01 April 2022 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

March 31, 2022

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

‘‘మధురమైన పిల్లలూ - సద్గతిలోకి వెళ్ళాలంటే తండ్రితో ప్రతిజ్ఞ చేయండి, బాబా, మేము మిమ్మల్నే స్మృతి చేస్తూ ఉంటాము’’

ప్రశ్న: -

ఏ పురుషార్థం యొక్క ఆధారంతో సత్యయుగీ జన్మ సిద్ధ అధికారం ప్రాప్తిస్తుంది?

జవాబు:-

ఇప్పుడు పూర్తి బికారిగా అయ్యేటువంటి పురుషార్థం చేయండి. పాత ప్రపంచంతో మమకారాన్ని తొలగించి ఎప్పుడైతే పూర్తి బికారిగా అవుతారో, అప్పుడే సత్యయుగీ జన్మ సిద్ధ అధికారం ప్రాప్తిస్తుంది. బాబా అంటారు, మధురమైన పిల్లలూ, ఇప్పుడు ట్రస్టీగా అవ్వండి. పాత పనికిరాని చెత్త ఏదైతే ఉందో, అంతా ట్రాన్స్ఫర్ చేయండి, తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేసినట్లయితే మీరు స్వర్గంలోకి వచ్చేస్తారు. వినాశనం ఎదురుగా నిలబడి ఉంది, అందుకే ఇప్పుడు పాత బ్యాగ్-బ్యాగేజ్ అంతటినీ సర్దుకోండి.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

భోళానాథుని కన్నా అతీతమైనవారు లేరు… (భోలేనాథ్ సే నిరాలా…)

