ఉండదు, గవర్నమెంట్ యొక్క యూనివర్సిటీ ఉంటుంది. దీనిని మదర్-ఫాదర్ యొక్క యూనివర్సిటీ అని అంటారు. ఏ మదర్ ఫాదర్? గాడ్-గాడెస్ (భగవాన్-భగవతి) అని అంటారు. నీవే తల్లివి, తండ్రివి… అని పాడుతారు కూడా. కనుక తప్పకుండా తండ్రే ఫస్ట్ అయినట్లు. భగవానువాచ. భగవంతుడు కూర్చుని చదివిస్తారు, మిగిలిన అన్ని చోట్ల మనుష్యులు, మనుష్యులను చదివిస్తారు. ఇక్కడ నిరాకార తండ్రి ఆత్మలైన మిమ్మల్ని చదివిస్తున్నారు, ఈ విచిత్రమైన విషయాన్ని మనుష్యులు సహజంగా అర్థం చేసుకోలేరు. నిరాకార పరమపిత పరమాత్మ, గాడ్ ఫాదర్ మమ్మల్ని చదివిస్తున్నారని ఇలా ఎవరూ అనరు. ఇక్కడ మిమ్మల్ని పరమపిత పరమాత్మ చదివిస్తారు. ఎవరి బుద్ధిలోనూ ఈ విషయం ఉండదు. చదివేవారి బుద్ధిలోనూ ఉండదు, చదివించేవారి బుద్ధిలోనూ ఉండదు. ఇక్కడ మీకు తెలుసు, గాడ్ ఫాదర్ మనల్ని చదివిస్తారు అని. అందరికీ తండ్రి, ఉన్నతోన్నతమైనవారు వారొక్కరే, ఇతరులెవ్వరూ తండ్రి కారు. బ్రహ్మాకు కూడా తండ్రి వారే. మిమ్మల్ని చదివించేది కూడా వారే. బ్రహ్మా చదివించరు, నిరాకార తండ్రి చదివిస్తారు. బ్రహ్మా-సరస్వతులు, ఆడమ్ మరియు ఈవ్ అని మనుష్యులకు తెలుసు. కానీ వారి కన్నా ఉన్నతమైనవారు నిరాకారుడు. ఇతరులైతే సాకారంలో ఉన్నారు. నిరాకారుడు వచ్చి చదివిస్తారని పిల్లలైన మీకు తెలుసు. మీకు జ్ఞానాన్ని ఇచ్చేవారు ఆ గాడ్ ఫాదర్ యే. గృహస్థ వ్యవహారంలో ఉంటూ మీరు జ్ఞానాన్ని చదువుకోవాలని వారంటారు. వాస్తవానికి గృహస్థ వ్యవహారంలో ఎవరూ చదువుకోరు. కష్టం మీద కొందరు సెకెండు కోర్సు తీసుకుంటూ ఉండవచ్చు. మమ్మల్ని నిరాకార పరమాత్మ చదివిస్తారని ఇక్కడ మీకు పూర్తి నిశ్చయముంది. ఈ సాకార మమ్మా-బాబా కూడా వారి నుండే చదువుకుంటారు. ఇవి చాలా గుహ్యమైన విషయాలు. ఎప్పటివరకైతే తండ్రి వచ్చి అర్థం చేయించరో, అప్పటివరకు ఎవరూ అర్ధం చేసుకోలేరు. మీరు వీరిని (సరస్వతిని) మమ్మా అని అంటూ ఉండవచ్చు కానీ వీరు బ్రహ్మా యొక్క దత్త పుత్రిక అని మీకు తెలుసు. మీరు కూడా దత్తత తీసుకోబడినవారే కానీ మిమ్మల్ని మమ్మా అని అనడం జరగదు. ఇది దైవీ పరివారము. మమ్మా, బాబా, దాదా (తాతగారు) సోదరీ-సోదరులు, మీరు బ్రహ్మాకుమారులు-కుమారీలు. వారు కూడా బ్రహ్మాకుమారి సరస్వతి. కానీ వారిని జగదంబ అని అంటారు ఎందుకంటే ఈ బ్రహ్మా అయితే పురుషుడు. మమ్మాను కూడా వీరి ద్వారా శివబాబా రచించారు. కానీ నియమానుసారంగా తల్లి కావాలి, అందుకే వీరిని నిమిత్తంగా చేసారు. ఇవి చాలా రమణీకమైన విషయాలు. కొత్తవారు ఎవరూ అర్థం చేసుకోలేరు. ఎప్పటివరకైతే వారికి తండ్రి మరియు రచన యొక్క పరిచయం లేదో, అప్పటివరకు కష్టం మీద అర్థం చేసుకోగలరు. ఎవరికీ అర్థం చేయించలేరు కూడా.

