01 December 2021 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

November 30, 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

“మధురమైన పిల్లలూ - క్రోధం కూడా చాలా పెద్ద ముల్లు, దీని వలన చాలామందికి దుఃఖం కలుగుతుంది, అందుకే ఈ ముల్లును తీసేసి సత్యాతి-సత్యమైన పుష్పంగా అవ్వండి”

ప్రశ్న: -

ముళ్ళ నుండి పుష్పాలుగా అయ్యే పిల్లలకు తండ్రి ఏ ధైర్యాన్ని ఇస్తారు?

జవాబు:-

పిల్లలూ, ముళ్ళ నుండి పుష్పాలుగా తయారవ్వడంలో మాయ ఇప్పటివరకు ఏ విఘ్నాలనైతే కలిగిస్తుందో – ఈ విఘ్నాలు ఒక రోజు సమాప్తమైపోతాయి. మీరంతా స్వర్గంలోకి వెళ్ళిపోతారు. ఈ కలియుగీ ముళ్ళు సమాప్తమైపోతాయి. తండ్రి మిమ్మల్ని సంగమయుగమనే పూలకుండీలో వేసారు. మాయ వాడిపోయేలా చేస్తుంది కానీ జ్ఞానమనే బీజం, అవినాశీ బీజము – ఈ బీజం వినాశనమవ్వదు.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

వారు మా నుండి విడిపోరు..

ఓంశాంతి. శివబాబా, మధురాతి-మధురమైన చాలా కాలం తర్వాత విడిపోయి కలిసిన ఆత్మిక పిల్లలకు, బ్రహ్మా తనువు ద్వారా గుహ్యమైన రహస్యాలను లేక జ్ఞానాన్ని అర్థం చేయిస్తున్నారు. ఒకటేమో, పిల్లలు పాటను విన్నారు – బాబా, మేము మీపైన బలిహారమవుతాము, ఎన్ని కష్టాలను సహించాల్సి వచ్చినా కూడా సహిస్తాము. కష్టాలు ఎందుకు వస్తాయి? ఎందుకంటే మనుష్యులకు విషం (వికారాలు) లభించవు. ఇది పిల్లలకు తెలుసు – మనకు ఆత్మ గురించి, పరమాత్మ గురించి ఇంతకుముందు తెలియదు. అలాగే స్వయం గురించి, తండ్రి గురించి కూడా తెలియదు. అందుకే జంతువుల బుద్ధి వలె ఉండేది. లౌకిక సంబంధంలో స్వయం గురించి తెలుసు, తండ్రి గురించి కూడా తెలుసు. మనుష్యులకు ఈ సమయంలో స్వయం గురించి మరియు పారలౌకిక తండ్రి గురించి ఏ మాత్రం తెలియనే తెలియదు. పరమాత్మకు నామ-రూప-దేశ-కాలాలేవీ లేవని అంటారు, అప్పుడు ఆత్మకు కూడా ఉండకూడదు. వారికి ఆత్మ గురించి కూడా తెలియదు. ఆత్మయే పరమాత్మ అని అంటారు. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు, ఆత్మ మరియు జీవం ఉంటాయని వారు కేవలం నామమాత్రంగా అంటారు. ఆత్మ అవినాశీ, జీవం వినాశీ అని అంటూ ఉంటారు. అచ్ఛా, ఆత్మ అంటే ఏమిటి, దాని రూపం రంగు ఏమిటి. ఆత్మ అని పేరైతే తెలుసు. కానీ అది ఎలా ఉంటుంది, ఏం చేస్తుంది, ఎలాంటి పాత్రను అభినయిస్తుంది, ఎంత సమయం పాత్రను అభినయిస్తుంది – ఈ ఆత్మ జ్ఞానాన్ని ఎవ్వరూ వర్ణించలేరు. ఆత్మ చిన్న నక్షత్రమని ఇప్పుడు మీకు తెలుసు. ఆత్మలోనే మొత్తం 84 జన్మల అవినాశీ పాత్ర నిశ్చయించబడి ఉంది. శంకరాచార్యుని ఆత్మ కూడా తన పాత్రను అభినయిస్తుంది. ఆత్మ సతోప్రధానం నుండి మళ్ళీ సతో, రజో, తమోలలోకి ఎలా వస్తుందో ఎవ్వరికీ తెలియదు. కేవలం భృకుటి మధ్యన ప్రకాశించే అద్భుతమైన సితార అని అంటారు. అంతే, ఇంకేమీ తెలియదు. ఆత్మ గురించి తెలియదు అంటే పరమాత్మ గురించి కూడా తెలియదు. ఈ సమయంలో ఇది ముళ్ళ అడవి. అందరూ ముళ్ళు లాగ ఉన్నారు. రచయిత అయిన పరమపిత పరమాత్మ గురించి తెలియదు, రచన ఆదిమధ్యాంతాల గురించి కూడా తెలియదు. పిల్లలైన మీరు నంబరువారు పురుషార్థానుసారంగా ఆత్మ మరియు పరమాత్మల గురించి తెలుసుకున్నారు. యథార్థ రీతిగా తెలియని పిల్లలు చాలామంది ఉన్నారు. దేహాభిమానంలో ఉన్న కారణంగా ధారణ పూర్తిగా జరగదు. నంబరువారుగా ఉన్నారు కదా. బాబా, వీరు ఎందుకిలా ఉన్నారు అని అడుగుతారు. బాబా అంటారు – పిల్లలూ, ఇప్పుడు రాజధాని స్థాపన అవుతుంది. ఇందులో అన్ని రకాల వారు తప్పకుండా కావాలి. రాతిబుద్ధి కలవారు అతి తక్కువ పదవిని పొందుతారు. ఒకవేళ స్వయం అర్థం చేసుకున్నట్లయితే, ఇతరులకు కూడా అర్థం చేయిస్తారు. మున్ముందు అర్థం చేయించడం మొదలుపెడతామని మీరంటారు. కానీ ఇటువంటివారు కూడా కొందరు కావాలి, అప్పుడే తక్కువ పదవి లభిస్తుంది కదా. రాజు ఎక్కడ, ప్రజలెక్కడ ఎంత తేడా ఉంది. ఇక్కడైతే రాజు, ప్రజ అందరికీ దుఃఖముంది. సత్యయుగంలో రాజుకు దుఃఖముండదు, ప్రజలకూ దుఃఖముండదు, కానీ పదవులలో తేడా ఉంటుంది. ధారణ పూర్తిగా లేని కారణంగా ఎవ్వరికీ అర్థం చేయించలేరు. అప్పుడిక ఏదో ఒక ముల్లు గుచ్చుకుంటూ ఉంటుంది. అప్పుడప్పుడు లోభం, అప్పుడప్పుడు మోహం… భూతాలు ప్రవేశిస్తూ ఉంటాయి. ఇది కూడా తప్పకుండా జరగనున్నది.

