01 May 2021 TELUGU Murli Today – Brahma Kumaris

30 April 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Malayalam. This is the Official Murli blog to read and listen daily murlis.

“మధురమైన పిల్లలూ - మేము ఈశ్వరీయ ఫ్యామిలీకి చెందినవారము, మేము మా గుప్తమైన దైవీ రాజధానిని స్థాపన చేస్తున్నాము అనే ఆత్మిక నషాలో ఉండండి”

ప్రశ్న: -

పిల్లల్లో ఏ అలవాటు పక్కాగా ఉన్నట్లయితే, రోజంతా సంతోషం నిలిచి ఉంటుంది?

జవాబు:-

ఒకవేళ ఉదయాన్నే లేచి విచార సాగర మథనం చేసే అలవాటు ఉన్నట్లయితే, రోజంతా అపారమైన సంతోషముంటుంది. తండ్రి శ్రీమతము – పిల్లలూ, అమృతవేళ లేచి మీ తండ్రితో మధురాతి మధురమైన మాటలను మాట్లాడండి. ఇప్పుడు మేము ఏ ఫ్యామిలీకి చెందినవారము, మా కర్తవ్యమేమిటి అని ఆలోచించండి. ఇది మా ఈశ్వరీయ ఫ్యామిలీ అని, మేము మా కొత్త రాజధానిని స్థాపన చేస్తున్నామని బుద్ధిలో ఉన్నట్లయితే రోజంతా సంతోషం నిలిచి ఉంటుంది.

♫ వినండి ఆడియో (audio)➤

ఓంశాంతి. ఇది ఆత్మిక పరివారమని, అవన్నీ దైహిక పరివారాలని పిల్లలకు తెలుసు. ఇది ఆత్మిక పరివారము. ఇది ఆత్మిక తండ్రి యొక్క పరివారము. లౌకిక ఇంట్లో తల్లిదండ్రులు, పిల్లలు ఉంటారు, అది హద్దు పరివారము. ఇప్పుడు మీది అనంతమైన ఫ్యామిలీ. నీవే తల్లివి-తండ్రివి….. అని పిల్లలు పాడుతారు కూడా, అనగా ఫ్యామిలీ అయినట్లు, రచయిత యొక్క రచన అయినట్లు. నిజానికి పిల్లలు వారి రచన కానీ పిల్లలకు ఈ విషయం తెలియదు. ఇది తప్పకుండా అనంతమైన తండ్రి ఫ్యామిలీ అని పిల్లలైన మీకు ఇప్పుడు తెలుసు. ఇది ఈశ్వరీయ విశ్వవిద్యాలయము. వినాశకాలే ప్రీతి బుద్ధి విజయంతి అని వీరి కోసమే గాయనముంది. ఇటువంటి ఫ్యామిలీ గురించి గీతలో ఎప్పుడూ గాయనం చేయబడలేదు. ఈశ్వరీయ ఫ్యామిలీ అయిన మీరు, గుప్తమైన దైవీ రాజధానిని స్థాపన చేస్తున్నారు. ఈ విషయం ఎవరికీ తెలియదు. మీకు నషా ఉంది, ఎవరెవరు అయితే తండ్రిని స్మృతి చేస్తారో, వారికి నషా ఉంటుంది. దేహాభిమానంలోకి రావడంతో ఆ నషా దిగిపోతుంది. ఇది ఈశ్వరీయ ఫ్యామిలీ. మనం ఇంటికి వెళ్ళాలి, తర్వాత దైవీ రాజధానిలోకి వస్తాము. అక్కడ దైవీ ఫ్యామిలీ ఉంటుంది. మరొకటి ఆసురీ ఫ్యామిలీ, ఇది మీ ఈశ్వరీయ ఫ్యామిలీ. ఆత్మిక బాప్ దాదా పిల్లలు పరస్పరంలో సోదరీ-సోదరులు, అంతే. ఇది ఆత్మిక ప్రవృత్తి మార్గము. సత్యయుగంలో ఈశ్వరీయ ఫ్యామిలీ అని అనరు. అక్కడ దైవీ ఫ్యామిలీ ఉంటుంది. ఈ ఈశ్వరీయ ఫ్యామిలీ చాలా శక్తిశాలి అయినది. ఇప్పుడు ఈశ్వరీయ ఫ్యామిలీ అయిన మనము, దైవీ రాజ్యాన్ని స్థాపన చేస్తున్నామని మీకు తెలుసు. ఈ విధంగా మీతో మీరు మాట్లాడుకుంటూ విచార సాగర మథనం చేయాలి. ఉదయాన్నే లేచి స్మృతిలో కూర్చున్నట్లయితే విచార సాగర మథనం చేసే అలవాటు ఏర్పడుతుంది, ఉల్లాసంలోకి వస్తూ ఉంటారు. మిగిలిన మనుష్యులందరూ నిద్రలో ఉన్నప్పుడు, ఆ సమయంలో మీరు మేల్కొంటారు. మీరు ఉదయాన్నే లేచి ఈ విధంగా ఆలోచించాలి, అప్పుడు మీకు ఎంత సంతోషముంటుందో చూడండి. మీకు ఏ శ్రీమతం లభిస్తే దానిని అనుసరించాలి, అప్పుడు మీకు చాలా సంతోషం ఉంటుంది, ఈశ్వరీయ ఫ్యామిలీ గుర్తుంటుంది, ఆసురీ ఫ్యామిలీ నుండి మనస్సు తొలగిపోతుంది. కొత్త ఇల్లు పూర్తిగా తయారైనప్పుడు, పాతదాని నుండి ఆసక్తి తొలగిపోతుంది. ఎప్పటి వరకైతే కొత్తది తయారవ్వదో, అప్పటివరకు ఏవో ఒక మరమ్మతులు మొదలైనవి చేస్తూ ఉంటారు, ఇక పాతదాని నుండి మనస్సు తొలగిపోతుంది. ఈ పాత ప్రపంచం విషయంలో కూడా అంతే.