ఓంశాంతి. మీరు విద్యార్థులు. ఉన్నతాతి ఉన్నతమైన నాలెడ్జ్ ఫుల్ తండ్రి మిమ్మల్ని చదివిస్తున్నారు, కావున నోట్స్ తప్పకుండా తీసుకోవాలి ఎందుకంటే మళ్ళీ రివైజ్ చేయించాల్సి ఉంటుంది, ఇతరులకు అర్థం చేయించడం కూడా సహజమవుతుంది. లేదంటే మాయ ఎటువంటిదంటే, చాలా పాయింట్లను మరపింపజేస్తుంది. ఈ సమయంలో పిల్లలైన మీ యుద్ధం మాయా రావణుడితో ఉంది. ఎంతగా మీరు శివబాబాను స్మృతి చేస్తారో, అంతగా మాయ మరపింపజేసే ప్రయత్నం చేస్తుంది. జ్ఞానం యొక్క పాయింట్స్ ను కూడా మరపింపజేసే ప్రయత్నం చేస్తుంది. అప్పుడప్పుడు చాలా మంచి పాయింట్లు గుర్తుకొస్తాయి, మళ్ళీ అక్కడికక్కడే మాయమైపోతాయి ఎందుకంటే ఈ జ్ఞానం కొత్తది. కల్పక్రితం కూడా బ్రాహ్మణులైన మీకు ఈ జ్ఞానాన్ని ఇచ్చాను అని తండ్రి అంటారు. బ్రహ్మా నోటి ద్వారా బ్రాహ్మణులనే తమవారిగా చేసుకుంటారు. ఈ విషయాలు గీతలో ఏమీ రాసి లేవు. శాస్త్రాలైతే తర్వాత తయారవుతాయి. ఎప్పుడైతే ధర్మ స్థాపన చేస్తారో, ఆ సమయంలో అన్ని శాస్త్రాలు తయారవ్వవు. పిల్లలకు అర్థం చేయించడం జరిగింది, మొట్టమొదట జ్ఞానము, తర్వాత భక్తి. మొదట సతోప్రధానము, తర్వాత సతో, రజో, తమోలలోకి వస్తారు, మనుష్యులు ఎప్పుడైతే రజోలోకి వస్తారో, అప్పుడు భక్తి మొదలవుతుంది. సతోప్రధాన సమయంలో భక్తి ఉండదు. భక్తి మార్గం కూడా డ్రామాలో నిశ్చయించబడింది. ఈ శాస్త్రాలు మొదలైనవి కూడా భక్తి మార్గంలో పనికొస్తాయి. మీరు ఈ జ్ఞానం మరియు యోగం మొదలైనవాటి పుస్తకాలు ఏవైతే తయారుచేస్తారో, ఇవి మళ్ళీ చదువుకొని రిఫ్రెష్ అవ్వడం కోసము. ఇకపోతే, టీచరు తప్ప ఇంకెవరూ అర్థం చేసుకోలేరు. గీత యొక్క టీచరే శ్రీమత్ భగవాన్. వారు విశ్వ రచయిత, స్వర్గాన్ని రచిస్తారు. వారు అందరికీ తండ్రి కావున తప్పకుండా తండ్రి నుండి స్వర్గ రాజ్యం యొక్క వారసత్వం లభించాలి. సత్యయుగంలో దేవీ-దేవతల రాజ్యం ఉంటుంది. ఇప్పుడు మీరు సంగమయుగీ బ్రాహ్మణులు. విష్ణువు చిత్రంలో 4 వర్ణాలను చూపిస్తారు కదా. దేవత, క్షత్రియ, వైశ్య, శూద్ర… ఐదవ వర్ణము బ్రాహ్మణులది. కానీ వారికి దీని గురించి అసలు తెలియదు. ఉన్నతాతి ఉన్నతమైనది బ్రాహ్మణ వర్ణము. ఉన్నతాతి ఉన్నతుడైన పరమపిత పరమాత్మను కూడా మర్చిపోయారు. ఆ శివుడే, బ్రహ్మా-విష్ణు-శంకరుల రచయిత. త్రిమూర్తి బ్రహ్మా అని అంటారు, కానీ దీనికైతే అర్థమే వెలువడదు. ఒకవేళ బ్రహ్మా-విష్ణు-శంకరులు ముగ్గురూ సోదరులైతే, వారికి తండ్రి ఉండాలి. కావున బ్రాహ్మణ, దేవీ-దేవతా మరియు క్షత్రియ… మూడు ధర్మాల రచయిత ఆ నిరాకార తండ్రి, వారిని గీతా భగవంతుడు అని అంటారు. దేవతలను కూడా భగవంతుడు అని అనలేరు, అలాంటప్పుడు మునుష్యులను ఎలా అనగలరు. ఉన్నతాతి ఉన్నతమైనవారు శివబాబా, తర్వాత సూక్ష్మవతనవాసులైన బ్రహ్మా-విష్ణు-శంకరులు, ఆ తర్వాత ఈ వతనంలో మొట్టమొదటి వారు శ్రీకృష్ణుడు. మొట్టమొదట శివజయంతి