మీరు ప్రజాపిత బ్రహ్మాకుమార-కుమారీలు. ప్రజాపితకు తండ్రి ఎవరు? శివబాబా. ఇకపోతే, శివునికి తండ్రి అంటూ ఎవ్వరూ లేరు. ఈ బ్రహ్మా-విష్ణు-శంకరులు కూడా శివుని రచన. మరి అందరూ ఆత్మలైనట్లు. పరమపిత పరమాత్మ ఒక్కరే. బ్రహ్మా-విష్ణు-శంకరులు లేక లక్ష్మీ-నారాయణులు మొదలైన మనుష్యాత్మలెవ్వరి వలన ఎప్పుడూ గతి-సద్గతుల వారసత్వం లభించదు. మనుష్యులకు ఆత్మ గురించి యథార్థంగా తెలియదు, పరమాత్మ గురించి తెలియదు. ఒక్క పరమపిత పరమాత్మ మాత్రమే ఆత్మ యొక్క రియలైజేషన్ చేయించగలరు. జ్ఞానంతో సద్గతి కలుగుతుంది. జ్ఞానమైతే ఒక్క తండ్రి మాత్రమే ఇస్తారు. కొంతమంది పిల్లలైతే యజ్ఞంలో స్థూల సేవను కూడా చాలా చేస్తారు. ఈ సబ్జెక్టు ద్వారా కూడా మార్కులు లభిస్తాయి. ఇప్పుడు తండ్రి పిల్లలైన మీకు అమరకథను, మూడవ నేత్రం కథను వినిపిస్తారు. వాస్తవానికి ఇది కథ కాదు. ఇది ఆత్మిక జ్ఞానము, స్వయాన్ని మరియు తండ్రిని తెలుసుకోవడము. వారంటారు – ఎలాగైతే, నీటి నుండి నీటిబుడగ వెలువడుతుంది, మళ్ళీ కలిసిపోతుంది. అలాగే, మనం బ్రహ్మతత్వం నుండి జన్మించి పాత్రను అభినయించి, మళ్ళీ బ్రహ్మములోనే లీనమవుతాము లేదా బ్రహ్మముగానే అయిపోతాము, మరియు ఇంకే రచయిత మరియు రచనలకు సంబంధించిన జ్ఞానం లేనే లేదు. జ్ఞానమైతే తండ్రియే వచ్చి అర్థం చేయిస్తారు. వీరి పేరు శివ. కానీ కొంతమంది వారిని రుద్రుడు అని కూడా అంటారు, కొంతమంది పాప కటేశ్వరుడు అని కూడా అంటారు. అనేక పేర్లు పెట్టి పూజా సామాగ్రిని పెంచేసారు. పరమాత్మ ఏ-ఏ కర్తవ్యాలనైతే చేసారో, వాటికి రకరకాల పేర్లు పెట్టి చాలా మందిరాలను నిర్మించారు. ఇప్పుడు తండ్రి అంటారు – ఇది ముళ్ళ ప్రపంచము, విషయ సాగరము. ఈశ్వరుడు సర్వవ్యాపి కాదు – ఇది కూడా అందరి చేత రాయించడం జరుగుతుంది. తండ్రి వచ్చి భారత్ ను స్వర్గంగా తయారుచేస్తారు. అప్పుడు మొత్తం ప్రపంచం స్వర్గంగా అయిపోతుంది. ఈ విషయం కూడా ఎవ్వరి బుద్ధిలోకి రాదు. శాస్త్రాలన్నీ భక్తికి సంబంధించినవి. ఇకపోతే, ప్రతి ఒక్కరికీ వారి-వారి పనులకు సంబంధించిన జ్ఞానముంటుంది. కార్పెంటర్ (వడ్రంగి)కి కార్పెంటరీకీ సంబంధించిన జ్ఞానముంటుంది, డాక్టరుకు ఔషధాలకు సంబంధించిన జ్ఞానముంటుంది. ఇది ఆత్మిక జ్ఞానము, దీనిని ఒక్క పరమాత్మ మాత్రమే వచ్చి