ఇది పాత ఇల్లు అని, మనం కొత్త ఇంటికి వెళ్తామని ఇప్పుడు మీకు తెలుసు. అక్కడ కొత్త వస్త్రాన్ని ధరిస్తాము. ఈ దేహము కూడా పాతదే. ఇప్పుడు మీరు భవిష్య 21 జన్మల కోసం రాజ్య భాగ్యాన్ని తీసుకుంటున్నారు. ఇక్కడ రాజ్యం చేసేది లేదు. ఇక్కడ స్థాపన జరుగుతుంది. ఈ విషయాలు కేవలం మీకు మాత్రమే తెలుసు. ఇదే గీత, ఇది రాజయోగము కదా. దీనిని సహజ రాజయోగమని అంటారు. మీరు ఈ రాజయోగ అభ్యాసం ద్వారా అనేక సార్లు దైవీ రాజ్యాన్ని స్థాపన చేస్తారు. అక్కడ ఈ విషయాలు గుర్తుండవు. ఒకవేళ అక్కడ ఈ విషయాలు గుర్తున్నట్లయితే, ఇక సుఖము అనుభవమవ్వదు, చింత కలుగుతుంది. ఈ సమయంలో మీకు గుప్తమైన నషా ఉంది. ఇది ఉన్నతాతి ఉన్నతమైన తండ్రి ఫ్యామిలీ. దీనిని ఈశ్వరీయ గుప్త ఫ్యామిలీ టైప్ అని అంటారు. ఈశ్వరీయ విశ్వవిద్యాలయమని, ఈశ్వరీయ యజ్ఞమని కూడా అంటారు. ఇది ఫ్యామిలీ, మనం చాలా లవ్లీగా అవ్వాలి. భవిష్యత్తులో మీరు చాలా లవ్లీగా అవుతారు. మీరు రూప్, బసంత్ లు. ఆత్మ రూప్ (యోగయుక్తులు) కూడా, బసంత్ (జ్ఞానయుక్తులు) కూడా. ఇంత చిన్న ఆత్మ అవినాశీ పాత్రను అభినయిస్తుంది. ఈ సమయంలో మీరు రూప్, బసంత్ లుగా అయ్యారు. తండ్రి జ్ఞాన సాగరుడు. ఈ శరీరంలోకి వచ్చినప్పుడు తప్పకుండా జ్ఞానాన్ని ఇస్తారు, వారు జ్ఞాన వర్షాన్ని కురిపిస్తారని మీకు తెలుసు. ఒక్కొక్క రత్నము లక్షల రూపాయల విలువైనది. ఇప్పుడు ఆత్మలైన మీకు తండ్రి పరిచయం లభించింది. తండ్రి స్మృతినిప్పించారు. ఈ 84 జన్మల చక్రం ఎలా తిరుగుతుంది అనేది మీ బుద్ధిలో ఉంది, అందుకే మీకు స్వదర్శన చక్రధారి అనే పేరు ఉంది. విష్ణువు లేక లక్ష్మీనారాయణులు స్వదర్శన చక్రధారులు కారు, వారిలో ఈ జ్ఞానముండదు. ఇప్పుడు ఆత్మకు సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది అన్న జ్ఞానం లభిస్తుంది. త్రిమూర్తి అని అంటారు కానీ శివుడిని చూపించరు. త్రిమూర్తి చిత్రాలను చాలా చూసి ఉంటారు. సాకారంలో ప్రజాపిత బ్రహ్మా అయితే ఇక్కడ ఉన్నారు కదా. వీరు చాలా పురాతనమైనవారు, గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్. కనుక ఇది ప్రజాపిత బ్రహ్మా వంశవృక్షం అయినట్లు. తండ్రి బ్రహ్మా ద్వారా సృష్టిని రచిస్తారు కనుక బ్రహ్మా పెద్దవారు అయినట్లు కదా. చూపించడం కూడా వృద్ధునిగా చూపిస్తారు. వీరు 84 జన్మల చక్రాన్ని తిరిగి వచ్చినవారు. ఇప్పుడు మీరు ఈ విషయాలను అర్థం చేసుకున్నారు. తండ్రికైతే అందరూ పిల్లలేనని కూడా మీకు తెలుసు. ఆత్మలకు తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. ఇప్పుడు భారత్ కు చాలా గొప్ప కళ్యాణం జరుగుతుంది. ఆత్మలన్నీ పవిత్రంగా అయి ముక్తిధామానికి వెళ్ళిపోతాయి. మీరు భారత్ యొక్క సేవలోనే ఉన్నారు. విశేషంగా భారత్ కు మరియు మొత్తం ప్రపంచానికి కూడా సేవ చేస్తారు. ఇప్పుడు ఈ విషయాలను అర్థం చేసుకున్న మీరు కొద్దిమందే ఉన్నారు. ఇకపోతే సారములో, పిల్లలూ, మన్మనాభవ అని అర్థం చేయించడం జరుగుతుంది. మీ వద్ద ఏదైతే ఉందో, దానిని దైవీ రాజధాని స్థాపనలో ఉపయోగించండని వేరుగా కూడా అర్థం చేయించడం జరుగుతుంది. బాపూ గాంధీజీ ఏమి చేసేవారు! వారు కూడా రామ రాజ్యాన్ని కోరుకునేవారు. ఇది ఎంతో అద్భుతమైన ఆట కదా. ఇప్పుడు మీరు సాక్షీగా అయి ఆటను చూస్తారు. ఎక్కడి విషయాలను ఎక్కడికో తీసుకువెళ్ళడం చూసి మీకు నవ్వు వస్తుంది.