గురించి గాయనం జరుగుతుంది, త్రిమూర్తి జయంతి అని ఎక్కడా చూపించరు ఎందుకంటే ముగ్గురికీ ఎవరు జన్మనిస్తారు అనేది ఎవరికీ తెలియదు. ఇది తండ్రే వచ్చి తెలియజేస్తారు. వారు ఉన్నతాతి ఉన్నతమైనవారు, విశ్వానికి యజమాని, కొత్త ప్రపంచ రచయిత. స్వర్గంలో ఈ లక్ష్మీ-నారాయణులు రాజ్యం చేస్తారు. సూక్ష్మవతనంలోనైతే రాజధాని యొక్క ప్రశ్నే లేదు. ఇక్కడ ఎవరైతే పూజ్యులుగా అవుతారో, వారే పూజారులుగా అవ్వాలి. దేవత, క్షత్రియ… ఇప్పుడు మళ్ళీ బ్రాహ్మణులుగా అయ్యారు. ఈ వర్ణాలు భారత్ కు సంబంధించినవే, ఇంకెవ్వరూ ఈ వర్ణాలలోకి రాలేరు. ఈ 5 వర్ణాలలో కేవలం మీరే తిరుగుతారు. 84 జన్మలు కూడా మీరే పూర్తిగా తీసుకోవాల్సి ఉంటుంది. తప్పకుండా భారతవాసులైన మనము, ఎవరైతే దేవీ-దేవతా ధర్మానికి చెందినవారమో, వారే 84 జన్మలు తీసుకుంటామని మీకు తెలుసు. ఈ జ్ఞానం యొక్క మూడవ నేత్రం కేవలం బ్రాహ్మణులైన మీది మాత్రమే తెరుచుకుంటుంది, తర్వాత ఈ జ్ఞానమే ప్రాయః లోపమైపోతుంది. మరి గీతా శాస్త్రం ఎక్కడ నుండి వచ్చింది. క్రైస్టు ఎప్పుడైతే ధర్మ స్థాపన చేస్తారో, అప్పుడు బైబిల్ ను వినిపించరు. వారు పవిత్రతా బలంతో ధర్మ స్థాపన చేస్తారు. బైబిల్ మొదలైనవి తర్వాత తయారవుతాయి, ఎప్పుడైతే వారి వృద్ధి జరుగుతుందో, అప్పుడు చర్చ్ లు మొదలైనవి తయారుచేస్తారు. అదే విధంగా అర్ధకల్పం తర్వాత భక్తి మార్గం మొదలవుతుంది. మొట్టమొదట ఒక్కరిదే అవ్యభిచారి భక్తి జరుగుతుంది, తర్వాత బ్రహ్మా-విష్ణు-శంకరులది జరుగుతుంది. ఇప్పుడు చూడండి, 5 తత్వాలను కూడా పూజిస్తూ ఉంటారు, దీనిని తమోప్రధాన పూజ అని అంటారు. అది కూడా తప్పకుండా జరగాల్సిందే. భక్తి మార్గంలో శాస్త్రాలు కూడా కావాలి. దేవీ-దేవతా ధర్మ శాస్త్రం గీత. బ్రాహ్మణ ధర్మానికి ఏ శాస్త్రమూ లేదు. ఇప్పుడు మహాభారత యుద్ధం యొక్క వృత్తాంతము కూడా గీతలో ఉంది. రుద్ర జ్ఞాన యజ్ఞం ద్వారా వినాశ జ్వాల వెలువడింది అని గాయనం కూడా ఉంది. ఎప్పుడైతే వినాశనం జరుగుతుందో, తప్పకుండా అప్పుడే సత్యయుగీ రాజధాని స్థాపన అవుతుంది. కావున భగవంతుడు ఈ యజ్ఞాన్ని రచించారు, దీనిని రుద్ర జ్ఞాన యజ్ఞమని అంటారు. జ్ఞానం కూడా శివబాబానే ఇస్తారు. భారత్ యొక్క శాస్త్రం వాస్తవానికి ఒక్కటే. ఎలాగైతే క్రైస్టు యొక్క బైబిల్ ఉందో – వారి జీవిత కథను జ్ఞానం అని అనరు. మనకు జ్ఞానంతో సంబంధం ఉంది. జ్ఞానమిచ్చేవారు కూడా ఒక్కరే, వారే విశ్వానికి యజమాని. వాస్తవానికి, వారిని బ్రహ్మాండానికి యజమాని అని అనడం జరుగుతుంది. సృష్టికి యజమానిగా వారు అవ్వరు. పిల్లలైన మీరు సృష్టికి యజమానులుగా అవుతారు, నేను తప్పకుండా బ్రహ్మాండానికి యజమానిని అని బాబా అంటారు. పిల్లలైన మీతో పాటు బ్రహ్మలోకంలో ఉంటారు. ఎలాగైతే బాబా అక్కడ ఉంటారో, అలా మనం కూడా అక్కడకు వెళ్ళినట్లయితే, మనం కూడా యజమాని అయినట్లు.