వేద-శాస్త్రాలు మొదలైనవి చదవడము, డాక్టరు చదువును చదవడం, ఇవన్నీ మనుష్యుల చదువులు. మనుష్యులు, మనుష్యులను చదివిస్తారు. నేను ఆత్మను, ఆత్మలను చదివిస్తానని ఎప్పుడూ ఎవరూ ఇలా అనరు. ఇక్కడ మిమ్మల్ని దేహాభిమానం నుండి బయటకు తీసి, దేహీ-అభిమానులుగా తయారుచేస్తారు. దేహాభిమానము మొదటి నంబరు వికారము. దేహీ-అభిమానులు ఎవరూ లేరు. ఆత్మ మరియు శరీరం, రెండూ వేర్వేరని మీకు తెలుసు. కానీ ఆత్మ ఎక్కడ నుండి వస్తుంది, దానికి తండ్రి ఎవరు, ఇది తెలియదు. ఇవి కొత్త ప్రపంచం కోసం కొత్త విషయాలు. న్యూ ఢిల్లీ అని అంటారు. కానీ కొత్త ప్రపంచంలో దీని పేరు ఢిల్లీ అని ఉండదు, దానిని పరిస్తాన్ అని అంటారు. మనం ఈశ్వరీయ సంతానము అని మొట్టమొదట ఈ నిశ్చయముండాలి. దైవీ సంతానానికి మరియు ఆసురీ సంతానానికి రాత్రికి-పగలుకు ఉన్నంత తేడా ఉంది. వారు భ్రష్టాచారులు, మీరు శ్రేష్ఠాచారులు. ఓ పతిత పావనా రండి, వచ్చి శ్రేష్ఠాచారులుగా తయారుచేయండి అని పాడుతారు కూడా. గురునానక్ కూడా, భగవంతుడు వచ్చి మురికి పట్టిన వస్త్రాలను శుభ్రం చేస్తారని చెప్పారు. మీరే పూజ్యులుగా, మీరే పూజారులుగా ఎలా అవుతారు – ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన రహస్యాలు. సదా పూజ్యులు ఒక్క పరమపిత పరమాత్మ. వారు లక్ష్మీ-నారాయణులను పూజ్యులుగా తయారుచేసారు. వారు కూడా మొదట తల్లి-తండ్రిని తయారుచేసారు, మమ్మా-బాబాను దత్తత తీసుకున్నారు. పతితులను పావనంగా చేస్తారు. రావడమే పతిత ప్రపంచంలోకి వస్తారు, పావనంగా తయారుచేయడానికి. అందుకే బ్రహ్మా చిత్రాన్ని పైన చూపించారు. కింద మళ్ళీ తపస్య చేస్తున్నారు. వారు పతితులను దత్తత తీసుకుంటారు. బ్రహ్మా-సరస్వతి మరియు పిల్లల పేర్లు మారతాయి. బ్రహ్మాకుమార-కుమారీలు దేవీ-దేవతలుగా అయ్యేందుకు రాజయోగాన్ని నేర్చుకుంటున్నారని మీకు తెలుసు. ఇది ఈశ్వరీయ సంతానము లేక వంశవృక్షము. ఒక్క బీజం నుండి ఈ వంశవృక్షము వెలువడింది. అది ఆత్మల వంశవృక్షము. ఇది మనుష్యుల వంశవృక్షము. రుద్రమాల కూడా ఆత్మల వంశవృక్షము. మరి మనుష్యుల వంశవృక్షము ఏది? దేవత, క్షత్రియ, వైశ్య, శూద్ర… ఇది రచయిత మరియు రచనల జ్ఞానము, దీనిని పిల్లలైన మీరే వింటారు. కానీ ధారణ నంబరువారుగా అవుతున్న కారణంగా రాజా-రాణిగా కూడా అవుతారు, అలాగే ప్రజలుగా కూడా అవుతారు. మమ్మా-బాబాను ఫాలో