డ్రామానుసారంగా ప్రపంచ పరిస్థితి పాడైపోయిందని, మళ్ళీ తండ్రి వచ్చి సద్గతినిస్తారని తండ్రి చెప్తారు. పిల్లలైన మీకు నషా ఎక్కి ఉంది. వీరు మొత్తం ప్రపంచము యొక్క నిరాకార బాపూజీ. ఈ బ్రహ్మా కూడా ఎవరి సంతానము, శివబాబా సంతానము. వారు (శివబాబా) ఎవరి సంతానము. శివబాబా మా కొడుకు అని ఈ మాతలు అంటారు. ఇది శివబాబా చమత్కారము. ఇకపోతే ధ్యానము, సాక్షాత్కారాలలోనైతే మాయ చాలా ప్రవేశిస్తుంది. నాలోకి శివబాబా వస్తారు, శివబాబా ఇలా మాట్లాడుతారు అని ఏదైతే అంటారో, అదంతా భూతాలు ప్రవేశించడము వంటిది. పిల్లలైన మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈ భూతాల రోగము ఎటువంటిదంటే, అది ఈ రెండు ప్రపంచాలకు చెందకుండా అయిపోయినట్లుగా అనుభవం చేయిస్తుంది. మాకు సాక్షాత్కారం అవ్వాలి అనే ఆలోచన కూడా ఎప్పుడూ చేయకూడదు. ఇవన్నీ భక్తికి సంబంధించిన ఆలోచనలు. జ్ఞాన మార్గాన్ని మంచి రీతిగా అర్థం చేసుకోవాలి. మాయ అనేక రకాలుగా మోసం చేస్తుంది. సాక్షాత్కారాలు మొదలైనవాటి వల్ల లాభమేమీ ఉండదు. వీరి ద్వారా నిశ్చితార్థం చేయిస్తాను అని తండ్రి అంటారు. మీరు ఏ దేహధారినీ గుర్తు చేయకూడదు అన్నది తండ్రి ఆజ్ఞ. మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. మీ కళ్యాణము కోసం తండ్రిని స్మృతి చేయాలి. ఇది బాగా అర్థం చేసుకోవాల్సిన విషయము. బాబాకు ఎవరైనా సమాచారం వ్రాయవచ్చు. అనంతమైన తండ్రికి ఉత్తరం ద్వారా, తమ క్షేమ-సమాచారాలను వ్రాయాలి అన్న ఈ మాత్రం తెలివి కూడా చాలామంది పిల్లలకు లేదు. లౌకిక తండ్రికి ఉత్తరం వ్రాయకపోతే, అతనికి నిద్రే దూరమైపోతుంది. వీరు కూడా అనంతమైన తండ్రి. నెల, నెలన్నర వరకు ఉత్తరం రాకపోతే, బహుశా వీరిని మాయ తినేసిందేమో, అందుకే ఇటువంటి పారలౌకిక తండ్రికి ఉత్తరం వ్రాయడంలేదని అనుకుంటారు. బాబా, మేము సదా నారాయణీ నషాలో ఉంటాము, మీరు తెలిపిన యుక్తులలోనే మేము తత్పరులై ఉన్నామని – ఈ మాత్రం అయినా వ్రాయాలి. అప్పుడు బాబా, వీరు సంతోషంగా-సంతుష్టంగా ఉన్నారని భావిస్తారు. ఉత్తరం రాయకపోతే అనారోగ్యంగా ఉన్నారని, స్మృతిలో ఉండటం లేదని భావిస్తారు, లేదంటే బాబాకు సమాచారాన్ని ఇవ్వాలి – బాబా, మేము ఈ సేవ చేసాము, ఫలానా వారికి అర్థం చేయించాము, వారి బుద్ధిలో పూర్తిగా కూర్చోలేదు అని రాయాలి. అప్పుడు బాబా, ఈ విధంగా కూడా అర్థం చేయించండి అని చెప్తారు.