తండ్రి అంటారు, ఆత్మలైన మీరంతా నాతో పాటు బ్రహ్మాండంలో ఉంటారు. కావున నేను మరియు మీరు కూడా బ్రహ్మాండానికి యజమానులము. కానీ మీ పదవి నా కన్నా ఉన్నతమైనది. మీరు మహారాజా-మహారాణిగా అవుతారు, మీరే పూజ్యుల నుండి మళ్ళీ పూజారులుగా అవుతారు. పతితులైన మిమ్మల్ని నేను వచ్చి పావనంగా చేస్తాను. నేనైతే జనన-మరణరహితుడను, మళ్ళీ సాధారణ తనువు యొక్క ఆధారాన్ని తీసుకొని సృష్టి ఆది మధ్యాంతాల రహస్యాన్ని మీకు తెలియజేస్తాను. పిల్లలైన మీకు తప్ప, బ్రహ్మాండము, సూక్ష్మవతనము మరియు సృష్టి చక్రం యొక్క రహస్యం గురించి తెలిసిన విద్వాంసులు గాని, పండితులు గాని ఎవ్వరూ లేరు. జ్ఞానసాగరుడు, పవిత్రతా సాగరుడైతే పరమపిత పరమాత్మ మాత్రమే అని మీకు తెలుసు. ఎప్పుడైతే మనకు జ్ఞానమిస్తారో, అప్పుడు వారి మహిమ గాయనం చేయబడుతుంది. ఒకవేళ జ్ఞానం ఇవ్వకపోతే, మహిమ ఎలా గాయనం చేయబడుతుంది. వారు ఒక్కసారే వచ్చి పిల్లలకు 21 జన్మల కోసం వారసత్వాన్ని ఇస్తారు. 21 జన్మల లిమిట్ ఉంది, అంతేకానీ సదా కోసం ఇస్తారని కాదు. 21 తరాలు అనగా 21 వృద్ధాప్యాల వరకు. తరము అని వృద్ధాప్యాన్ని అంటారు. 21 తరాలు మీకు రాజ్య-భాగ్యం లభిస్తుంది. అంతేకానీ ఒకరి వలన 21 కులాల ఉద్ధరణ జరుగుతుందని కాదు. ఈ రాజయోగం ద్వారా మీరు రాజులకే రాజులుగా అవుతారు అని అయితే అర్థం చేయించారు. మళ్ళీ అక్కడ జ్ఞానం అవసరముండదు. అక్కడ మీరు సద్గతిలో ఉంటారు. ఎవరైతే దుర్గతిలో ఉన్నారో, వారికి జ్ఞానం కావాలి. ఇప్పుడు మీరు సద్గతిలోకి వెళ్తారు, మాయా రావణుడు దుర్గతిలోకి తీసుకువచ్చాడు. ఇప్పుడు సద్గతిలోకి వెళ్ళాలి కావున తండ్రికి చెందినవారిగా అవ్వాల్సి ఉంటుంది, ప్రతిజ్ఞ చేయాల్సి ఉంటుంది – బాబా, మేము మిమ్మల్ని సదా స్మృతి చేస్తూ ఉంటాము. దేహాభిమానాన్ని వదిలి మేము దేహీగా అయి ఉంటాము. గృహస్థ వ్యవహారంలో ఉంటూ మేము పవిత్రంగా ఉంటాము. ఇది ఎలా జరుగుతుంది అని మనుష్యులంటారు. అరే, తండ్రి అంటారు, ఈ అంతిమ జన్మలో పవిత్రంగా అయి నాతో యోగం జోడించినట్లయితే, తప్పకుండా మీ వికర్మలు వినాశనమవుతాయి మరియు చక్రాన్ని స్మృతి చేసినట్లయితే మీరు చక్రవర్తీ రాజుగా అవుతారు. తండ్రి నుండి తప్పకుండా స్వర్గం యొక్క వారసత్వం లభిస్తుంది. దైవీ విశ్వ స్వరాజ్యము మీ జన్మ సిద్ధ అధికారము, దానిని మీరు పొందుతున్నారు. ఇక ఎవరెంతగా ప్రతిజ్ఞ చేస్తారో మరియు తండ్రికి సహాయకులుగా అవుతారో… వినాశనం ఎదురుగా నిలబడి ఉంది, ఇదైతే మీకు తెలుసు. ప్రకృతి వైపరీత్యాలు కూడా రానున్నాయి, అందుకే బాబా అంటారు, మీ పాత బ్యాగ్-బ్యాగేజ్ మొదలైనవన్నీ ట్రాన్స్ఫర్ చేయండి. మీరు ట్రస్టీగా అవ్వండి. బాబా వ్యాపారస్థుడు కూడా, ఇచ్చిపుచ్చుకోవడం కూడా చేస్తారు. మనుష్యులు మరణించినప్పుడు మొత్తం పనికిరానిదంతా చనిపోయిన వారి వస్తువులను తీసుకునేవారికి ఇచ్చేస్తారు కదా. మీ ఈ పనికిరానిదంతా శ్మశానగ్రస్థం అవ్వనున్నది, అందుకే పాత వస్తువుల పట్ల మమకారాన్ని తొలగించండి, పూర్తిగా బికారులుగా అవ్వండి. బికారుల నుండి రాకుమారులు, తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేసినట్లయితే మీరు స్వర్గానికి యజమానులుగా అవుతారు, అది జన్మ సిద్ధ అధికారము. ఎవరైనా వచ్చారంటే, వారిని అడగండి, విశ్వ రచయిత ఎవరు? గాడ్ ఫాదర్ కదా. స్వర్గం ఉన్నదే కొత్త రచన. తండ్రి స్వర్గాన్ని రచించినప్పుడు, మళ్ళీ నరకంలో ఎందుకు ఉన్నారు? స్వర్గానికి యజమానులుగా ఎందుకు అవ్వరు! మిమ్మల్ని నరకానికి చక్రవర్తిగా చేసినవాడు మాయా రావణుడు. తండ్రి, స్వర్గానికి చక్రవర్తిగా చేసేవారు. రావణుడు దుఃఖితులుగా చేస్తాడు, అందుకే రావణుడితో విసుగు చెంది, అతడిని కాల్చేందుకు ప్రయత్నిస్తారు, కానీ రావణుడు కాలనే కాలడు. రావణుడంటే ఏమిటి అనేది మనుష్యులు అసలు అర్థం చేసుకోరు. క్రీస్తు పూర్వం 3 వేల సంవత్సరాల క్రితం… గీతను వినిపించారు అని అంటారు. కానీ ఆ సమయంలో ఏ నేషనాలిటీ (జాతీయత) ఉండేదో అర్థం చేయించాలి కదా. మాయ పూర్తిగా పతితులుగా చేసేసింది. స్వర్గ రచయిత ఎవరు అనేది ఎవ్వరికీ తెలియదు. పాత్రధారులు అయి ఉండి, డ్రామా యొక్క రచయిత, దర్శకుని గురించి తెలియకపోతే ఏమంటారు! అతి పెద్ద యుద్ధము – ఈ మహాభారత యుద్ధము, ఇది వినాశనం కోసము. బ్రహ్మా ద్వారా స్థాపన… అని గాయనం కూడా జరుగుతుంది. కృష్ణుడి ద్వారా స్థాపన అని ఇలా అనరు. రుద్ర జ్ఞాన యజ్ఞం ప్రసిద్ధి చెందినది, దీని ద్వారా వినాశ జ్వాల ప్రజ్వలితమయ్యింది. నేను ఈ జ్ఞాన యజ్ఞాన్ని రచించానని తండ్రి స్వయంగా అంటారు. మీరు సత్యమైన బ్రాహ్మణులు, ఆత్మిక పండాలు. ఇప్పుడు మీరు తండ్రి వద్దకు వెళ్ళాలి. అక్కడ నుండి మళ్ళీ ఈ పతిత ప్రపంచంలోకి రావాలి. ఈ సెంటర్లు సత్యాతి-సత్యమైన తీర్థ స్థానాలు, సత్య ఖండంలోకి తీసుకువెళ్ళేవి. ఆ తీర్థ స్థానాలు అసత్య ఖండం కోసము. అది దైహిక, దేహాభిమానపు యాత్ర. ఇది దేహీ-అభిమానపు యాత్ర.