చేయాలి, చాలా మధురంగా అవ్వాలి అని పురుషార్థం చేయాలి. మమ్మా మధురమైనవారు, అందుకే అందరూ గుర్తు చేస్తారు. ఈ మమ్మా-బాబాను మరియు పిల్లలైన మిమ్మల్ని మధురంగా తయారుచేసేవారు శివబాబా. ఇది మమ్మా-బాబా మరియు మంచి రీతిలో చదువుకునే పిల్లల వంశవృక్షము. మరి వారు చాలా మధురంగా ఉండాలి. సరస్వతికి వీణను చూపించారు. కృష్ణుడికేమో మురళీని చూపించారు. కేవలం పేరు మార్చేసారు. బాబా అంటారు, మంచి రీతిలో చదువుకోండి. ఏ విధంగానైతే విద్యార్థులకు చదువుకునేటప్పుడు, వారి బుద్ధిలో – మహమ్మద్ గజినీ ఎప్పుడు వచ్చారు, ఎలా దోపిడీ చేసి వెళ్ళారు, ముసల్మాన్లు ఫలానా చోట యుద్ధం చేసారు అని మొత్తం చరిత్ర-భౌగోళికము ఉంటుంది. ఇస్లాములు, బౌద్ధులు ఎవరైతే వచ్చారో, వారి చరిత్ర గురించి అందరికీ తెలుసు. కానీ ఈ అనంతమైన చరిత్ర-భౌగోళికము ఎవరికీ తెలియదు. కొత్త ప్రపంచం మళ్ళీ పాతదిగా ఎలా అవుతుంది, డ్రామా ఎక్కడ నుండి మొదలవుతుంది, మూలవతనము, సూక్ష్మవతనము తర్వాత స్థూలవతనము, ఇక్కడ ఈ చక్రం మళ్ళీ ఎలా తిరుగుతూ ఉంటుంది – ఈ చదువును పిల్లలైన మీరిప్పుడు చదువుకుంటున్నారు. మూలవతనంలో ఆత్మల నివాస స్థానం ఉంది. సూక్ష్మవతనంలో బ్రహ్మా-విష్ణు-శంకరులు ఉన్నారు. ఏ ఆత్మలైతే మొదట పావనంగా ఉండేవారో, వారు మళ్ళీ పతితంగా ఎలా అయ్యారు, మళ్ళీ పావనంగా ఎలా అవుతారు, ఇవన్నీ అర్థం చేయించడం జరుగుతుంది. సూక్ష్మవతనవాసి బ్రహ్మాను, ప్రజాపిత అని అనరు. ప్రజాపిత అయితే ఇక్కడ ఉన్నారు. మీకు సాక్షాత్కారం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ వ్యక్త బ్రహ్మా పవిత్రంగా అవుతారో, అప్పుడు అక్కడ తెల్లని ప్రకాశంతో కూడిన సూక్ష్మ రూపం వలె సంపూర్ణ అవ్యక్త రూపం కనిపిస్తుంది. సంభాషణ కూడా సైగలలో నడుస్తుంది. సూక్ష్మవతనం అంటే ఏమిటి, అక్కడకు ఎవరు వెళ్ళగలరు అనేది మీకు తెలుసు. అక్కడ మీరు మమ్మా, బాబాను చూస్తారు. అక్కడకు దేవతలు కూడా వస్తారు మరియు కలుసుకుంటారు, ఎందుకంటే దేవతలు పతిత ప్రపంచంలోనైతే పాదం మోపలేరు, అందుకే సూక్ష్మవతనంలో కలుస్తారు. అది పుట్టినింటివారు మరియు అత్తవారింటివారి మిలనము. లేదంటే బ్రాహ్మణులైన మీరు మరియు దేవతలు ఎలా కలుసుకుంటారు. కావున ఇది కలుసుకునేందుకు యుక్తి. సమ్ముఖంలో సాక్షాత్కారం చూడడం కూడా బుద్ధి ద్వారా తెలుసుకోవడము. ఇది డ్రామాలో నిశ్చితమై