ఇస్తారు. పరమాత్మ అని ఎవరిని అంటారో మనుష్యులకు తెలియను కూడా తెలియదు. గీతలో శ్రీకృష్ణుని పేరును రాసేసారు. ఇదే ముఖ్యమైన విషయము. తల్లిదండ్రులను (గీతను) ఖండితం చేసారు, కనుక మిగిలిన శాస్త్రాలన్నీ అసత్యమైనవిగా అయిపోయాయి. అసత్యపు (కృత్రిమ) రాళ్ళ గనులు కూడా ఉంటాయి. ఇవి కూడా అసత్యపు రాళ్ళ వంటివి. పారసబుద్ధి కలవారు పారసపురి అయిన సత్యయుగంలో ఉంటారు. ఇది నరకము. ఓ పతితపావనా రండి, అని పిలుస్తారు అంటే తప్పకుండా పతితులుగా ఉన్నారు. నరకం మరియు స్వర్గం రెండూ భారత్ లోనే ఉన్నాయి. ఎవరైనా మరణిస్తే స్వర్గస్థులయ్యారని అంటారు. స్వర్గమని సత్యయుగాన్ని అంటారు అన్న విషయం బుద్ధిలోకి రాదు. పరమాత్మ స్వర్గ స్థాపన చేస్తారు, నరకాన్ని కాదు. రావణ రాజ్యం ఎప్పటి నుండి మొదలవుతుంది అనేది కూడా ఎవ్వరికీ తెలియదు. చాలా శాస్త్రాలను చదువుతారు, బ్రహ్మచర్యంలో కూడా ఉంటారు, కానీ జన్మ అయితే వికారాలతోనే జరుగుతుంది కదా. సాధు-సన్యాసులు కూడా సాధన చేస్తారు, తండ్రి నుండి ముక్తిని కోరుకుంటారు ఎందుకంటే ఛీ-ఛీ ప్రపంచంలో ఉండడానికి ఇష్టపడరు. ఇప్పుడు తండ్రి అంటారు – ముందు ఆత్మ గురించి తెలుసుకోండి – ఆత్మ జనన-మరణాలలోకి ఎలా వస్తుంది, సత్యమైన బంగారంలోకి మాలిన్యం ఎలా చేరుతుంది, 84 జన్మల పాత్రను ఎలా అభినయిస్తుంది. అందరికంటే ఎక్కువ పాత్రలు మీవే. ఎవరైతే దేవీ-దేవతలుగా ఉండేవారో, వారే పూర్తి 84 జన్మలు తీసుకుంటారు. లక్ష్మీ-నారాయణులు రాజ్యం చేసిన తర్వాత ఎక్కడకు వెళ్ళారు? వారి ఆత్మలు తప్పకుండా జన్మలు తీసుకుని ఉంటాయి కదా. ఇప్పుడు వారు ఎక్కడున్నారో ఎవ్వరికీ తెలియదు. ఈ సమయంలో క్రీస్తు నిరుపేద పాత్రలో ఉంటారని క్రైస్తవులకు తెలుసు. మీకు మంచి రీతిగా తెలుసు – లక్ష్మీనారాయణులు, ఎవరైతే స్వర్గానికి యజమానులుగా ఉండేవారో, వారే పునర్జన్మలు తీసుకుని 84 జన్మలు పూర్తి చేయనున్నారు. ఆత్మలందరూ 84 జన్మలు తీసుకోవు. ఈ జ్ఞానాన్ని కూడా బుద్ధిలో ధారణ చేయాలి. యోగంలో లేకుండా ముళ్ళ నుండి పుష్పాలుగా తయారవ్వలేరు. యోగంతోనే వికర్మలు వినాశనమవుతాయి మరియు సతోప్రధాన పుష్పాలుగా అవుతారు. ఎప్పటివరకైతే ఇక్కడ ఉంటారో, అప్పటివరకు ఏదో ఒక ముళ్ళ యొక్క అంశం ఉంటుంది. పుష్పంగా అయిన తర్వాత మీరు ఇక్కడ ఉండలేరు. పుష్పాలతోట అని