తర్వాత కొత్త ప్రపంచంలోకి వచ్చి మన బంగారు మహళ్ళను తయారుచేసుకుంటామని మీకు తెలుసు. సాగరం నుండి ఏవో మహళ్ళు వెలువడతాయని కాదు. మీకైతే చాలా సంతోషం ఉండాలి. ఎలాగైతే చదువులో, నేను బ్యారిస్టర్ గా అవుతాను, ఇది చేస్తాను అని ఆలోచన ఉంటుందో, అలాగే మీకు కూడా, స్వర్గంలో ఇలాంటి-ఇలాంటి మహళ్ళను తయారుచేస్తామనే ఆలోచన రావాలి. లక్ష్మిని తప్పకుండా వరిస్తాము, సీతను కాదు అని మనం ప్రతిజ్ఞ చేస్తాము. దీనికి చాలా మంచి పురుషార్థం కావాలి. తండ్రి ఇప్పుడు సత్యమైన జ్ఞానాన్ని వినిపిస్తారు, దీనిని ధారణ చేయడంతో మనం దేవతలుగా అవుతున్నాము. నంబరువన్ లో శ్రీకృష్ణుడు వస్తారు. ఎవరైతే మెట్రిక్ లో పాస్ అవుతారో, వారి లిస్టు వార్తాపత్రికలలో వస్తుంది కదా. మీ స్కూలు యొక్క లిస్టు కూడా మహిమ చేయబడింది. 8 మంది ఫుల్ పాస్, పేరు-ప్రఖ్యాతి చెందినవారు 8 రత్నాలు, వారే ఉపయోగపడతారు. 108 మాలనైతే చాలా మంది స్మరిస్తారు. కొందరైతే 16 వేలది కూడా తయారుచేస్తారు. మీరు శ్రమ చేసి భారత్ యొక్క సేవ చేసారు, అందుకే అందరూ పూజిస్తారు. ఒకటేమో భక్తుల మాల, రెండవది రుద్ర మాల.