ఉంది. ఏ విధంగానైతే మీరాకు ఇంట్లో కూర్చుని ఉండగా వైకుంఠం యొక్క సాక్షాత్కారం జరిగేది, డాన్స్ చేసేవారు. ప్రారంభంలో మీరు కూడా చాలా సాక్షాత్కారాలు చూసారు. రాజధాని ఎలా నడుస్తుంది, ఆచార-వ్యవహారాలు ఎలా ఉంటాయి, అన్నీ చెప్పేవారు. ఆ సమయంలో మీరు కొద్దిమందే ఉండేవారు. మిగిలినవారంతా చివర్లో చూస్తారు. ప్రపంచంవారు పరస్పరంలో కొట్లాడుకుంటూ-గొడవపడుతూ ఉంటారు మరియు మీరు సాక్షాత్కారాలు చూస్తూ ఉంటారు. మనుష్యులైతే అయ్యో, అయ్యో అని మొరపెట్టుకుంటూ ఉంటారు. కొందరి ధనం మట్టిలో కలిసిపోతుంది… ఈ సమయంలోనైతే ప్రజలపై ప్రజా రాజ్యం ఉంది. అయినా కూడా, వారి హోదా ఎంత గొప్పగా ఉంది. కానీ ఈ సమయంలో ఎవరి బుద్ధియోగము పరమాత్మతో లేని కారణంగా, వారిని గుర్తించనే గుర్తించరు. కన్య ఒక్కసారి వరుడి గురించి తెలుసుకుంటే, ఇక ప్రీతి జోడించబడుతుంది. గుర్తించకపోతే ప్రీతి ఉండదు. మీలో కూడా ప్రీతి నంబరువారుగా ఉంది. నిరంతర స్మృతి కోసం కూడా ప్రీతి కావాలి, కానీ ప్రియతముడిని మర్చిపోతారు. నేను కూడా మర్చిపోతానని ఈ బాబా (బ్రహ్మా) అంటారు.

పిల్లలైన మీకు 5 వేల సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ శిక్షణ లభిస్తుంది, స్వయాన్ని ఆత్మగా భావించండి, పరమాత్మను స్మృతి చేయండి, ఈ స్మృతితోనే వికర్మలు భస్మమవుతాయి. ఇప్పుడైతే వికర్మాజీతులుగా అవ్వాలి. మొట్టమొదట ఎవరైతే సత్యయుగంలోకి వస్తారో, వారిని వికర్మాజీతులని అంటారు. పతితులను వికర్మలు చేసేవారని, పావనులను సుకర్మలు చేసేవారని అంటారు. వికర్మాజీత్ రాజ్యం సత్యయుగంలో ఉంటుంది. తర్వాత వికర్మల శకం నడుస్తుంది. 2500 సంవత్సరాలు వికర్మాజీతులుగా, తర్వాత వారే వికర్మలు చేసేవారిగా అవుతారు. మీరు వికర్మాజీత్ రాజ్యంలోకి వెళ్ళేందుకు ఇప్పుడు పురుషార్థం చేస్తున్నారు. మోహజీత్ రాజు యొక్క పెద్ద కథ ఉంది. పతిత రాజ్యం ఎప్పుడు నడుస్తుంది, పావన రాజ్యం ఎప్పుడు నడుస్తుంది – ఇదంతా మీకే తెలుసు. శివబాబా పావనంగా చేస్తారు, వారి చిత్రం కూడా ఉంది. రావణుడు పతితంగా చేస్తాడు, అతని చిత్రం కూడా ఉంది. తప్పకుండా ఇప్పుడున్నది రావణ రాజ్యమని మీకు తెలుసు, అందుకే ఈ సృష్టిచక్రం యొక్క చిత్రం ఏదైతే ఉందో, దానిపై రాయాల్సి ఉంటుంది – భారత్ టుడే, భారత్ టుమారో (నేటి భారత్, రేపటి భారత్). అలా తయారవ్వనున్నది కదా.