సత్యయుగాన్ని అంటారు. ఇప్పుడు మీరు ముళ్ళ అడవిలో అనగా రావణ రాజ్యంలో ఉన్నారు. అందరూ ముళ్ళుగానే ఉన్నారు. ఎవరైతే చాలా ముళ్ళను పుష్పాలుగా తయారుచేస్తారో, వారినే సత్యమైన సుగంధభరిత పుష్పాలని అంటారు. పుష్పాల రాజు అనే ఒక పుష్పం ఉంటుంది, అది తెల్లగా ఉంటుంది. టేబుల్ పై పెడతారు, అప్పుడది వికసిస్తూ ఉంటుంది, సుగంధం పెరుగుతూ ఉంటుంది. ఇటువంటి పుష్పం ఇంకేదీ ఉండదు. ఇప్పుడు పుష్పాలరాజు ఉంటే రాణి కూడా కావాలి. (నైట్ క్వీన్) గులాబి, మల్లె మొదలైనవి మంచి-మంచి పుష్పాలు. ఫ్లవర్ షో (పుష్ప ప్రదర్శన) చూపిస్తారు. అక్కడకు అందరూ మంచి-మంచి పుష్పాలను తీసుకొస్తారు. ఎవరైతే మంచి-మంచి పుష్పాలను తీసుకొస్తారో, వారికి బహుమతి కూడా లభిస్తుంది. మీరు కూడా పుష్పాల తోటను తయారుచేస్తారు కదా. శివునికి పుష్పాలను అర్పిస్తారు, అందులో రత్నజ్యోతిని, జిల్లేడు పూలను కూడా సమర్పిస్తారు. బాబా అర్థం చేయించారు – ఇక్కడ నేను పిల్లలైన మిమ్మల్ని పుష్పాలుగా తయారుచేసే పాత్రను అభినయిస్తాను. గులాబి పుష్పం ఎవరు, మల్లె ఎవరు, రత్న జ్యోతి ఎవరు, జిల్లేడు పుష్పం ఎవరు అన్నది నాకు తెలుసు. అన్నింటికంటే ఛీ-ఛీ పుష్పం – జిల్లేడు పుష్పం. వారి నడవడికయే ముళ్ళ వలె ఉంటుంది. కొంతమంది చాలా పదునైన ముళ్ళ వలె ఉంటారు. క్రోధం కూడా ఒక ముల్లే, చాలామందికి దుఃఖాన్నిస్తారు. ఇప్పుడు మీరు ముళ్ళ ప్రపంచం నుండి దూరంగా ఉన్నారు, సంగమంలో ఉన్నారు. ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతున్నారు. ఎలాగైతే తోటమాలి ముళ్ళను తీసేసి, పుష్పాలను వేరే పూలకుండీలో పెడతారు. అలా, మిమ్మల్ని కూడా బాబా వేరు చేసేసారు. మీరు సంగమంలో ఉన్నారు. మీకు మరమ్మత్తులు జరుగుతూ ఉంటాయి. కానీ మాయ ముళ్ళుగా చేసేస్తుంది. అయినా కూడా, ఒక్కసారి నా వారుగా అయ్యారు కదా… కనుక ఈ మాయ యొక్క విఘ్నాలు కూడా ఒక రోజు సమాప్తమైపోతాయి. అప్పుడిక పూలకుండీలో వేసిన పుష్పాలన్నీ స్వర్గంలోకి వెళ్ళిపోతాయి. కలియుగంలోని ముళ్ళన్నీ భస్మమైపోతాయి. మీరు ఎంత కొంచెం మంది పుష్పాలు ఉన్నారు. మిమ్మల్ని సంగమయుగమనే పూలకుండీలో వేసారు. బీజం నాటబడింది. మాయా తుఫాన్లు వస్తే, వాడిపోయేలా చేస్తాయి. అయినా అవినాశీ జ్ఞానం యొక్క బీజం ఒక్కసారి వేస్తే, అది వినాశనమవ్వదు.

తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తారు – పిల్లలైన మీరు చాలా-చాలా నిర్భయులుగా అవ్వాలి. బాబా అంటారు – ఇది వ్రాయండి – ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత మేము ఈ సంగమయుగంలో ఈ మేళాలు, ప్రదర్శినీలను చూపించడానికి వస్తాము. ఇది కూడా వ్రాయాలి – పాత ప్రపంచాన్ని కొత్తదిగా తయారుచేసేందుకు మరియు నరకవాసులను స్వర్గవాసులుగా తయారుచేసేందుకు 5 వేల సంవత్సరాల తర్వాత ఈ యుద్ధం జరుగుతుంది. బాబా డైరెక్షన్ లనైతే చాలా ఇస్తారు. యుక్తులనైతే చాలా సహజమైనవి తెలియజేస్తారు. తండ్రిని స్మృతి చేయండి మరియు స్వర్గం రాజ్యాధికారాన్ని తీసుకోండి. మనుష్యులు నీటిలో మునకలు వేస్తూ ఉంటారు. వాస్తవానికి సాగరంలో మునగాలి కదా. నదులు సాగరం నుండే వెలువడ్డాయి. సాగరం నదుల తండ్రి కదా, అక్కడకు వెళ్ళి స్నానం చేయండి. కానీ అది ఉప్పు నీరు, అందుకే మధురమైన నీటి నదులలో స్నానాలు చేస్తారు. ఇప్పుడు మీరు జ్ఞాన సాగరుని పిల్లలు. జ్ఞాన సాగరుడు పతితపావనుడు తండ్రి, మీరు వారి పిల్లలు. ఎవరు ఎంత ఎక్కువ సేవ చేస్తారో, వారిని మంచి పుష్పాలుగా భావించడం జరుగుతుంది. ప్రదర్శినీలలో కూడా పదే-పదే మంచి పుష్పాలను పిలుస్తూ ఉంటారు. ఫలానావారు మా కంటే తెలివైనవారని భావిస్తారు. కానీ తెలివైనవారికి గౌరవాన్ని కూడా ఇవ్వాలి. బాబా ఎల్లప్పుడూ అర్థం చేయిస్తారు – ఎప్పుడూ క్రోధం చేయకండి, ప్రేమగా అర్థం చేయించండి. ఎవరైనా క్రోధం చేస్తే, వీరిలో కఠినమైన భూతముందని బాబా భావిస్తారు. తల్లిదండ్రులపైన కూడా క్రోధం చేయడంలో ఆలస్యం చేయరు, అటువంటివారు ఇంకా దుర్గతిని పొందుతారు. పేదల పెన్నిధి ఎప్పుడైనా పేదవారిపై క్రోధం చేస్తారా. పేదల పెన్నిధి బాబా పేదవారిని షావుకార్లుగా తయారుచేయడానికే వచ్చారు. ఇక్కడ ఎవరైతే పదమపతులుగా ఉన్నారో, మరొక జన్మలో నౌకర్లుగా అవుతారు. పేదవారు ఎవరైతే మంచి రీతిగా చదువుకుంటారో, వారు వెళ్ళి రాజా-రాణులుగా అవుతారు. ఈశ్వరీయ సేవలో ఏమీ ఇవ్వనివారు కూడా సెంటర్లకు వస్తూ ఉంటారు. కొన్ని బీజాలను నాటినా కూడా, మా భవిష్యత్తు ఎంత ఉన్నతంగా తయారవుతుంది అన్నది వారికి తెలియనే తెలియదు. సుదాముని ఉదాహరణ ఉంది కదా. ఈశ్వరార్థం దానం చేస్తారు. మరుసటి జన్మలో ఫలం లభిస్తుందని భావిస్తారు. బాబా రాస్తారు – పిల్లలూ, మీకు ఒక ఇటుకకు బదులుగా మహళ్ళు లభిస్తాయి అని. ఇక్కడ గవ్వలనిస్తారు, అక్కడ వజ్రాలుగా అవుతాయి. అందుకే, పిడికెడు అటుకులకు గాయనముంది. గురునానక్ యొక్క మందిరాలకు వెళ్తారు, అప్పుడు ఏదో ఒకటి తప్పకుండా ఇస్తారు. కానీ ఇక్కడైతే తండ్రి దాత కదా. అచ్ఛా.

మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. చాలా-చాలా నిర్భయులుగా అయ్యి ముళ్ళను పుష్పాలుగా తయారుచేసే సేవ చేయాలి. అందరిలో అవినాశీ బీజాన్ని నాటుతూ ఉండాలి.

2. క్రోధం యొక్క ముల్లు చాలా పెద్దది, దానిని వదిలి చాలా-చాలా ప్రియంగా అవ్వాలి. ప్రేమతో సేవ చేయాలి. సర్వీసబుల్ గా ఉన్నవారిని గౌరవించాలి.

వరదానము:-

సదా ఏకరసమైన ఉల్లాస-ఉత్సాహాలలో ఉండడానికి, సంబంధంలోకి ఎవరు వచ్చినా వారిని సంతుష్టపరచాలి అనే ఉత్కంఠత ఉండాలి. ఎవరిని చూసినా కానీ, వారి నుండి ప్రతి సమయం గుణాలనే తీసుకుంటూ ఉండాలి. సర్వుల గుణాల యొక్క బలం లభించినప్పుడు ఉత్సాహం సదా కాలం కోసం ఉంటుంది. ఎప్పుడైతే ఇతరుల భిన్న-భిన్న స్వరూపాలు, భిన్న-భిన్న విషయాలను చూస్తారో, వింటారో అప్పుడు ఉత్సాహం తగ్గిపోతుంది. కానీ గుణాలను చూసే ఉత్కంఠత ఉన్నట్లయితే ఏకరస ఉత్సాహముంటుంది మరియు సర్వుల గుణాలను చూసినట్లయతే స్వయం గుణమూర్తులుగా అయిపోతారు.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top