భక్తి మార్గంలో ఏవైతే అంటారో, వాటికి అర్థమేమీ తెలియదు. ముఖ్యమైన విషయము – తండ్రి గురించే తెలియదు. తండ్రిని తెలుసుకోవడంతో భారత్ సద్గతిని పొందుతుంది. తండ్రిని తెలుసుకోని కారణంగా భారత్ పూర్తిగా దుర్గతిని పొందుతుంది. ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి అర్థం చేయిస్తారు – నేను మిమ్మల్ని సద్గతిలోకి తీసుకువెళ్తాను, మిగిలిన వారందరినీ ముక్తిలోకి తీసుకువెళ్తాను. భారత్ జీవన్ముక్తిలో ఉన్నప్పుడు, మిగిలినవారంతా ముక్తిలో ఉంటారు. ఈ పరివర్తనను తండ్రి తప్ప ఇంకెవ్వరూ చేయలేరు. సర్వుల సద్గతిదాత ఒక్క తండ్రి మాత్రమే. సర్వుల సద్గతి తప్పకుండా కల్ప-కల్పము సంగమములోనే జరుగుతుంది.

ఆత్మలైన మన ఆత్మిక తండ్రి ఒక్కరేనని మీకు తెలుసు. వారిని ఆత్మయే స్మృతి చేస్తుంది. భక్తి మార్గంలో మీకు ఇద్దరు తండ్రులుంటారు. సత్యయుగంలో ఒక తండ్రి ఉంటారు. సంగమంలో ముగ్గురు తండ్రులుంటారు. ప్రజాపిత బ్రహ్మా కూడా తండ్రియే కదా, శివుడు కూడా తండ్రియే. వారు సర్వాత్మలకు తండ్రి, వారి నుండే వారసత్వాన్ని తీసుకోవాలి. వారిని స్మృతి చేయడంతోనే వికర్మలు వినాశనమవుతాయి. బ్రహ్మాను స్మృతి చేయడంతో వికర్మలు వినాశనమవ్వవు, అందుకే శివబాబానే స్మృతి చేయాలి. మనం వారికి చెందినవారిగా అయ్యాము. ఇది ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకిచ్చే సత్యాతి-సత్యమైన రియల్ జ్ఞానము. మిగిలిన వారంతా దేహాభిమానులు. దేహాభిమానులైన పతిత మనుష్యులు ఏ కర్తవ్యాన్ని చేసినా, అది వారిని పతితంగానే చేస్తుంది. దాన-పుణ్యాలు మొదలైనవి ఏమి చేసినా, అవన్నీ పతితంగానే చేస్తాయి. రావణ రాజ్యంలో ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు తండ్రి వచ్చి ఆర్డినెన్స్ ను (చట్టము) జారీ చేస్తారు. బాబా అంటారు – పిల్లలూ, జాగ్రత్తగా ఉండండి, వికారాల్లోకి వెళ్ళకండి, కామముపై విజయం పొందాలి. తుఫానులు మొదలైనవి చాలా వస్తాయి. ఇందులో అలసిపోకూడదు. అజ్ఞాన కాలంలో కూడా వచ్చి ఉండనటువంటి, ఎన్నో మాయా వికల్పాలు వస్తాయి, అటువంటి వికల్పాలు కూడా వస్తాయి. పిల్లలు అంటారు – భక్తి మార్గంలోనైతే చాలా సంతోషముంటుంది, ఇప్పుడు మిమ్మల్ని స్మృతి చేయాలని అనుకుంటున్నాము కానీ చేయలేకపోతున్నాము, బిందువు గుర్తుకు రావటం లేదు, పెద్ద వస్తువు అయితే గుర్తు చేయగలము.