ఇది ఉన్నదే మృత్యులోకమని మీకు తెలుసు. ఇక్కడ అకాల మృత్యువులు జరుగుతూ ఉంటాయి. అక్కడ అలా జరగదు, అందుకే దానిని అమరలోకం అని అంటారు. రామ రాజ్యం సత్యయుగం నుండి ప్రారంభమవుతుంది. రావణ రాజ్యం ద్వాపరం నుండి ప్రారంభమవుతుంది. ఈ విషయాలన్నింటినీ మీరే అర్థం చేసుకుంటారు. మనుష్యులందరూ కుంభకర్ణుని నిద్రలో నిద్రించి ఉన్నారు. నేను పిల్లలైన మీకు అన్ని రహస్యాలను అర్థం చేయిస్తాను. మీరు బ్రహ్మా ముఖవంశావళి, మీకు అర్థం చేయిస్తాను. ఇందులో ఈ బ్రహ్మా-సరస్వతులు కూడా ఉన్నట్లు. వీరు జగదంబ. మహిమను పెంచేందుకు వీరికి గాయనముంది. ఇకపోతే, వాస్తవానికి పెద్ద తల్లి ఈ బ్రహ్మానే కదా, కానీ శరీరం పురుషునిది. ఇవి చాలా గుహ్యమైన విషయాలు. జగదంబకు తప్పకుండా ఎవరో తల్లి అయితే ఉన్నారు కదా. వీరు బ్రహ్మాకైతే పుత్రిక. కానీ సరస్వతి యొక్క తల్లి ఎక్కడున్నారు? వీరిని ఎవరి ద్వారా రచించారు? కనుక ఈ బ్రహ్మా పెద్ద తల్లి అవుతారు. వీరి ద్వారా కుమారులను మరియు కుమార్తెలను రచిస్తారు. ఈ విషయాలను అర్థం చేసుకోవడానికి చాలా మంచి బుద్ధి కావాలి. కుమారీలు బాగా అర్థం చేసుకుంటారు. మమ్మా కూడా కుమారీ. ఎప్పుడైతే బ్రహ్మచర్యం భంగమవుతుందో, అప్పుడు ధారణ జరగదు. గృహస్థ ధర్మమైతే సత్యయుగంలో ఉండేది, కానీ వారిని పావనులని అంటారు. ఇక్కడ పతితులు ఉన్నారు. శ్రీకృష్ణునికి ఎంత మహిమ చేస్తారు – సర్వగుణ సంపన్నులు, 16 కళా సంపూర్ణులు… ఇక్కడైతే ఏ మనిషీ ఆ విధంగా ఉండజాలరు. అక్కడ రావణ రాజ్యమే లేదు. దేహ-అహంకారం యొక్క మాటే ఉండదు. అక్కడ వారికి – మేము ఈ పాత దేహాన్ని వదిలి మరొకటి తీసుకుంటాము అన్న జ్ఞానం ఉంటుంది. ఆత్మాభిమానులుగా ఉంటారు. ఇక్కడ ఉన్నది దేహాభిమానులు. ఇప్పుడు మీకు నేర్పించడం జరుగుతుంది – స్వయాన్ని ఆత్మగా భావించండి, మీరు ఈ పాత శరీరాన్ని వదిలి తిరిగి వెళ్ళాలి, మళ్ళీ కొత్త శరీరాన్ని కొత్త ప్రపంచంలో తీసుకుంటారు. అర్థమైందా – అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. నిరంతర స్మృతిలో ఉండేందుకు హృదయం యొక్క ప్రీతిని ఒక్క తండ్రితో పెట్టుకోవాలి. ప్రియతముడిని ఎప్పుడూ మర్చిపోకూడదు.

2. వికర్మాజీత్ రాజ్యంలోకి వెళ్ళేందుకు మోహజీతులుగా అవ్వాలి, సుకర్మలు చేయాలి. ఎటువంటి వికర్మలు చేయకూడదు.

వరదానము:-

ఒకవేళ ఏదైనా అసత్యమైన లేక వ్యర్థమైన విషయాన్ని చూసారు, విన్నారు మరియు దానిని వాయుమండలంలో వ్యాపింపజేసారు, అంతేకానీ విని మనసులో ఇముడ్చుకోలేదు, అప్పుడు ఈ వ్యర్థ విషయాలను వ్యాపింపజేయడము – ఇది కూడా పాపం యొక్క అంశము. ఈ చిన్న-చిన్న పాపాలు ఎగిరే కళ యొక్క అనుభవాన్ని సమాప్తం చేస్తాయి. ఇటువంటి సమాచారాన్ని వినేవారిపై కూడా పాపము వస్తుంది మరియు వినిపించేవారిపై అంతకన్నా ఎక్కువ పాపము వస్తుంది, అందుకే స్వయాన్ని సూక్ష్మంగా చెకింగ్ చేసుకొని ఇటువంటి పాపాల భారాన్ని సమాప్తం చేయండి, అప్పుడు తండ్రి సమానంగా మరియు సంపన్నంగా అవ్వగలరు.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top