శ్రీమద్భగవద్గీత తల్లి అని మరియు తండ్రి శివ అని ఇప్పుడు మీకు తెలుసు. దైవీ వంశంలో మొట్టమొదట జన్మ తీసుకునేవారు, శ్రీకృష్ణుడు. తప్పకుండా రాధే కూడా జన్మ తీసుకొని ఉంటారు, ఇతరులు కూడా పాస్ అయ్యి ఉంటారు. పరమపిత పరమాత్మ నుండి విముఖులుగా అయిన కారణంగా మొత్తం ప్రపంచమంతా అనాథగా అయిపోయింది. పరస్పరంలో అందరూ కొట్లాడుకుంటూ-గొడవపడుతూ ఉంటారు. నాథుడు ఎవరూ లేరు. ఇప్పుడు మీరు అందరికీ తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. అచ్ఛా.

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. దేహాభిమానాన్ని వదిలి దేహీ-అభిమానులుగా అయి, స్మృతి యాత్రలో తత్పరులై ఉండాలి, ఈ అంతిమ జన్మలో పవిత్రంగా అయి తండ్రికి పూర్తి-పూర్తి సహాయకులుగా అవ్వాలి.

2. పాత వస్తువులు ఏవైతే ఉన్నాయో, వాటిపై మమకారాన్ని తొలగించి, ట్రస్టీగా అయి తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేసి, విశ్వానికి యజమానులుగా అవ్వాలి.

వరదానము:-

సదా గుర్తు పెట్టుకోండి, సత్యతకు గుర్తు సభ్యత. ఒకవేళ మీలో సత్యతా శక్తి ఉన్నట్లయితే, సభ్యతను ఎప్పుడూ విడిచిపెట్టకండి. సత్యతను ఋజువు చేయండి కానీ సభ్యతాపూర్వకంగా. సభ్యతకు గుర్తు నిర్మాణము మరియు అసభ్యతకు గుర్తు మొండితనము. కావున ఎప్పుడైతే సభ్యతాపూర్వకమైన మాటలు మరియు నడవడిక ఉంటాయో, అప్పుడు సఫలత లభిస్తుంది. ఇదే ముందుకు వెళ్ళేందుకు సాధనము. ఒకవేళ సత్యత ఉంది కానీ సభ్యత లేనట్లయితే, సఫలత లభించజాలదు.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top