తండ్రి అంటారు – మీరు శివబాబా అని అంటూ స్మృతి చేయండి, ఈ పాత ప్రపంచాన్ని మర్చిపోండి. మీరు నన్ను శాంతిధామంలో గుర్తు చేయండి, అలాగని కేవలం శాంతిధామాన్ని గుర్తు చేయకూడదు. తండ్రి స్మృతితోనే వికర్మలు వినాశనమవుతాయి. ఆత్మకు మధురమైన తండ్రి పట్ల ప్రేమ ఉండాలి, వారు అర్ధకల్పపు ప్రియుడు. మేము అర్ధకల్పము మిమ్మల్ని మర్చిపోయాము అని ఆత్మ అంటుంది. ఇక్కడకు బ్రాహ్మణిలు ఎవరినైతే తీసుకువస్తారో, వారు చాలా జాగ్రత్తగా, నిశ్చయబుద్ధి కలవారినే తీసుకురావాలి. ఒకవేళ ఎవరైనా ఇక్కడకు వచ్చి వెళ్ళిన తర్వాత మళ్ళీ పతితంగా అయినట్లయితే, వారి బ్రాహ్మణికి శిక్ష పడుతుంది, అందుకే బ్రాహ్మణిపై చాలా బాధ్యత ఉంది. బాబా ఈ రథాన్ని తీసుకున్నారు, వీరు అన్ని విషయాలలోనూ అనుభవజ్ఞులు. ఇక్కడ అశుద్ధత యొక్క విషయమే ఉండదు. పరస్పరంలో నవ్వుకోవడము, ఆడుకోవడము, మాట్లాడుకోవడము, దీనికేమీ అడ్డు చెప్పరు. కానీ ఏ ఆత్మ పట్లనైనా కొద్దిగా ప్రేమ పెట్టుకున్నా సరే, అది పెరుగుతూ ఉంటుంది. వారు గుర్తుకొస్తూ ఉంటారు, కనుక దీని నుండి కూడా అతీతంగా వెళ్ళాలి.

ఇప్పుడు మీరు ఇంట్లో కూర్చున్నారా లేక సత్యయుగంలో కూర్చున్నారా. (ఇంటిలో) తండ్రి పిల్లలను ఇంట్లో చదివిస్తారు. ఇది మీ అందరికీ ఇల్లు. బయటకు వెళ్ళినప్పుడు ఇలా అనరు. ఇక్కడ చాలా మంచి నషా ఉంటుంది. దేహపు అభిమానాన్ని వదిలేయాలి. దేహీ-అభిమానులుగా అయినట్లయితే జాతి-మత బేధాలన్నీ తొలగిపోతాయి. పాత ప్రపంచం తమోప్రధానంగా ఉంది, వారిలో బేధ భావాలు ఇంకా పెరుగుతూ ఉంటాయి. ఇంతకుముందు బ్రిటీష్ గవర్నమెంట్ ఉండే సమయములో, భాషల విషయంలో గొడవలు ఉండేవి కావు. ఇప్పుడు రోజు-రోజుకు గొడవలు పెరుగుతూ ఉంటాయి. తర్వాత సత్యయుగంలో ఒకే భాష ఉంటుంది. ఎటువంటి బేధ భావాలు ఉండవు. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఏ దేహధారి స్మృతి రాకూడదు, దీని కోసం ఎవరినీ ప్రేమించకూడదు. దీని నుండి అతీతంగా వెళ్ళాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. మాయ వికల్పాలకు భయపడకూడదు, విజయులుగా అవ్వాలి.

2. ధ్యానము, సాక్షాత్కారాలలో మాయ చాలా ప్రవేశిస్తుంది. ఈ భూతము ప్రవేశించకుండా స్వయాన్ని రక్షించుకోవాలి. తండ్రికి తమ సత్యాతి-సత్యమైన సమాచారాన్ని ఇవ్వాలి.

వరదానము:-

నేను సర్వ శస్త్రధారి శక్తిని, పతిత-పావని అయిన నాపై ఏ పతిత ఆత్మ దృష్టి యొక్క నీడ కూడా పడజాలదు అని మీ ఈ స్వరూపాన్ని సదా స్మృతిలో ఉంచుకోండి. పతితాత్మల పతిత సంకల్పము కూడా నడవజాలదు – మీ బ్రేక్ అంత పవర్ ఫుల్ గా ఉండాలి. ఒకవేళ ఏదైనా పతితాత్మ యొక్క ప్రభావం పడింది అంటే – మీరు ప్రభావశాలిగా లేరని అర్థము. ఎవరైతే స్వయం సంహరించేవారో, వారు ఎప్పుడూ ఎవరికీ వేటగా అవ్వలేరు. కనుక మీ ఎదురుగా ఎవరైనా అటువంటి సంకల్పం చేసినా కూడా, వారి సంకల్పం మూర్ఛితమైపోయే విధంగా కాళీ రూపంగా అవ్వండి.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top